
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (Tata Motors)లో తన సత్తా చాటింది (Best selling cars in june ).
దేశవ్యాప్తంగా జూన్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మొదటి, రెండు స్థానాలను దక్కించుకుంది. టాప్ -10లో వరుసగా టాటా పంచ్, నెక్సాన్ ముందు వరుసలో నిలిచాయి. ఆ తర్వాత మారుతీ సుజుకీకి చెందిన ఆరు మోడళ్లు టాప్‌లో ఉన్నాయి. దీంతో అత్యధిక మోడళ్లు విక్రయించిన కంపెనీగా మారుతీ సుజుకీ నిలిచింది. హ్యుందాయ్‌కి చెందిన క్రెటా ఈ జాబితాలో చోటు సాధించకపోవడం గమనార్హం.
టాటా కంపెనీ దేశీయంగా మొత్తం 63,083 యూనిట్లను విక్రయించింది. దీంతో గతేడాది ఇదేకాలంతో పోలిస్తే 69% వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఇందులో రికార్డు స్థాయిలో 14,800 విద్యుత్ కార్లు ఉన్నాయి. 21,006 యూనిట్ల విక్రయాలతో టాటా పంచ్ తొలి స్థానాన్ని ఆక్రమించింది. మూడో స్థానంలో నిలిచిన మారుతీ సుజుకీ డిజైర్.. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ కారుగా నిలిచింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.