
మనం ఒక మాల్ కి వెళ్ళినప్పుడు బట్టలు సెలెక్ట్ చేసుకొని ట్రయిల్ చేస్తాం. నచ్చినవే తీసుకుంటాం. మరి మనం ట్రయిల్ చేసిన బట్టలను మళ్ళీ మడతపెట్టి అక్కడ పెట్టేస్తారు కదా?
అలాంటి ట్రయిల్ చేసిన బట్టలను పెద్ద హీరోయిన్లకు పంపితే ఎలా ఉంటుంది. త్రిష (Trisha) అదే సమస్య ఫేస్ చేస్తోంది.
ఆమె తాజాగా “జారా” (Zara) బ్రాండ్ ని ట్యాగ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్ బాగా వైరల్ అయింది. ఆమె పోస్ట్ లోని మేటర్ ఏంటంటే ఆమె ఆన్ లైన్ లో “జారా” బ్రాండ్ దుస్తులు బుక్ చేసుకుంటే ఇప్పటివరకు మూడు సార్లు వాసనతో కూడినవి పంపారట.
అంటే ఎవరో వేసుకొని విడిచిన బట్టలను ఆమెకి పంపారు. “ఇప్పటికే ఇలా మూడు సార్లు జరిగింది. ఇంకోసారి వాసనలు లేని క్లిన్ దుస్తులు పంపండి,” అంటూ జారా టీంని మెసేజ్ పెట్టింది.
ఆమెలా మాకు కూడా అనుభవం అయింది అంటూ అందరూ మెసేజ్ లు పెడుతున్నారు. కొత్త బట్టలు అంటే కొత్తవే ఉండాలి, వేరే వాళ్ళు విడిచినవి కాదు అంటూ ఆమె ఫ్యాన్స్ కూడా ఆమెకి సపోర్ట్ ఇచ్చారు.