బిజీ రోజుల్లో ఒకేసారి ఫేస్ వాష్ చేస్తుంటారు. వీకెండ్లో ఫ్రీగా ఉంటే రెండుసార్లు క్లెన్సింగ్ చేయండి. ముందుగా ఏదైనా ఆయిల్ కలిగిన క్లెన్సర్‌తో క్లీన్ చేసుకోండి.
తర్వాత వాటర్ బేస్డ్ ఫోమింగ్ ఫేస్ వాష్ ఉపయోగించి క్లీన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖంపైన చెమట, మురికి, సెబమ్ అన్నీ క్లీన్ అయిపోతాయి.
వీకెండ్లో కచ్చితంగా నేచురల్ స్క్రబ్ ఉపయోగించి మీ ముఖాన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకోండి. దీనికోసం ముల్తానీ మట్టి-రోజ్ వాటర్, శనగ పిండి-పసుపు-తేనె, ఓట్స్-తేనె, ఆలివ్ ఆయిల్-కాఫీ పొడి వంటి స్క్రబ్ ఉపయోగిస్తే మరీ మంచిది. ఇవి మీ చర్మంపై మృతకణాలు వదిలించి యవ్వనంగా ఉంచుతాయి.
ఐస్ క్యూబ్ థెరపీ కూడా చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో సహాయపడుతుంది. దీనికోసం ఐస్ క్యూబ్‌ను క్లాత్‌లో చుట్టి రెండు నిమిషాలు ముఖానికి మర్దన చేయండి. దీనివల్ల ముఖం ఉబ్బడం, నల్ల మచ్చలు వంటివి తొలగిపోతాయి. గ్లో కూడా వస్తుంది.
వీకెండ్లో ఫ్రీగా ఉన్నపుడు ముఖానికి బాగా ఆవిరి పట్టండి. ఇలా చేయడం వల్ల ముఖంపైన రంధ్రాలు శుభ్రం అవుతాయి. చర్మం అందంగా కనిపిస్తుంది. దీనికోసం వేడి నీటిలో లావెండర్ ఆయిల్ లేదా చమోమిలే ఆయిల్ వేసి ఆవిరి పెడితే చాలా మంచిది.
చర్మాన్ని ఎల్లపుడూ తేమగా ఉంచి అందంగా మార్చడంలో మాయిశ్చరైజర్ ఉపయోగపడుతుంది. దీనికోసం సెరామైడ్ ఉన్న మాయిశ్చరైజర్ వాడటం మంచిది.
ముఖం ఎల్లపుడూ తేమగా ఉండటం కోసం ఫేస్ వాష్ చేసుకున్నాక, జిడ్డుగా ఉన్నపుడు టోనర్ అప్లై చేయండి. దీనికోసం రోజ్ వాటర్ లేదా అలోవెరాను ఉపయోగించొచ్చు. ఇది చర్మం పీహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది. మిమ్మల్ని అందంగా ఉంచుతుంది.
వీకెండ్లో ముఖానికి జోజోబా ఆయిల్, రోజ్‌హిప్ ఆయిల్, కుంకుమాది వంటి సంప్రదాయ నూనె రాసి మర్దన చేయండి. చేతులతో లేదా గ్వుషా పరికరంతో మసాజ్ చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, ముఖాన్ని మెరిపించడంలో సీరమ్ ఉపయోగపడుతుంది. దీనికోసం విటమిన్ సి సీరమ్ ఉపయోగించొచ్చు.
నిద్ర వల్ల చర్మ కణాలు రిపేర్ అవుతాయి. స్కిన్ గ్లో పెరుగుతుంది. అందుకే వీక్ డేస్‌లో నిద్ర లేకపోతే వీకెండ్లో రోజుకు 8 గంటలు నాణ్యమైన నిద్రపోండి. అలాగే సిల్క్ పిల్లో వాడటం మంచిది.