
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో వస్తానంటూ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఫుల్ జోష్‌లో సినిమాలు చేస్తున్నారు.
ఇప్పుడు వెంకటేశ్, కల్యాణ్ రామ్ ప్రధానపాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను ప్రకటించిన నాటి నుంచి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఓ మలయాళ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రానుందంటూ వార్తలు వైరల్ కాగా.. నటి కీర్తి సురేశ్ ఈ వార్తలకు చెక్ పెట్టారు.
‘#VenkyAnil5’ అనే పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో వెంకటేశ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తుండగా.. కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి కనిపించనున్నారు. తాజాగా ఓ ఇన్‌స్టా పేజ్ దీనిపై అప్డేట్ అంటూ.. ఓ విషయాన్ని పంచుకుంది. ఈ సినిమా 2024లో విడుదలైన మలయాళ కామెడీ చిత్రం ‘గురువాయూర్ అంబలనాదయిల్’కు (Guruvayoor Ambalanadayil) రీమేక్‌గా రానున్నట్లు పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌కు కీర్తి స్పందిస్తూ.. అది నిజం కాదన్నారు. దీంతో ఈ వార్తలకు చెక్ పెట్టినట్లైంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రాయలసీమ నేపథ్యంలో అనిల్ మార్క్ కథ, హాస్యంతో రూపొందుతోంది.
గతేడాది అనిల్- వెంకటేశ్ కాంబోలో పండక్కి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ బరిలో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోష్‌తో మరోసారి నవ్వులు పంచేందుకు ఈ సినిమాతో సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సెట్స్‌పైన ఉన్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కొన్నేళ్ల క్రితం తన అభిమాని అన్న ‘అయ్యగారు’ అనే మాట స్టిక్కర్లా అంటుకుపోయిందని నటుడు అక్కినేని అఖిల్ అన్నారు.