
కుప్పం: రాయలసీమలో రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో ప్రైవేటు రంగం వాటా రూ.60 వేల కోట్లు కాగా.. ప్రభుత్వం రూ.
40వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించిన చంద్రబాబు.. రూ.117 కోట్లతో అధునాతన బస్‌స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాయన్నారు.
‘‘ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం ఇక్కడికి రావాలి. కుప్పం నుంచి మరోచోటుకు వెళ్లే పరిస్థితులు రాకూడదు. రూ.9,320 కోట్లతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. వ్యవసాయంలో సెరీ కల్చర్ దిశగా ముందుకు సాగుతున్నాం. కుప్పం నియోజకవర్గంలో పూర్తిగా వాణిజ్య పంటలు చేపట్టాలి. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. తాజా కూరగాయాలు ఇంటిపైనే పండించుకునే ఏర్పాటు చేసుకోవాలి. స్కూటర్లు, కార్లు, ట్రాక్టర్లు అన్నీ విద్యుత్‌తో నడిచే పరిస్థితులు రావాలి. పెట్రోల్, డీజిల్ బాయ్‌కాట్ చేసి.. విద్యుత్ వాహనాలు వాడుదాం. రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్సులకు అవసరమైన విద్యుత్‌ను సోలార్ ద్వారా ఆర్టీసీనే తయారు చేసుకుంటుంది.
వందల మంది పౌల్ట్రీ రైతులకు చేయూతనిస్తాం. నియోజకవర్గం నుంచి పారిశ్రామికవేత్తలుగా మారేందుకు నాంది పలుకుదాం. అడిడాస్ పరిశ్రమ ద్వారా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ పరిశ్రమలు వచ్చాయి. 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి స్థాయికి కుప్పం చేరుతుంది. డ్వాక్రా సంఘాల ద్వారా గడ్డి పెంచి కమ్యూనిటీ ఫోరమ్‌ల ద్వారా సరఫరా చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా మారిన ఆహారపు అలవాట్ల మేరకు పంటలు రావాలి.
మైక్రో ఇరిగేషన్ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా మారింది. కృష్ణా, గోదావరి సహా ఏ రిజర్వాయర్‌లోకి ఇప్పటికీ నీరు రాలేదు. పర్యావరణం కాపాడుకున్న చోటే సమతుల్యం ఉంటుంది. ప్రపంచంలోని మెడికల్ నాలెడ్జ్‌ను ప్రజల ఇళ్ల వద్దకు చేర్చుతాం. స్వర్ణ కుప్పం కావాలనేది నా ఆకాంక్ష. స్వర్ణ యుగానికి నాంది స్వర్ణ కుప్పం. త్వరలో కుప్పంలో బంగారం ఉత్పత్తి చేసి స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాం’’ అని చంద్రబాబు అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తిరుమల శ్రీవారి దర్శనానికి 116 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు అలిపిరి మెట్లెక్కి నడుచుకుంటూ వెళ్లింది.
వారంతా విధి వంచితులు. పెళ్లైన కొన్నేళ్లకే భర్తను కోల్పోయారు. అయినవాళ్ల నుంచే అవమానాలను ఎదుర్కొన్నారు.