
రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫార్ గ్రోన్-అప్స్' సినిమా నుంచి కొత్త ప్రోమో వీడియో వచ్చేసింది. ఇందులో సినిమాలో నటిస్తున్న ఐదుగురు హీరోయిన్ల లుక్స్‌ను రివీల్ చేశారు.
ఈ సినిమా కథతో పాటు, భారీ తారాగణం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.ఇప్పుడు చిత్రబృందం సినిమా నుంచి 'లేడీస్ అండ్ లేడీస్' పేరుతో ఓ కొత్త ప్రోమో వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఐదుగురు హీరోయిన్ల లుక్స్‌ను పరిచయం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఐదుగురు హీరోయిన్ల వయసుపై పెద్ద చర్చే నడుస్తోంది. యశ్ కంటే ఎవరు పెద్ద, ఎవరు చిన్న అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తీస్తున్న ఈ సినిమాలో నయనతార, కియా రా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిలో అందరికంతే పెద్ద నయనతార. ఆమె వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు. ఈ ఏజ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగడమే కాదు.. భారీగా రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుంది. విషేషం ఏంటంటే.. టాక్సిక్ లో నటిస్తున్న ఐదుగురు హీరోయిన్లలో నయనతార పెద్దది.. హీరో యష్ కంటే కూడా ఆమే ఏడాది పెద్దది.
నయనతార తరువాత టాక్సిక్ లో ఏజ్ ఎక్కువ ఉన్న హీరోయిన్ హుమా ఖురేషి. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈమె వయసు ప్రస్తుతం 39 ఏళ్లు. టక్సిక్ టీమ్ రిలీజ్ చేసిన వీడియోలో పవర్, సస్పెన్స్, స్టైల్, థ్రిల్ అన్నీ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల పాత్రలు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఖురేషి అయితే తనదైన స్టైల్లో డిఫరెంట్‌గా కనిపిస్తుంది.
డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ 'టాక్సిక్' సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల వయసుకు సబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో 34 ఏళ్ల వయసు ఉన్న కియారా అద్వాని టాక్సిక్ లో యష్ కు జంటగా నటించింది. వీరిద్దరికి సబంధించిన రొమాంటిక్ పోస్టర్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఘాటు రొమాన్స్ కు సబంధించి విమర్శలు కూడా ఫేస్ చేస్తున్నారు.
ఇక టాక్సిక్ లో మిగిని ఇద్దరు హీరయిన్లలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ కు 29 ఏళ్లు కాగా.. మరో తార.. తారా సుతారియాకు 30 ఏళ్లు. ఈ సినిమాలో హీరోగా నటించి కన్నడ స్టార్ హీరో, కేజీఎఫ్ స్టార్ యష్ కు 41 ఏళ్లు. ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న యష్.. టాక్సీక్ తో రాబోతున్నాడు.
సూపర్‌స్టార్ యశ్, డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ కాంబోలో వస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫార్ గ్రోన్-అప్స్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటి. ఇది ఒక పీరియడ్ గ్యాంగ్‌స్టర్ సినిమా. వెంకట్ కె నారాయణ, యశ్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో యశ్ డబుల్ రోల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఆయనతో పాటు అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, బాలాజీ మనోహర్, అమిల్ తివారీ, డారెల్ డిసిల్వా, సుర్జిత్ గోపీనాథ్, కెల్లీ పాల్ కూడా నటిస్తున్నారు. సినిమా బడ్జెట్ దాదాపు రూ.1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.