
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
EPF New Rule: ఈపీఎఫ్‌లో కొత్త మార్పులు ఉద్యోగుల జీతాలు, భవిష్యత్ పొదుపుపై ప్రభావం ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెలకు రూ. 15,000 కంటే ఎక్కువ మూల వేతనం ఉన్న ఉద్యోగులకు ఈ కొత్త నిబంధనలు ఎలా వర్తిస్తాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంతకుముందు రూ. 15,000 వరకు బేసిక్ సాలరీ ఉన్న ఉద్యోగులు ఈపీఎఫ్ పథకంలో చేరడం తప్పనిసరి అని ఉండేది. ఈ పరిమితి కంటే ఎక్కువ మూల వేతనం సంపాదించే ఉద్యోగులకు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నడుపుతున్న ఈ సామాజిక భద్రతా పథకంలో స్వచ్ఛందంగా చేరే అవకాశం ఉండేది.
ఈపీఎఫ్ పథకంలో చేరిన తర్వాత, ఉద్యోగులు తమ వాస్తవ మూల వేతనం ఆధారంగా ఈపీఎఫ్ చెల్లింపులు చేస్తారు. యజమానులు కూడా అదే రేటు ప్రకారం చెల్లింపులు చేస్తారు. జీతం ప్రభుత్వం నిర్దేశించిన వేతన పరిమితిని మించినప్పటికీ.. వాస్తవ మూల వేతనం ఆధారంగా చెల్లింపులు చేయవచ్చు. అయితే ఇప్పుడు కార్మిక,ఉపాధి మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 2026 ప్రకారం.. నెలకు రూ. 15,000 వేతన పరిమితికి మించిన ఈపీఎఫ్ చెల్లింపులు స్వచ్ఛందమైనవిగా మారాయని చెప్పాలి. గత ఉద్యోగుల భవిష్య నిధి పథకం 1952 ప్రకారం, నెలకు రూ. 15,000 వరకు సంపాదించే ఉద్యోగులు ఈపీఎఫ్ లో చేరవలసి ఉండేది. రూ. 15,000 కంటే ఎక్కువ సంపాదించే ఉద్యోగులు కూడా ఇందులో చేరడానికి ఎంచుకోవచ్చు. ఒకసారి చేరిన తర్వాత, ఉద్యోగి వాస్తవ మూల వేతనం ఆధారంగా ఉద్యోగి, యజమాని ఇద్దరూ తమ వాటాను చెల్లిస్తారు. వేతనం ప్రభుత్వం నిర్దేశించిన వేతన పరిమితిని మించినప్పటికీ ఈ విధానం కొనసాగుతుంది. కొత్త ఈపీఎఫ్ఓ స్కీమ్ 2026 ప్రకారం.. . సభ్యుడు చెల్లించే వాటా, కేంద్రం ఎప్పటికప్పుడు నిర్దేశించిన వేతన పరిమితికి లోబడి ఉంటుందని పేర్కొంది.
ఈపీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. పేరాగ్రాఫ్ 9లోని ఉప-పేరాగ్రాఫ్ (4) నిబంధనల ప్రకారం, ఒక సభ్యుని నెలసరి వేతనం నిర్దేశించిన వేతన పరిమితిని మించినట్లయితే.. యజమాని వాటా, ఉద్యోగి వాటా రెండూ ఆ వేతన పరిమితి ఆధారంగా లెక్కించిన మొత్తానికే పరిమితం అవుతాయి. ఈపీఎస్95 కింద అధిక వేతనాలపై వాటాలు అనుమతించిన సందర్భాల్లో.. వేతన పరిమితిని మించిన భాగానికి యజమాని పెన్షన్ నిధికి వాటా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సవరించిన నిబంధనల ప్రకారం, ఉద్యోగి తన వాస్తవ మూల వేతనం ఆధారంగా ఈపీఎఫ్ కు వాటా చెల్లించాలా లేక ప్రభుత్వం ప్రకటించిన వేతన పరిమితి వరకు మాత్రమే చెల్లించాలా అనే విషయాన్ని ఉద్యోగి, యజమాని ఇద్దరూ కలిసి నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.
దీనిని ఇప్పుడు ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. పాత విధానం.. ప్రకారం.. ప్రకాశ్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని మూల వేతనం నెలకు రూ. 30,000. పాత ఈపీఎఫ్ విధానం ప్రకారం..ఈపీఎఫ్ కోసం తప్పనిసరి వేతన పరిమితి కేవలం రూ. 15,000 మాత్రమే. అయితే.. ప్రకాశ్ ఇప్పటికే ఈపీఎఫ్ పథకంలో నమోదు చేసుకున్నందున.. ఉద్యోగి, యజమాని ఇద్దరూ అతని వాస్తవ మూల వేతనం అయిన రూ. 30,000 ఆధారంగా ఈపీఎఫ్ వాటా చెల్లించి ఉండేవారు. అంటే ఇద్దరూ 12శాతం వాటా చెల్లించి ఉండేవారు.
కొత్త నిబంధనల ప్రకారం పరిస్థితి మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రూ. 15,000 కంటే ఎక్కువ మూల వేతనం పొందుతున్న ఉద్యోగులకు, ఆ అదనపు మొత్తంపై ఈపీఎఫ్ వాటా చెల్లించడం స్వచ్ఛందమైంది. అంటే ప్రకాశ్ వంటి ఉద్యోగికి రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు.. అతను తన పూర్తి రూ. 30,000 మూల వేతనంపై ఈపీఎఫ్ చెల్లించడం కొనసాగించవచ్చు. దీనివల్ల నెలవారీ కోత ఎక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో అతని పదవీ విరమణ నిధి పెద్దదిగా ఉంటుంది.
మరోవైపు.. అతను ప్రభుత్వం నిర్దేశించిన రూ. 15,000 పరిమితి వరకు మాత్రమే ఈపీఎఫ్ చెల్లించవచ్చు. అప్పుడు.. అతని జీతం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈపీఎఫ్ లో జమ అయ్యే మొత్తం తక్కువగా ఉంటుంది. మరింత సులభంగా చెప్పాలంటే.. పాత విధానంలో, ప్రకాశ్ లాంటి ఉద్యోగికి జీతం ఎక్కువగా ఉన్నప్పటికీ, అతను చెల్లించే ఈపీఎఫ్ మొత్తం కూడా ఎక్కువగా ఉండేది. దానివల్ల అతని భవిష్యత్ పొదుపు పెరిగేది. అయితే.. కొత్త విధానంలో.. ఉద్యోగికి ఒక స్పష్టమైన ఎంపిక ఉంది. అతను ఇప్పుడు ఎక్కువ జీతం కావాలా లేక భవిష్యత్తులో ఎక్కువ పొదుపు కావాలా అని నిర్ణయించుకోవాలి. అతను పూర్తి మూల ఈపీఎఫ్ చెల్లింపును కొనసాగిస్తే, అతని పదవీ విరమణ నిధి పెరుగుతుంది. అయితే.. అతను కేవలం రూ. 15,000 వరకు మాత్రమే చెల్లిస్తే.. అతని నెలసరి జీతం పెరుగుతుంది కానీ అతని దీర్ఘకాలిక పొదుపు తగ్గుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.