
హైదరాబాద్: వివాహ వార్షికోత్సవం రోజే ఇంట్లో చికెన్ వండలేదని భార్యపై దాడి చేసిన భర్తను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు...
Jul 3 2026 8:11 AM | Updated on Jul 3 2026 8:11 AM
హైదరాబాద్: వివాహ వార్షికోత్సవం రోజే ఇంట్లో చికెన్ వండలేదని భార్యపై దాడి చేసిన భర్తను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు... బీఎస్ మక్తలో నివాసం ఉన్న ప్లంబర్ ప్రతాప్ (42), భార్య దీపికతో నివాసముంటున్నారు.
జూన్ 26న వీరి వివాహ వార్షికోత్సవం. ఆ రోజు రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తకు భోజనం వడ్డించగా, ‘‘పెళ్లిరోజు నాకు ఇష్టమైన చికెన్ ఎందుకు వండలేదని’’ గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రతాప్ పక్కనే ఉన్న కర్రతో భార్య తలపై బలంగా కొట్టాడు. స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రిలో చేరి్పంచారు. కోలుకున్న తరువాత దీపిక పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రతాప్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)
హైదరాబాద్ : రుచులు.. అద్భుతం : ఫుడ్– ఎ–ఫెయిర్– 2026 (ఫొటోలు)
సీఎం విజయ్ తండ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
బుల్లితెర డాక్టర్ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు)
మాన్సూన్ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
క్రేజీ కపుల్ ఇద్దరు కలిసి ఏం చేశారో చూడండి
ఇలాంటి వాడు MLAనా! మాతో పెట్టుకుంటే.. అడ్వకేట్లు వార్నింగ్
పిచ్ మధ్యలోనే తిట్టుకున్నా SRH ప్లేయర్లు స్టంప్ మైక్ ఆడియో వైరల్
ఏంటి అన్న ఈ బూతు పురాణం.. పూలవర్తి నాని ఆడియో లీక్ ఏకిపారేసిన మహిళ