
ఫంక్షన్లలో ఆహారం వడ్డించేందుకు ప్లేట్లు, కప్పులు, స్పూన్లు మళ్లీ కడిగే పని లేకుండా ప్లాస్టిక్ లేదా థర్మాకోల్వే వాడుతున్నారు.
అయితే ఈ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడానికి ఏళ్లు పడుతుండటంతో కుప్పలుగా పోగుబడి పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది. దీన్ని నిరోధించడానికి రకరకాల ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఆశిష్, రూప గోయల్‌లు కొత్తగా వరి పొట్టు ప్లేట్లు, కప్పులు, స్పూన్లు తయారు చేస్తున్నారు. తెలంగాణలో లక్షల ఎకరాల్లో ధాన్యం పండిస్తున్నారని, ఆ వడ్లను నూర్చిన తరువాత వచ్చే పొట్టుతో ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో వీటిని రూపొందించినట్లు వారు వివరించారు. ఇవి పర్యావరణహితమే కాక వాడి పడేసిన 15 రోజుల్లో భూమిలో కలిసిపోతాయని పేర్కొన్నారు. ఈ ప్లేట్లలో వేడి ఆహార పదార్థాలు ఉంచినా సురక్షితంగా ఉంటాయన్నారు. హైటెక్స్‌లో గురువారం ‘చెఫ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫుడ్ ఎఫైర్’ ప్రదర్శనలో వీటిని ప్రదర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.