
ఏజెంట్(Agent) రిజల్ట్ తర్వాత అఖిల్ అక్కినేని(Akhil Akkineni)కి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఆ సినిమా తర్వాత ఎందుకు అంత పెద్ద గ్యాప్ తీసుకున్నారనే ప్రశ్నకు ఇప్పటివరకు పూర్తి సమాధానం లేకపోయినా,...
ఏజెంట్(Agent) రిజల్ట్ తర్వాత అఖిల్ అక్కినేని(Akhil Akkineni)కి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఆ సినిమా తర్వాత ఎందుకు అంత పెద్ద గ్యాప్ తీసుకున్నారనే ప్రశ్నకు ఇప్పటివరకు పూర్తి సమాధానం లేకపోయినా, తాజాగా లెనిన్(Lenin) ప్రమోషన్స్‌లో అఖిల్ అసలు విషయాన్ని వెల్లడించారు. ఏజెంట్ రిలీజైన నాలుగు నెలల తర్వాత జరిగిన ప్రమాదం కారణంగా దాదాపు 16 నెలలు పూర్తిగా కోలుకోవడానికి పట్టిందని చెప్పారు. ఈ విషయం ఇప్పటివరకు బయటకు రాలేదని ఆయన పేర్కొన్నారు.
బాత్రూమ్ లో తడి ఫ్లోర్‌పై జారి పడటంతో గాజు ముక్క తన ఎడమ చేతిని తీవ్రంగా గాయపరిచిందని అఖిల్ తెలిపారు. రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్ నరాలు, రక్తనాళాలు దెబ్బతినడంతో రెండు మైక్రో సర్జరీలు చేయాల్సి వచ్చిందన్నారు. తన చేతికి మొత్తం 48 కుట్లు పడ్డాయని, తొలి 7 నుంచి 8 నెలల వరకు కనీసం బరువులు కూడా ఎత్తలేని పరిస్థితి ఎదురైందని వెల్లడించారు. పూర్తి స్థాయిలో కోలుకోవడానికి 16 నెలల సమయం పట్టిందని చెప్పారు.
అభిమానులను ఇంతకాలం వెయిట్ చేయించినందుకు క్షమాపణలు చెప్పిన అఖిల్, గ్యాప్‌లో సగం తన నిర్ణయాల వల్ల అయితే, మిగతా సగం ఈ ప్రమాదం కారణంగానే వచ్చిందని వివరించారు. మూడు సంవత్సరాల తర్వాత ఆయన నటించిన లెనిన్ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ కిషోర్ అబ్బూరు(Murali Kishore Abburu) దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాగార్జున అక్కినేని(Nagarjuna Akkineni), ఎస్. నాగ వంశీ(S Naga vamsi) సంయుక్తంగా నిర్మించగా, భాగ్యశ్రీ బోర్సే(Bhagya sri borse) హీరోయిన్ గా నటించింది.