
పట్నా: దాదాపు రెండు దశాబ్దాలుగా నివాసమున్న ప్రభుత్వ బంగళాను బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఎట్టకేలకు ఖాళీ చేశారు.
గతంలో ప్రభుత్వం కేటాయించిన 10 సర్క్యులర్ రోడ్డు భవనం నుంచి కౌటిల్య నగర్లో ఉన్న తన సొంత ఇంటికి మారారు. 2005లో అధికారం కోల్పోయాక రబ్రీదేవికి 10 సర్క్యులర్ రోడ్డు భవనాన్ని అప్పటి ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కేటాయించారు. అప్పటి నుంచి అది లాలు దంపతుల నివాసంగా, ఆర్జేడీ క్యాంపు కార్యాలయంగా కొనసాగింది. ఈ ఇల్లు ముఖ్యమంత్రి, గవర్నర్ నివాసాలకు అతి సమీపంలో విశాలంగా ఉంటుంది. గత ఏడాది నవంబరులో తొలిసారిగా ఇల్లు ఖాళీ చేయాలని, దానిని ఉప ముఖ్యమంత్రికి కేటాయించామని రబ్రీదేవికి నీతీశ్ ప్రభుత్వం నోటీసులిచ్చింది. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆమెకు 39, హర్దింగే రోడ్డు భవనాన్ని కేటాయిస్తామని తెలిపింది. దీనిని రబ్రీదేవి ఖాతరు చేయలేదు. గత నెలలో మరోసారి ఆమెకు కొత్తగా వచ్చిన భాజపా ప్రభుత్వం నోటీసులిచ్చింది. తొలుత ఖాళీ చేయనని భీష్మించిన రబ్రీదేవి.. చివరకు ఎట్టకేలకు ప్రభుత్వ భవనాన్ని వీడారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.