
ముజఫరాబాద్: ‘‘పాకిస్థాన్ సైన్యం కశ్మీరీలమైన మా చేతికి తుపాకులు అందించింది. ఇప్పుడు మమ్మల్ని ఉగ్రవాదులని అంటోంది’’ అని ఆక్రమిత కశ్మీర్‌కు చెంది
న సంయుక్త ఆవామీ యాక్షన్ కమిటీ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ ఆరోపించారు. పాక్ సైన్యం జమ్మూకశ్మీర్‌లోకి ఆయుధాలు చొప్పించిందని ఆయన ఒక సభలో మాట్లాడుతూ అన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో జైషే మొహమ్మద్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రమాదకరమైన ఆయుధాలు, కత్తులు ధరించిన ఉగ్రవాదులు నగరంలో భయోత్పాతం సృష్టించారని ఆయన అన్నారు. రావలకోట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ నాటి ర్యాలీకి రక్షణ కల్పించారని గుర్తుచేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.