
శిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లూ జిల్లా రోహ్తాంగ్ వద్ద గల అటల్ సొరంగంలో భారత సైన్యానికి చెందిన కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్..
డేర్ డెవిల్స్ బృందం కొత్త ప్రపంచ రికార్డును విజయవంతంగా పూర్తి చేసింది. ప్రపంచంలోకెల్లా అతి పొడవైన 10 వేల అడుగుల (9.8 కి.మీ.) ఈ హైవే టన్నెల్‌ను రెండు ద్విచక్ర వాహనాలపై పదిమంది రైడర్లు 9.48 నిమిషాల్లో దాటారు. 10,075 అడుగుల ఎత్తున ఈ విన్యాసం పూర్తి చేసినట్లు ఆర్మీ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘వీల్స్ ఆఫ్ వాలర్ : సంచార్ శక్తి’ మోటార్‌సైకిలు యాత్రలో ఉన్న డేర్ డెవిల్స్ బృందం జూన్ 30న కుల్లూకు చేరింది. కార్గిల్ విజయ్ దివస్ స్ఫూర్తిని చాటుతూ ఈ బృందం చేపట్టిన ప్రపంచ రికార్డుల సాధన పరంపరలో భాగంగా అటల్ టన్నల్ వద్ద తాజా విన్యాసం ప్రదర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.