
దిల్లీ: దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశాలకు కీలకమైన జేఈఈ, నీట్-యూజీల్లో బోర్డు పరీక్షలకు 50శాతం వెయిటేజీ ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రవేశ పరీక్షలకు ఉండే అత్యంత ప్రాధాన్యాన్ని తగ్గించడంద్వారా విద్యార్థుల్లో ఒత్తిడిని నివారించే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. పేపర్ లీక్‌లు, మూల్యాంకనంలో లోపాలు, పరీక్షల్లో చోటుచేసుకుంటున్న అక్రమాల నేపథ్యంలో ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ‘ప్రవేశ పరీక్షల్లో బోర్డు పరీక్షలకు 50శాతం వెయిటేజీ ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత ఏడాది కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిన 9 మంది సభ్యుల కమిటీ ఈ ప్రతిపాదనను పరీశీలిస్తున్నట్లు వెల్లడించాయి. రానున్న కొద్ది వారాల్లో ఈ కమిటీ తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.