
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అభ్యర్థులకు ఐబీపీఎస్ (IBPS) గుడ్న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల...
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అభ్యర్థులకు ఐబీపీఎస్ (IBPS) గుడ్న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 6,715 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 21, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)/మేనేజ్మెంట్ ట్రెయినీ (MT)
ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు – రూ.850
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు – రూ.175
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రూ.48,480 నుంచి రూ.85,920 వరకు బేసిక్ పే లభిస్తుంది. ఇతర అలవెన్సులు అదనంగా ఉంటాయి.
అభ్యర్థులను కింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.
అదనంగా ఇంగ్లీష్ ఎస్సే, కాంప్రహెన్షన్ విభాగంలో 25 మార్కులకు పరీక్ష ఉంటుంది. దీనికి 30 నిమిషాల సమయం ఉంటుంది.
ఈ పరీక్షలు ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం – జులై 1, 2026
ప్రిలిమ్స్ ఫలితాలు – సెప్టెంబర్/అక్టోబర్ 2026
అర్హత కలిగిన అభ్యర్థులు IBPS అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదివి అన్ని అర్హతలను పరిశీలించడం మంచిది.
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు