
ఇంటర్నెట్ డెస్క్: రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్2’ (Jailer2).
వీళ్లిద్దరి కలయికలో విజయవంతమైన ‘జైలర్’కి సీక్వెల్ ఇది. కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. దసరా కానుకగా అక్టోబరు 15న (jailer 2 release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సన్ పిక్చర్స్ వీడియోను పంచుకుంది.
మొదటి భాగం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే సీక్వెల్ ప్రారంభమవుతుందని తాజాగా విడుదల చేసిన వీడియోను బట్టి అర్థం అర్థమవుతోంది. ‘జైలర్’ క్లైమాక్స్‌లో దేవతా విగ్రహాల స్మగ్లర్ వర్మ.. మాజీ జైలర్ ముత్తువేలు పాండియన్‌ను హెచ్చరిస్తాడు. ‘‘నన్ను చంపి నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఒక పెద్ద ప్రపంచం నా వెనకాల ఉంది జైలర్. ఇదొక పెద్ద నెట్వర్క్. ఎవరెవరు?ఎప్పుడెప్పుడు? వస్తారో నీకు తెలియదు. నీ జీవితం నరకం అవుతుంది’’ అంటాడు. అవే విజువల్స్ వీడియోలో చూపిస్తూ, మూవీలోని మిగిలిన పాత్రలను ఫ్లాష్ చేసుకుంటూ వెళ్లారు.
‘జైలర్’తో పోలిస్తే, ఇందులో పాత్రలు మరింత బలంగా ఉండేలా కనిపిస్తున్నాయి. తొలి భాగంలో కనిపించిన వారితో పాటు, కొత్త వారు కూడా ఈసారి థ్రిల్ పంచనున్నారు. మరి ముత్తువేల్ పాండియన్‌కు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడు? విగ్రహాల స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఎలా కనిపెట్టాడు? తన కుటుంబానికి ఆపద రాకుండా ఎలాంటి ప్లాన్ వేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: సినీ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె మోహన వివాహం అనిరుధ్‌తో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, చిరంజీవి సతీసమేతంగా హాజరయ్యారు. సినీ నటులు వెంకటేశ్, మురళీ మోహన్ తదితరులు ఈ వేడుకకు విచ్చేశారు.