
హైదరాబాద్: నగరంలోని తార్నాకలో ఎర్రకుంట ఆక్రమణపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై వాదనల సందర్భంగా.. 8 ఎకరాల చెరువు ఆక్రమణకు గురైందని పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ తెలిపారు.
జీహెచ్ఎంసీ, హైడ్రా, లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ఈక్రమంలో ఆయా విభాగాల అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హైడ్రా, జీహెచ్ఎంసీ కేవలం పేదల ఇళ్లనే కూలుస్తున్నాయని వ్యాఖ్యానించింది. వాటికి నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. హైడ్రా పేదల ఇళ్లనే కూలుస్తోంది.. హైకోర్టు ఆగ్రహం |