
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాదీలకు గుడ్న్యూస్. వీకెండ్లో ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నారా? యాదాద్రి - స్వర్ణగిరి వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా?
అలాంటి పర్యాటకులను ఆకర్షించేందుకే తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ (TGTDC) సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రసిద్ధ ఆధ్యాత్మిక, చారిత్రక గమ్యస్థానాలను అనుసంధానం చేసేలా ఆకర్షణీయమైన ప్యాకేజీని ప్రతి శనివారం అందించనున్నట్లు ప్రకటించింది. సరసమైన ధరల్లోనే పర్యాటకులకు సౌకర్యమంతమైన, విజ్ఞానదాయకమైన ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ ఒక్క రోజు టూర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్- యాదగిరిగుట్ట- శిల్పారామం- కొలనుపాక జైనమందిరం - స్వర్ణగిరి ఆలయం- పోచంపల్లి ప్రాంతాలను సందర్శించాలనుకొనే పర్యాటకులకు ఇదో అద్భుతమైన అవకాశమని తెలిపింది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలను పరిశీలిస్తే..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.