
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అభిషేక్ శర్మ అరుదైన ఘనత బంతుల పరంగా అత్యంత వేగంగా 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర 1000లోపు బంతుల్లోనే ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ ప్లేయర్‌గా Abhishek...
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అభిషేక్ శర్మ అరుదైన ఘనత బంతుల పరంగా అత్యంత వేగంగా 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర 1000లోపు బంతుల్లోనే ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ ప్లేయర్‌గా Abhishek Sharma : టీమ్ఇండియా బ్యాటర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో బంతుల పరంగా అత్యంత వేగంగా 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. చెస్టర్-లె-స్ట్రీట్‌లోని రివర్సైడ్ గ్రౌండ్లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ రెండో సిక్స్ కొట్టిన తరువాత 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు వెస్టిండీస్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ ను అధిగమించాడు. ఎవిన్ లూయిస్ 789 బంతుల్లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకోగా అభిషేక్ 785 బంతుల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఫిన్ అలెన్, టిమ్ డేవిడ్, కొలిన్ మన్రోలు ఈ జాబితాలో ఉన్నారు. అతి తక్కువ బంతుల్లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీరే.. * అభిషేక్ శర్మ (భారత్) - 785 బంతుల్లో * ఎవిన్ లూయిస్ (వెస్టిండిస్) - 789 బంతుల్లో * ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) - 871 బంతుల్లో * టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా) - 931 బంతుల్లో * కొలిన్ మున్రొ (న్యూజిలాండ్) - 963 బంతుల్లో * సూర్యకుమార్ యాదవ్ (భారత్) - 1007 బంతుల్లో Kieron Pollard : కీరన్ పొలార్డ్ భార్య.. జెన్నా ఎంత అందంగా ఉందో చూశారా? ఫోటోలు వైరల్.. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (68; 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (59; 24 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలు చేశారు. శివమ్ దూబె (42 నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. సంజూ శాంసన్ (1), ఇషాన్ కిషన్ (0), తిలక్ వర్మ (13) లు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ మూడు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్, సామ్ కరన్‌లు చెరో వికెట్ పడగొట్టారు. Milestone unlocked 🔓 1️⃣0️⃣0️⃣ T20I sixes and counting for the power-packed Abhishek Sharma 👏 Updates ▶️ | #ENGvIND | @OfficialAbhi04 — BCCI (@BCCI) July 1, 2026 భారత్ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత భారీ వర్షం కురిసింది. మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో.. మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ శనివారం (జూలై 4న) మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరగనుంది.