
రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్' చిత్రానికి అమిత్ త్రివేదిని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు.
జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కథానాయకుడిగా తెరకెక్కబోతున్న చిత్రం 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్'. దర్శకుడు సందీప్ సింగ్ (Sandeep Singh) ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రబృందంలోకి సంగీత దర్శకుడు అమిత్ త్రివేది (Amit Trivedi) వచ్చే చేరారు. తొలుత 'ఛత్రపతి శివాజీ మహారాజ్' మూవీకి ప్రీతమ్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. అయితే అతను కొన్నేళ్ళ పాటు మెయిన్ స్ట్రీమ్ చిత్రాలకు సంగీతం అందించకుండా విరామాన్ని ప్రకటించారు. దాంతో ఈ సినిమాకు మ్యూజిక్ అందించే అపూర్వ అవకాశం అమిత్ త్రివేదికి కలిగింది. ఇలాంటి ఓ భారీ చారిత్రక మహా కావ్యానికి సంగీతం అందించడం అమిత్ త్రివేదికి ఇదే మొదటిసారి.
ఈ సినిమాకు జాతీయ ఉత్తమ గీత రచయిత ప్రసూన్ జోషి (Prasoon Joshi) పాటలు రాస్తున్నారు. అమిత్ ఎంపిక గురించి చిత్ర బృందంలోని వారు మాట్లాడుతూ, 'ఈ చారిత్రక గాథకు సంగీత రూపంలో ప్రాణం పోయడానికి అమిత్ త్రివేదే సరైన ఎంపిక అని మేం భావిస్తున్నాం. భారతీయ సంగీతపు మూలాలను శక్తివంతమైన ఆర్కెస్ట్రేషన్‌తో మేళవించే సత్తా అమిత్‌కు ఉంది. ప్రసూన్ జోషి అద్భుతమైన సాహిత్యం అందించే వ్యక్తి. వీరిద్దరి కలయికతో 'ఛత్రపతి శివాజీ మహరాజ్' చిత్రం మరో మెట్టు ఎత్తులో నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj) ధైర్యం, దూరదృష్టి, భావోద్వేగం, వారసత్వాన్ని ప్రతిబింబించేలా సంగీతం ఉండాలి. ఈ చిత్ర సంగీతం సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే విశ్వాసం ఉంది' అని ఆ వర్గం వెల్లడించింది. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న అతిపెద్ద పాన్-ఇండియా చిత్రాల్లో ఒకటిగా ఇది తెరకెక్కనుంది. ఇందులో ఇతర కీలక పాత్రలను అర్జున్ రామ్ పాల్, వివేక్ ఓబెరాయ్ పోషిస్తున్నారు.
ఎట్టకేలకు.. విజయ్ 'జన నాయగన్' సెన్సార్ పూర్తి?
Kayadu Lohar: టెన్త్ క్లాస్‌లోనే అంత పని చేసిందా?
వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది!