
సంబంధిత పాటల బాణీల కూర్పు(Original musical Compositions)పై ఇళయరాజాకు హక్కులు ఉన్నాయని, అంతమాత్రాన వాటిని సినిమాల్లో ఉపయోగించినప్పుడు రూపొందించిన సౌండ్ రికార్డింగులపై హక్కులు దఖలు పడవని పేర్కొంది.
సినిమాల్లోని సౌండ్ రికార్డింగులపై నిర్మాతలకు కాపీరైట్ ఉంటుందని, వారు సరేగమాకు వాటిని బదిలీ చేసినందున ఆ సంస్థకే హక్కులు సంక్రమిస్తాయని స్పష్టం చేసింది. కాపీరైట్ చట్ట ప్రకారం సంగీత దర్శకుడి హక్కులు బాణీల కూర్పు వరకే పరిమితమని, పూర్తి సినిమా సౌండ్ ట్రాక్‌పై యాజమాన్య హక్కులుగా వాటిని పరిగణించలేమని పేర్కొంది.
1976 నుంచి 2001 మధ్య ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన 134 చిత్రాల నిర్మాతలతో సరేగమా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. ఆయా చిత్రాల్లో సౌండ్ రికార్డింగ్స్తోపాటు వాటిలోని సంగీత, సాహిత్య కృతులపై హక్కులు తమకు బదిలీ అయ్యాయన్నది సరేగమా చెబుతోంది. అయితే ఇటీవల అమెజాన్ మ్యూజిక్, ఆపిల్ ఐట్యూన్స్, జియోసావన్ వంటి డిజిటల్ స్ర్టీమింగ్ వేదికలపైనా ఆ పాటలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించామని, వాటిపై ఇళయరాజా యాజమాన్య హక్కులను ప్రకటించుకుంటున్నారని కోర్టుకు తెలిపింది. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. ఈ వ్యవహారంలో కాపీరైట్ ఉల్లంఘన జరిగినట్లు కనబడుతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు పూర్తిస్థాయిలో విన్న తరువాత తుదితీర్పు ఇస్తామని, అప్పటివరకూ ఇళయరాజా ఆ పాటల ప్రసార హక్కులను ఇతరులకు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: సినీ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె మోహన వివాహం అనిరుధ్‌తో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, చిరంజీవి సతీసమేతంగా హాజరయ్యారు. సినీ నటులు వెంకటేశ్, మురళీ మోహన్ తదితరులు ఈ వేడుకకు విచ్చేశారు.