
చిన్నవయసులో పిల్లలకు ఏది నేర్పిస్తే…అది త్వరగా మెదడులో నాటుకుంటుంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని, నేర్చుకోవాలనే తపన ఉంటుంది. అలాంటి సమయంలో కాస్త ఎంకరేజ్ చేస్తే మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుంది.
పిల్లల్లో ఫోటోగ్రఫీపై ఆసక్తి పెంచేందుకు, క్రియేటివిటీ ప్రోత్సహించేందుకు కిడ్స్ కెమెరాలు బెస్ట్ ఆప్షన్. HD ఫోటోలు, వీడియో రికార్డింగ్ చేయొచ్చు. కొన్ని మోడల్స్ లో ఇన్స్టంట్ ప్రింటింగ్ వంటి ఫీచర్లతో పిల్లలకు ఎక్సీపిరియన్స్ ఇస్తాయి దీంతో వాళ్ల ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ మరింత సరదాగా మారుతుంది.
మీరు తక్కువ బడ్జెట్లో పిల్లలకు మంచి కెమెరా కొనాలనుకుంటే, మినీ డిజిటల్ కెమెరా బెస్ట్. ఇందులో 3 మెగాపిక్సెల్ కెమెరా, 1080p HD వీడియో రికార్డింగ్ ఫీచర్ ఉంటాయి. 2-అంగుళాల స్క్రీన్, USB ఛార్జింగ్ బ్యాటరీ, మైక్రో SD కార్డ్ సపోర్ట్‌తో పిల్లలు తమ ఫోటోలు, వీడియోలను ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. దీని ధర సుమారు రూ.567 ఉంటుంది.
పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చే కెమెరా కావాలంటే, గేమ్స్‌తో వచ్చే కిడ్స్ కెమెరా మంచి ఆప్షన్. ఇందులో ఫోటోగ్రఫీతో పాటు కొన్ని మినీ గేమ్స్ కూడా ఉంటాయి. ఖాళీ సమయంలో పిల్లలు ఆడుకోవచ్చు. రీఛార్జబుల్ బ్యాటరీ, సులభమైన కంట్రోల్స్‌తో ఇది 7 నుంచి 14 ఏళ్ల పిల్లలకు మంచి గిఫ్ట్ ఆప్షన్.
మీ పిల్లలు తీసిన ఫోటోలను వెంటనే చూడాలనుకుంటే, ఇన్స్టంట్ ఫోటో ప్రింట్ కెమెరా బెస్ట్. ఇది ఫోటో క్లిక్ చేసిన వెంటనే ప్రింట్ తీసి ఇస్తుంది. దీనితో పాటు రెండు ప్రింటింగ్ రోల్స్ కూడా వస్తాయి. కాబట్టి పిల్లలు ఎలాంటి అదనపు సెటప్ లేకుండా వెంటనే ఫోటోలు ప్రింట్ చేసుకోవచ్చు. దీని స్టార్టింగ్ ప్రైస్ సుమారు రూ.1600 ఉంటుంది.
ఆడపిల్లల కోసం యూనికార్న్ థీమ్‌తో వచ్చే కిడ్స్ కెమెరా చాలా బాగుంటుంది. దీని 3D యూనికార్న్ డిజైన్ పిల్లలను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో 4.8 మెగాపిక్సెల్ కెమెరా, వీడియో రికార్డింగ్, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీంతో పిల్లలు సెల్ఫీలు, వీడియోలు కూడా ఈజీగా తీసుకోవచ్చు.