
ఏపీ అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అండగా నిలుస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతి జిల్లాలోని ముక్కావారిపల్లెలో ‘వీబీ జీ రామ్ జీ’ పథకం ప్రారంభమైంది.
తిరుపతి, జులై 2: ఏపీ అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అండగా నిలుస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వ సహకారానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు(గురువారం) తిరుపతి జిల్లాలోని ముక్కావారిపల్లెలో ‘వీబీ జీ రామ్ జీ’(VB G RAM-G) పథకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనలో భాగమే వీబీ జీ రామ్ జీ పథకమని అన్నారు.
ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించారని పవన్ చెప్పారు. వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం రైతులకు ఉపయోగపడుతుందని పవన్ అన్నారు. ఏపీలో పథకం అమలుకు రూ.12,845 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. గత రెండేళ్లలో పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా రూ.16,695 కోట్ల ఉపాధి నిధులను ఉపయోగించామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
జగన్ తీరు అందరికీ తెలుసు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త అధ్యాయం మొదలు: పీవీఎన్ మాధవ్