
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
kalvakuntla Kavitha Protest at Uppal bhagayat: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కాక రేపుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య తగ్గా ఫార్ సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఉదయం నుంచి గన్ పార్క్, తెలంగాణ భవన్ ల కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య హైడ్రామా కొనసాగింది. ఈ నేపథ్యంలో పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావును, పలువుకు బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేశారు. మరోవైపు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉప్పల్ భగాయత్ లో చేపట్టిన భూపోరాటం కూడా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కవిత ఉప్పల్ భగాయత్ లో తలపెట్టిన భూపారటంకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు . దీంతో పోలీసులు ఎక్కడికక్కడ కార్యకర్తల్ని అడ్డుకున్నారు.
ఆందోళన కారుల్ని లాక్కుని వచ్చి వ్యాన్ లలో ఎక్కించారు. కల్వకుంట్ల కవితను సైతం పోలీసులు బలవంతంగా లాక్కుని పోలీసు వాహనంలో ఎక్కించారు. ఈ సందర్భంగా భారీగా తోపులాట జరిగింది. కవితను పోలీసులు లాక్కుని పొవడంను కార్యకర్తలు అడ్డుకున్నారు. మరోవైపు కవిత మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీల్ని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ మీద అరాచకం చేస్తుందని మండిపడ్డారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ప్రభుత్వ ఇళ్ల స్థలాన్ని తక్షణమే కేటాయించాలన్నారు. ఉద్యమ కారుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. మరోవైపు పోలీసుల బలగాలు కూడా అక్కడకు చేరుకొవడంతో తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో పోలీసులకు, తెలంగాణ రక్షణ సేన శ్రేణులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కవితో పాటు అనేక మంది కార్యకర్తలు చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. పలువురికి గాయాల నుంచి రక్తం కూడా బైటకు రావడంతో కవిత మరింత ఆగ్రహంకు లోనయ్యారు.
Read more: Harish Rao: తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. హరీష్ రావు అరెస్ట్.. మరోసారి హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు..
కాంగ్రెస్ ప్రభుత్వంకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని అన్నారు. ఇచ్చిన హమీల్ని అడిగితే ఉద్యమ కారుల రక్తంను బైటకొచ్చేటట్లు చేస్తారా..?.. అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక కవితతో పాటు, అనేక మంది కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు. కవిత అరెస్ట్ వార్త తెలియడంతో బొల్లారం పోలీస్ స్టేషన్ వద్దకు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.