
శివుడికి ఏ అభిషేకం చేస్తే ఏ ఫలితం? జలాభిషేకం నుంచి బిళ్లగన్నేరు పూజ వరకు..శివుడికి ఏ అభిషేకం చేస్తే ఏ ఫలితం? జలాభిషేకం నుంచి బిళ్లగన్నేరు పూజ వరకు..
02 July 2026 Rajashekher పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన అభిషేకం. దోసెడు నీళ్లతోనైనా అభిషేకం చేస్తే స్వామి ప్రసన్నుడవుతాడని నమ్మకం. జన్మజన్మల పాపాలు నశించి, భక్తుడు పునీతుడవుతాడని పురాణాలు చెబుతున్నాయి. జలాభిషేకం (నీటితో అభిషేకం) ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో చేసే అభిషేకం. జీవాత్మ–పరమాత్మల అనుసంధానానికి ప్రతీకగా భావిస్తారు. సమస్త దోషాలు తొలగి, సుఖశాంతులు, సౌఖ్యాలు కలుగుతాయని విశ్వాసం. పంచామృతాభిషేకం శివునికి అత్యంత ప్రీతికరమైన అభిషేకాల్లో ఒకటి. సకల కష్టాల నుంచి రక్షణ, ఐశ్వర్యం, సిరిసంపదలు లభిస్తాయని చెబుతారు. ముక్తిని ప్రసాదించే పుణ్యకార్యంగా భావిస్తారు. భస్మాభిషేకం భస్మాభిషేకాన్ని కేవలం దర్శించిన వారికి కూడా విశేష పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. భస్మాభిషేక దర్శనం బిల్వదళం శివార్చనలో అత్యంత శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. బిల్వం త్రిమూర్తి స్వరూపంగా పరిగణించబడుతుంది. జ్ఞానం, లక్ష్మీకటాక్షం, శుభఫలాలు లభిస్తాయని నమ్మకం. బిల్వపత్రాలతో అర్చన ఒక్క జిల్లేడుపువ్వుతో పూజ చేసినా పది బంగారు నాణాలు దానం చేసినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. దారిద్ర్యం తొలగి, పూర్వజన్మ దోషాల నుంచి విముక్తి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. జిల్లేడు పూలతో పూజ (అర్కపుష్పం) హృదయ కమలం వికసించడానికి ప్రతీకగా భావిస్తారు. సద్భావనలు, సత్సంపదలు, భక్తి, జ్ఞానం, సుఖసంతోషాలు కలుగుతాయని చెబుతారు. కలువ పూలతో అర్చన వేయి గోదానాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణ విశ్వాసం. అనుకూలమైన జీవిత భాగస్వామి లభించడం, శత్రుభయం తొలగడం, వ్యాధులు నయమవడం వంటి ఫలితాలు కలుగుతాయని చెబుతారు. బిళ్లగన్నేరు పూలతో పూజ శివుడికి భక్తిశ్రద్ధలతో చేసే ప్రతి అభిషేకం, అర్చనకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఫలితం ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి. భక్తితో చేసిన పూజ ద్వారా పాపక్షయం, దోష నివారణ, ఐశ్వర్యం, జ్ఞానం, శాంతి, ముక్తి వంటి శుభఫలాలు లభిస్తాయని విశ్వాసం. అభిషేకం–అర్చనల సమగ్ర మహిమ మరిన్ని వెబ్ స్టోరీస్ తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా? రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్