
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Jagtial Kendriya Vidyalaya Latest News: జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయం (KV) ఏర్పాటుకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గత ఎనిమిది నెలలుగా కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు తీసుకురావడానికి నిరంతరం శ్రమిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ ప్రక్రియల వల్ల కొంత ఆలస్యం జరగడం వాస్తవమేనని.. అయితే, దీన్ని రాజకీయం చేస్తూ.. కొందరు ఇష్టారాజ్యంగా మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పండ్ల మార్కెట్ కొరకు వాలంతరి భూమిని కేటాయించినప్పుడు.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేసినప్పటికీ స్థల మార్పిడిలో తీవ్ర ఆలస్యమైందనే విషయాన్ని మీడియా మిత్రులు, అధికారులు గమనించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గుర్తుచేశారు. వాటర్ అండ్ ల్యాండ్ రీసెర్చ్ సంస్థ (వాలాంతరి) అనేది ఒక అటానమస్ సంస్థ అని.. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహజ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల శాస్త్రవేత్తల శిక్షణ నిమిత్తం ఆ భూమి కేటాయింపులో కొంత జాప్యం జరిగిందని వివరించారు. కొందరు పూర్తి అవగాహన లేకుండా తెలిసి తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు.
నేడు క్యాబినెట్ ఆమోదం.. కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక నిర్వహణ కొరకు పాత ఎస్పీ కార్యాలయాన్ని కేవీ డిప్యూటీ డైరెక్టర్, డీఈఓ, కలెక్టర్‌తో పాటు కరీంనగర్ కేవీ ప్రిన్సిపాల్ సందర్శించి ఆమోదం తెలిపారని సంజయ్ కుమార్ వెల్లడించారు. శాశ్వత భవన నిర్మాణం కోసం చల్గల్లో 5 ఎకరాల భూమికి కలెక్టర్ అడ్వాన్స్ పొసెషన్ ఇచ్చారని తెలిపారు. పూర్తి స్థాయి కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం అవసరం కాబట్టి.. ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం రానుందని.. మంత్రి కూడా దీనికోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని చెప్పారు. కేవీ కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.
దళితుడు మంత్రిగా ఉండడం కొందరికి ఇష్టం లేదు.. జగిత్యాల అభివృద్ధికి మంత్రి లక్ష్మణ్ కుమార్ విశేషంగా కృషి చేస్తున్నారని.. అయితే, ఒక దళితుడు మంత్రిగా ఉండడం ఒక సీనియర్ నాయకునికి ఇష్టం లేదని.. అందుకే సర్కార్‌ను దింపుతాం, నాకు మంత్రి అయ్యే అర్హత ఉందంటూ అహంకారంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండిపడ్డారు. విమర్శలు ఎప్పుడైనా నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ.. ఇలా వ్యక్తిగత కక్షలతో ఉండకూడదని హితవు పలికారు. చల్గల్లో రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని 7 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కొరకు, 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయం కొరకు కేటాయించడం జరిగిందన్నారు. మంత్రులు, ఎంపీతో కలిసి జగిత్యాల ప్రగతికి కట్టుబడి ఉంటానని, వాలాంతరిలో వ్యవసాయ అభివృద్ధికి కేంద్ర నిధుల కోసం ఎంపీ సహకారం కోరతామని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.