
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Congress BRS Political Heat: తెలంగాణలో సవాళ్ళ రాజకీయం వేడెక్కింది. మంత్రులు గన్ పార్క్ దగ్గర చర్చకు వున్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్ళేందుకు రెడీ అయ్యారు. కాగా హరీష్ రావును పోలీసులు తెలంగాణ భవన్ వద్గే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు గన్ పార్క్ వద్దకు రాగా..బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. దీంతో గన్ పార్క్, తెలంగాణ భవన్, ప్రెస్‌క్లబ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గురుకులాల్లో అవినీతి జరిగిందని ఆరోపించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. అది అబద్ధమైతే దానిపై చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు చర్చకు రావాలని సవాల్ చేశారు. దీంతో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి, అజారుద్దీన్ లు గన్ పార్కుకు చేరుకున్నారు. గురుకులాల టెండర్లలో అవినీతి ఆరోపణలు నిజమని నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ చేశారు.
కాంగ్రెస్ తో కేటీఆర్, హరీష్ రావు సవాళ్లు.. ప్రతి సవాళ్లు..
ఇదే అంశంపై ఉదయం 11 గంటలకు అన్ని ఆధారాలతో తాను ప్రెస్ క్లబ్ కు వస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు అక్కడికే వచ్చి చర్చిస్తారని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ అప్పులపై చర్చించేందుకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు సవాల్ చేశారు. చర్చకు సిద్ధమని, గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందన్నది వాస్తవమని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులు తెలంగాణ భవన్ కు చేరుకోగా.. జూపల్లి కూడా అక్కడికే బయల్దేరినట్లు తెలుస్తోంది.దీనిపై కేటీఆర్ స్పందించారు. BRS పాలనపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, రెండున్నర ఏళ్ళల్లో కాంగ్రెస్ చేసిన అప్పుల పై కూడా చర్చిద్దామంటోంది. ఇందుకుగాను కేటీఆర్, హరీశ్ రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండున్నరేళ్లలోనే భారీగా అప్పులు చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. గడిచిన పదేండ్లలో బీఆర్ఎస్ అత్యధిక అప్పులు చేసిందని కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ విభజన నాటికి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేసింది బీఆర్ఎస్సే అని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతలు - మంత్రుల మధ్య సవాళ్లు - ప్రతి సవాళ్లు జరిగాయి. దీంతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. చర్చల్లో ఏం తేలుస్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు తెలంగాణ భవన్, ఇటు ప్రెస్ క్లబ్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.