
Realme P4x 5g Flipkart Goat Sale: ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో భాగంగా Realme P4x 5G ఫోన్ అద్భుతమైన ఆఫర్స్‌తో లభించబోతోంది. ఇందులో భాగంగా కోనుగోలు చేస్తే చాలా చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
అయితే, ఈ ఆఫర్స్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme P4x 5g Flipkart Goat Sale Offers: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ GOAT (Greatest Of All Time) సేల్‌లో భాగంగా రియల్మీ కంపెనీకి సంబంధించిన ఓ అద్భుతమైన ప్రీమియం మొబైల్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న Realme P4x 5G స్మార్ట్‌ఫోన్‌ను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ ఆఫర్లతో సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది..
సాధారణంగా ప్రీమియం ఫీచర్లతో కూడిన Realme P4x 5G (128 GB స్టోరేజ్ + 6 GB ర్యామ్) వేరియంట్ అసలు ధర (MRP) రూ.38,999తో అందుబాటులో ఉంది.. అయితే, జూలై 4వ తేదీన ప్రారంభం కాబోతున్న ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ.18,500 వరకు ఫ్లాట్ తగ్గింపు లభించనుంది.
ఈ భారీ ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత కస్టమర్లు ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.20,499 లోపే పొందచవచ్చు. ప్రీమియం లుక్, బెస్ట్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది నిజంగా బంపర్ ఆఫర్‌గానే భావించవచ్చు.. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్లకు మరింత లబ్ధి చేకూర్చేందుకు అదనపు బ్యాంక్ ఆఫర్లలు కూడా అందుబాటులో ఉన్నాయి..
ఈ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) లేదా SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి పేమెంట్ చేసే కొనుగోలుదారులకు దాదాపు రూ.1,150 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీనివల్ల మొబైల్ ధర మరింత తగ్గి.. సామాన్యులకు సైతం అందుబాటు ధరలోకి వస్తుంది.
మీరు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే ఈ సేల్ మరింత అద్భుతంగా మారబోతోంది. ఈ సేల్‌లో పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే దాదాపు రూ.9,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.. ఈ ఎక్స్ఛేంజ్ బోనస్ అనేది మీరు ఎక్స్ఛేంజ్ చేసే పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండీషన్, బ్రాండ్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
ఈ సేల్‌లో భాగంగా మీరు ఒకవేళ మీ పాత ఫోన్‌కు పూర్తి ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందితే.. అన్ని ఆఫర్లు కలుపుకొని ఈ Realme P4x 5G ఫోన్‌ను కేవలం రూ.10,349 లోపే మీ సొంతం చేసుకోవచ్చు. ఇవేకాకుండా అదనండా ఎన్నో రకాల ఆఫర్స్ కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ఆఫర్స్ అన్ని తెలుసుకోవడానికి తప్పకుండా మరికొన్ని రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది.