
Mumbai rains update: ముంబైలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అంతా అస్త వ్యస్తంగా మారిపోయింది.ప్రజలు అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని అలర్ట్ ను జారీ చేశారు. ఈ నేపథ్యంలో పలు స్కూళ్లు, కాలేజీలకు అధికారు
లు సెలవులు ప్రకటించారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం వర్షాలతో అల్లాడిపోతుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు ముంబై నగరాన్ని వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబాయిలో గత 24 గంటల్లో దాదాపు 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దాదర్, పార్లే, హింద్ మాతా, చార్ కోప్, వర్లీ, గోరేగావ్, అంధేరీల్లోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది. లోకల్ ట్రైన్లు నిలిచిపోయాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అంతే కాకుండా రానున్న మరో వారం పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు .. రాష్ట్రంలోని పన్వెల్, ఉరాన్, పాల్ఘర్, రాయ్‌గఢ్ ప్రాంతాల్లో వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన ఆయా జిల్లాల కలెక్టర్లు ఆయా ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు తక్షణమే సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పరిస్థితుల తీవ్రతను బట్టి స్థానిక అధికారులు తమ పరిధిలోని మరిన్ని విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించవచ్చని, పొడిగించుకొవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటికే మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా జూలై 2న రాయగడ్ పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేస్తున్నందున అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవుల్ని ప్రకటిస్తు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అత్యసరం అయితే తప్ప బైటకు రావొద్దని ప్రజలకు సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో.. రాయగడ్ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలను జూలై 2, 2026న మూసివేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ ఉత్తర్వులు నవీ ముంబైలోని పన్వెల్, ఉరాన్ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలతో సహా జిల్లాలోని అన్ని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక పాఠశాలలకు వర్తిస్తుందని అధికారులు సూచించారు.
మరోవైపు ఈ ఆదేశాలను అన్ని పాఠశాలలు పాటించాలని స్పష్టం చేశారు. అయితే.. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది విపత్తు నిర్వహణ సంబంధిత విధులకు అందుబాటులో ఉండాలని, అవసరమైనప్పుడు స్థానిక యంత్రాంగం జారీ చేసిన సూచనలను పాటించాలని ఉన్నతాధికారులు సూచించారు.