
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Rice vs Roti in Diabetes: డయాబెటీస్‌తో బాధపడేవారు వారి డైట్ మార్పులు కచ్చితంగా చేసుకోవాలి. వీరు తీసుకునే కార్బొహైడ్రేట్స్ మితంగా ఉండేలా చూసుకోవాలి. అయితే, అన్నం, చపాతీ రెండిటిలో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. త్వరగా జీర్ణం, ఫైబర్ అధికం, పరిమాణం ఆధారంగా మీ షుగర్ స్థాయిలు ఆధారపడి ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్థులకు చపాతీ తీసుకుంటే మంచిది. ఎందుకుంటే ఇది గోధుమలతో తయారు చేస్తారు. ఇందులో కావాలంటే మీరు ఇతర పిండి పదార్థాలు కూడా యాడ్ చేసి తయారు చేసుకోవచ్చు. అన్నంతో పోలిస్తే చపాతీ అనేది కాస్త మెల్లిగా జీర్ణం అవుతుంది. ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా చేస్తాయి. కానీ, రీఫైన్ చేసిన పిండితో తయారు చేసిన చపాతీలు, ఎక్కువ మోతాదు తీసుకున్నా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తాయి. రొట్టెలు మెల్లిగా జీర్ణం అవుతూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మెల్లిగా విడుదల అవుతాయి. ఇది షుగర్ నిర్వహణకు ఎంతో కీలక. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం మల్టీగ్రెయిన్ చపాతీ తీసుకోవాలి. ఇందులో బేసన్, మిల్లెట్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి.
షుగర్ వ్యాధిగ్రస్థులు ప్రధానం తెల్లబియ్యం తగ్గించాలి. ఇది త్వరగా జీర్ణం అవుతుంది. అయితే, డయాబెటిక్ డైట్లో రైస్ లేకుండా కష్టమే కానీ, బ్రౌన్ రైస్, పారాబాయిల్డ్ రైస్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. పాలిష్ చేసిన వైట్ రైస్‌కు దూరంగా ఉండండి. ఇందులో ఫైబర్ తక్కువ, గ్లైసెమిక్ సైచీ ప్రభావం ఉంటుంది.
రైస్‌తో ఇవి తినండి.. షగర్తో బాధపడుతున్నవారు రైస్ తినాల్సి వచ్చినప్పుడు బ్రౌన్ రైస్, పారాబాయిల్డ్ మంచి ఎంపిక. వైట్ రైస్‌తోపాటు పప్పులు, రాజ్మా, పనీర్, గుడ్లు, పెరుగు, చేపలు, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఫుడ్స్‌తో తినండి. ఇవి రక్తంలో చక్కెర పెరగకుండా బ్యాలన్స్ చేస్తాయి. మీరు తీసుకునే ఫుడ్స్‌లో సలాడ్, వెజిటేబుల్స్, ప్రోటీన్ ముందుగా తీసుకోవాలి. తిన్న తర్వాత గ్లూకోజ్ వెంటనే పెరగదు.
సింపుల్‌గా చెప్పాలంటే రైస్‌కు బదులుగా చపాతీ తినండి. మధ్యాహ్నం, రాత్రి సమయంలో బెస్ట్. కేవలం గోధుమ, మిక్సెడ్ గ్రెయిన్, బేసన్‌తో తయారు చేసిన చపాతీ తీసుకోవాలి. చిన్న పొర్షన్లో తసుకోండి. కార్బ్స్‌తో ప్రోటీన్ కలిపి తీసుకోండి. అయితే, పరగడపున కేవలం రైస్ లేదా రోటీ తినకండి.
ఇండియన్ ఫుడ్ ఇలా తినండి.. డయాబెటిక్ డైట్లో మీరు తినాల్సి వచ్చినప్పుడు రెండు చిన్న రోటీలు, దాంతోపాటు పప్పు, కూర, ఒక సలాడ్ ఇలా తినండి. లేకపోతే చిన్న గిన్నె బ్రౌన్ రైస్‌తో రాజ్మా, కూరగాయలు తీసుకోవాలి. సంప్రదాయ వంటకాలు మన డైట్లో కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెరను మెల్లిగా విడుదల చేస్తాయి.
సాధారణంగా షుగర్ వచ్చింది అనగానే అన్నం తినకూడదు. చపాతీలు తినాలి అంటారు. అయితే రెండిటిలో ఏది బెస్ట్ అంటే కచ్చితంగా మనం తీసుకునే పోర్షన్‌పై ఆధారపడి ఉంటుంది. అందుకునే తీసుకునే ఫుడ్‌లో కూరగాయలు, పప్పులు అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వండి. రైస్ vs రోటీ కాదు.. ఎంత తింటున్నారు? ఏం తింటున్నారు? ముఖ్యం.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.