
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
iPhone 18 Pro Max Leaks Latest News: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తన ప్రతిష్టాత్మక ఐఫోన్ సిరీస్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త సిరీస్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న లీక్‌ల ప్రకారం... యాపిల్ త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ (iPhone 18 Pro Max) బ్యాటరీ విభాగంలో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. యాపిల్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ ఐఫోన్లోనూ లేనంత అతిపెద్ద బ్యాటరీని ఈ మోడల్లో అందించబోతున్నట్లు ప్రముఖ టిప్స్టర్లతో పాటు చైనా సప్లై చైన్ వర్గాలు సంచారాన్ని లీక్ చేశాయి..
గత మోడల్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో 5,088mAh బ్యాటరీని అందించిన సంగతి తెలిసిందే..రాబోయే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో అంతకంటే శక్తివంతమైన బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. లీక్ అయిన వివరాల ప్రకారం.. గ్లోబల్ వేరియంట్లో ఏకంగా 5,100mAh నుంచి 5,200mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే, చైనా మార్కెట్ కోసం విడుదల చేసే వేరియంట్లో మాత్రం దాదాపు 5,000mAh బ్యాటరీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే ఐఫోన్ నుంచి రాబోతున్న అత్యధిక బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఫోన్‌గా ఇది నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సరికొత్త 2nm A20 ప్రో చిప్సెట్.. ఈ భారీ బ్యాటరీ సామర్థ్యంతో పాటు, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో యాపిల్ అత్యాధునిక 2 నానోమీటర్ (2nm) సాంకేతికతతో తయారు చేసిన A20 ప్రో (A20 Pro Chip) ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త చిప్సెట్ ఫోన్ పనితీరును అద్భుతంగా మెరుగుపరచడమే కాకుండా.. బ్యాటరీ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల వినియోగదారులకు గతంలో ఎప్పుడు లేని విధంగా అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ లభిస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే హెవీ గేమింగ్, 4K వీడియో రికార్డింగ్ చేసినా కూడా బ్యాటరీ సుదీర్ఘ కాలం పాటు వస్తుంది..
డిజైన్ వివరాలు.. సాధారణంగా బ్యాటరీ సైజ్ పెరిగితే ఫోన్ మందం (Thickness) కూడా విపరీతంగా పెరుగుతుంది. అయితే, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ విషయంలో యాపిల్ తన ఇంటర్నల్ డిజైన్‌లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.. దీనివల్ల ఫోన్ మందం పెరగకుండా కేవలం 8.75mm ప్రొఫైల్‌తోనే.. పాత మోడల్ అంతే స్లిమ్‌గా ఉంటునే.. పెద్ద బ్యాటరీని అడ్జస్ట్ చేయనున్నారు. కానీ, భారీ బ్యాటరీ, అధునాతన కెమెరా సెటప్ కారణంగా ఫోన్ బరువు స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సుమారు 240 గ్రాముల వరకు ఉండవచ్చని లీక్‌లు చెబుతున్నాయి.
డిస్ప్లే, ఇతర ఫీచర్లు.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 6.9-ఇంచుల భారీ LTPO OLED డిస్ప్లేను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. డిజైన్ పరంగా వెనుక వైపు గ్లాస్ ఫినిషింగ్‌తో పాటు రీలోకేటెడ్ సెల్ఫీ కెమెరా, పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Siri AI) ఫీచర్లు మరింత వేగంగా పనిచేయడానికి ఇందులో 12GB వరకు ర్యామ్‌తో తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
లాంచ్, ధర వివరాలు.. సాధారణంగా యాపిల్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో తన కొత్త ఐఫోన్ సిరీస్‌ను లాంచ్ చూస్తూ ఉంటుంది.. అదే విధంగా ఈ ఐఫోన్ 18 సిరీస్‌ను కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. విడిభాగాల ధరలు పెరుగుతున్నప్పటికీ.. యాపిల్ ఈ ఫ్లాగ్షిప్ సిరీస్ ధరలను గత ఏడాదితో పోలిస్తే.. పెద్దగా పెంచకుండా, దాదాపు అదే ధరల్లో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోందని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.