
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కొత్త ట్రెండ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చైనాకు చెందిన ‘బీఏటీ-బీఎంఎస్’ అనే యాప్‌ను ఉపయోగించి ఈ-రిక్షాలు, ఎలక్ట్రిక్ స్కూటర్లను రోడ్డుపైనే అకస్మాత్తుగా ఆపేస్తున్న...
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కొత్త ట్రెండ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చైనాకు చెందిన ‘బీఏటీ-బీఎంఎస్’ అనే యాప్‌ను ఉపయోగించి ఈ-రిక్షాలు, ఎలక్ట్రిక్ స్కూటర్లను రోడ్డుపైనే అకస్మాత్తుగా ఆపేస్తున్న వీడియోలు పెద్దఎత్తున వైరల్ అవుతున్నాయి. దీంతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా, ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ట్రెండ్‌ను వెంటనే అరికట్టాలని నెటిజన్లు కోరుతున్నారు.వైరల్ వీడియోల్లో చూపిస్తున్న ప్రకారం.. కొందరు యువకులు బీఏటీ-బీఎంఎస్ యాప్ ద్వారా బ్లూటూత్ సాయంతో ఈ-రిక్షా ‘బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్’(బీఎంఎస్)కు కనెక్ట్ అవుతున్నారు. అనంతరం ‘డిశ్చార్జ్’ స్విచ్‌ను ఆఫ్ చేయడంతో వాహనం ఒక్కసారిగా ఆగిపోతోంది. భారతదేశంలో తక్కువ ధరలో లభించే అనేక ఈ-రిక్షాలు, ఈ-స్కూటర్లలో చైనా తయారీ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్‌లు ఉండటం, వాటిలో భద్రతా ఫీచర్లు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. పాస్వర్డ్ లేకుండానే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ లోపాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు.బీఏటీ-బీఎంఎస్ అనేది వాస్తవానికి బ్యాటరీ పనితీరును పర్యవేక్షించేందుకు రూపొందించిన అధికారిక యాప్. బ్యాటరీ వోల్టేజ్, ఉష్ణోగ్రత, కరెంట్ వంటి వివరాలను రియల్‌టైమ్‌లో చూపించడంతో పాటు, బ్యాటరీని రిమోట్‌గా నియంత్రించే సౌకర్యం కూడా ఇందులో ఉంది. అయితే ప్రస్తుతం అదే ఫీచర్‌ను కొందరు ఈ-రిక్షాలను నిలిపివేయడానికి వినియోగిస్తున్నారు. ఈ యాప్ ఐఓఎస్ యాప్ స్టోర్‌లో అందుబాటులో లేదు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఇంకా ఉన్నట్లు సమాచారం.ఈ ట్రెండ్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుమధ్యలో వాహనం ఆగిపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, డ్రైవర్ల