
బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్ చిరకాల స్వప్నం నెరవేరింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 'నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్' ప్రారంభం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇది అమెరికాలో క్రికెట్ విస్తరణకు ఒక చారిత్రాత్మక మైలురాయి అని ఆయన అభివర్ణించారు.పొమోనాలోని ఫెయిర్‌ప్లెక్స్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ మైదానంలో జులై 1న తొలి మేజర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. తద్వారా తమ సొంత విపణి వెలుపల అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించిన తొలి గ్లోబల్ క్రికెట్ ఫ్రాంచైజీగా నైట్ రైడర్స్ గ్రూప్ రికార్డు సృష్టించింది.ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ, "ఒకప్పుడు కలగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నేడు వాస్తవరూపం దాల్చింది. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే రెండో క్రీడ అయిన క్రికెట్‌ను లాస్ ఏంజిల్స్‌కు తీసుకురావడం ఒక చరిత్రాత్మక ఘట్టం. ఇది కేవలం క్రీడా వేదిక మాత్రమే కాదు, సమాజం, వినోదం, కుటుంబాల కోసం నిర్మించిన ప్రదేశం. దీనిని లాస్ ఏంజిల్స్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు అంకితం చేస్తున్నాను" అని వివరించారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి సహకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా తదితరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.నైట్ రైడర్స్ స్పోర్ట్స్ సీఈఓ వెంకీ మైసూర్ మాట్లాడుతూ, ఈ స్టేడియం క్రికెట్ భవిష్యత్తుకు ఒక నిదర్శనమని పేర్కొన్నారు. సుమారు 21 మిలియన్ డాలర్ల వ్యయంతో, కేవలం