
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు.
అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Daycare Child Safety: డేకేర్ అంటే చిన్న పిల్లలను తల్లిదండ్రులు లేని సమయంలో సురక్షితంగా చూసుకోవడంతో పాటు వారికి మంచి అలవాట్లు, ప్రాథమిక విద్య, ఆటలు వంటి కార్యక్రమాలు నిర్వహించే కేంద్రం. పూర్తి రోజు, అర్ధ రోజు లేదా కొన్ని గంటల సేవల ప్రకారం ఫీజులు వసూలు చేస్తారు. ప్రస్తుతం అనేక ప్రైవేట్ సంస్థలు, పెద్ద కంపెనీలు కూడా తమ ఉద్యోగుల కోసం కార్యాలయాల్లోనే డేకేర్ సౌకర్యం కల్పిస్తున్నాయి.
అయితే ఇటీవల బెంగళూరులోని ఓ డేకేర్ కేంద్రంలో చిన్నారిపై జరిగిన దారుణ వేధింపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. చిన్నారిని భయపెట్టడం, ఏడుస్తున్నా పట్టించుకోకపోవడం, అనుచితంగా ప్రవర్తించడం వంటి ఘటనలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇలాంటి సంఘటనలు పిల్లల శారీరక ఆరోగ్యంతో పాటు వారి మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని బాలల నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందుకే డేకేర్ ఎంపిక చేసే ముందు తల్లిదండ్రులు కొన్ని విషయాలు తప్పనిసరిగా పరిశీలించాలి. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా, సిబ్బందికి సరైన శిక్షణ ఉందా, పిల్లల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారు వంటి అంశాలను తెలుసుకోవాలి. అలాగే పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
ఒకవేళ డేకేర్‌లో పిల్లలపై నిర్లక్ష్యం, శారీరక లేదా మానసిక వేధింపులు జరిగినట్లు అనుమానం వచ్చినా లేదా ఆధారాలు లభించినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అదేవిధంగా స్థానిక బాలల సంక్షేమ శాఖ లేదా బాలల రక్షణ అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలి. అవసరమైతే న్యాయవాది సహాయంతో చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
పిల్లలకు గాయాలు లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించడం కూడా చాలా ముఖ్యం. డాక్టర్ నివేదికలు భవిష్యత్తులో చట్టపరమైన విచారణలో కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయి. పిల్లలను డేకేర్‌లో ఉంచడం తప్పు కాదు. కానీ వారు సురక్షితమైన వాతావరణంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ అవకాశం ఇవ్వకపోవడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.