
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Goa Liquor Prices: ప్రకృతి అందాలు, అద్భుతమైన బీచ్‌లు, రాత్రిపూట పార్టీలకు కేరాఫ్ అడ్రస్ గోవా.. నిత్యం వేలాది మంది పర్యాటకులతో కిటకిటలాడే ఈ పర్యాటక ప్రాంతం.. తాజాగా మద్యం ప్రియులకు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. గోవాలో మద్యం ధరలు చాలా తక్కువనే అందరికీ సంగతి తెలిసిందే.. అయితే, ప్రస్తుతం అక్కడ విక్రయిస్తున్న బ్రాండ్ల ధరలు వింటే.. ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా సమాచారం ప్రకారం.. గోవాలో లభిస్తున్న కొన్ని లిక్కర్ బ్రాండ్ల ధరల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రూ.30లకే 90ml.. రూ.60కే క్వార్టర్.. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. గోవాలో మాత్రం చాలా చౌకగా లభిస్తున్నాయి. అక్కడ కేవలం రూ.30లకే 90ml బాటిల్ అందుబాటులో ఉండటం విశేషం.. ఇక ఎంతో మందికి ఇష్టమైన ఓల్డ్ మంక్ (Old Monk) బ్రాండ్ క్వార్టర్ బాటిల్ ధర కేవలం రూ.60 మాత్రమేనని అక్కడి వైన్స్ షాప్ నిర్వాకులు చెబుతున్నారు.
బ్రాండ్ల రేట్ల వివరాలు ఇవే.. గోవా వైన్ షాపుల్లో లభిస్తున్న కొన్ని ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ (Quarter) ధరల వివరాల్లోకి వెళితే.. రాయల్ ఛాలెంజ్ (Royal Challenge) క్వార్టర్ ధర ఇక్కడ కేవలం రూ.95 మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాకుండా మ్యాన్స్ నోస్ (Man's Nose) బ్రాండ్ క్వార్టర్ రూ.80 లకే లభింస్తోంది. ఇక ఇంపీరియల్ బ్లూ (Imperial Blue) ధర కేవలం రూ.85కే లభించడం విశేషం.. ఇక అందరూ ఎంతగానో ఇష్టపడే మెక్‌డోవెల్స్ (McDowell's) క్వార్టర్ కూడా రూ.85 లకే విక్రయిస్తున్నారు. దీంతో పాటు ప్రియులు ఇష్టపడే మ్యాజిక్ మూమెంట్స్ బ్లూ (Magic Moments Blue) వోడ్కా క్వార్టర్ ధర రూ.100కే అందుబాటులో ఉంది.
ఫుల్ బాటిల్ రూ.220 మాత్రమే.. ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఓల్డ్ మంక్ ఫుల్ బాటిల్ కేవలం రూ.220 లభిస్తుండటం.. బాటిల్‌పై ఉన్న గరిష్ట రిటైల్ ధర (MRP) ప్రకారం.. ఈ ధరలకే గోవాలో విక్రయిస్తున్నట్లు అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో వందల రూపాయలు పలికే బ్రాండ్లు ఇక్కడ ఇంత తక్కువ ధరలకే లభిస్తుండటంతో పర్యాటకులు ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.. మొత్తానికి గోవా ట్రిప్ ప్లాన్ చేసుకునే వారికి, ముఖ్యంగా అక్కడి నైట్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ధరల వివరాలు ఎంతగానో సహాయపడతాయి. రాబోయే పర్యటక సీజన్లో గోవాకు వెళ్లే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
(నోట్: ఈ వార్తను సోషల్ మీడియాలో లభించిన తాజా ధరల సమాచారం ఆధారంగా మాత్రమే అందించబడింది. దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.