
Nanded Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. 9 మంది మృతి.. మరో ముగ్గురికి సీరియస్
Nanded Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో ముగ్గురికి సీరియస్

Nanded Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో ముగ్గురికి సీరియస్

Road Accident | రోడ్డు ప్రమాదంలో ఇన్చార్జి ఏఈవో మృతి

Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..

కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిగురుమామిడి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం హుస్నాబాద్ నుంచి 54 మంది ప్రయాణికులతో కరీంనగర్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించేందుకు డ్రైవర్ హరీశ్ ప్రయత్నించాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది. అయితే, బస్సు తక్కువ వేగంతో ఉండడం, డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బావి అంచు వరకు వెళ్లి ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. భట్టి భార్య వసూళ్లు.. పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా? ఉద్వాసన ఖాయం!.. కొండా సురేఖను పట్టించుకోని అధిష్ఠానం

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ, కనెక్టివిటీపై ఐఏఎల్ఏ (IALA) రెండో అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్‌ప్రీత్ సింగ్ పలు కీలక సూచనలు చేశారు. ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతో పాటు వాహనదారులు, పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో యుటిలిటీ పనుల కోసం తరచూ రోడ్లను తవ్వుతున్నప్పటికీ.. పనులు పూర్తైన తర్వాత రోడ్లను సక్రమంగా, నాణ్యతతో పునరుద్ధరించడం లేదని ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. దీంతో రోడ్లు unevenగా మారి ప్రమాదాలకు అవకాశం పెరుగుతోందని తెలిపారు. యుటిలిటీ పనులు పూర్తైన వెంటనే సంబంధిత సంస్థలు రోడ్లను సకాలంలో నాణ్యతతో పునరుద్ధరించాలని సూచించారు. మరోవైపు ఓలా, ఉబర్ వాహనాల అనియంత్రిత పార్కింగ్ కూడా ట్రాఫిక్ రద్దీకి కారణమవుతోందని అధికారులు తెలిపారు. ఉద్యోగులను పికప్, డ్రాప్ చేసే సమయంలో రోడ్లపై వాహనాలు గుమిగూడకుండా ఐటీ సంస్థలు, ప్రధాన సంస్థలు తమ ప్రాంగణాల్లోనే పికప్, డ్రాప్ ప్రాంతాలతో పాటు ఓలా, ఉబర్ వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ లేదా హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో రోడ్ల అభివృద్ధి, కనెక్టివిటీపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రతిపాదిత రోడ్డు అభివృద్ధి ప్రణాళికను పరిశీలించిన ట్రాఫిక్ అధికారులు.. రహదారుల అనుసంధానం, ట్రాఫిక్ ప్రవాహం, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఫ్రీ లెఫ్ట్‌లు, జంక్షన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఫ్రీ లెఫ్ట్ మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు జంక్షన్లలో ఛానలైజేషన్, రోడ్డు జ్యామెట్రీలో మార్పులు చేపట్టాలని సూచించారు. దీంతో జంక్షన్ల వద్ద వాహనాల వేచి ఉండే సమయం తగ్గి ట్రాఫిక్ మరింత సాఫీగా సాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే రోడ్డు

హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రూ.620 కోట్లతో నిర్మించిన కీలక కారిడార్ ప్రారంభానికి సిద్ధమైందని పేర్కొన్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. రూ.620 కోట్లతో నిర్మించిన కీలక కారిడార్ ప్రారంభానికి సిద్ధమైందని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్–ఓవైసీ జంక్షన్ కారిడార్ ప్రారంభిస్తు్న్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కారిడార్ ప్రారంభోత్సవం జరుగుతోందని చెప్పుకొచ్చారు. నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్–సైదాబాద్–ఐఎస్ సదన్–ఓవైసీ జంక్షన్ మధ్య ఈ కారిడార్ ఉందని మంత్రి పొన్నం తెలిపారు. 3.23 కిలోమీటర్ల పొడవున కాన్ఫ్లిక్ట్ ఫ్రీ కారిడార్ నిర్మాణం ఉంటుందని వివరించారు. 2.53 కిలోమీటర్ల ప్రధాన వయాడక్ట్.. 200 మీటర్ల అప్ ర్యాంప్ ఉంటుందని చెప్పారు. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ ఆస్పత్రి వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. ప్రయాణ సమయం సుమారు 30 నిమిషాల వరకు ఆదా అవుతుందని వెల్లడించారు. చంచల్‌గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారమవుతాయని మంత్రి పొన్నం చెప్పారు. ఆయా వాహనాలు నిలిచిపోయే సమయం తగ్గడంతో ఇంధన వినియోగం తగ్గుతుందని వెల్లడించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలోనూ కారిడార్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. హైదరాబాద్‌ను ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థ కలిగిన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ఫ్లైఓవర్లు, వంతెనలు, కాన్ఫ్లిక్ట్ ఫ్రీ కారిడార్లకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నూతన కారిడార్ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు వెళ్లే జాతీయ రహదారి-65కు భారీ అప్‌గ్రేడ్‌కు మార్గం సుగమమైంది. మొత్తం 285 కిలోమీటర్ల మేర రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనకు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12,073.99 కోట్లుగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత ఆందోల్ మైసమ్మ ఆలయం సమీపం నుంచి విజయవాడ గొల్లపూడి వరకు 181 కిలోమీటర్ల మార్గాన్ని తొలి ప్యాకేజీగా అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ నుంచి నందిగామ వరకు 45 కిలోమీటర్ల భాగం రెండో ప్యాకేజీలో, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 59.69 కిలోమీటర్ల మార్గం మూడో ప్యాకేజీలో ఉంటుంది. అధికారుల అంచనాల ప్రకారం తొలి ప్యాకేజీకి రూ.7,321.97 కోట్లు ఖర్చవుతాయి. రెండో ప్యాకేజీకి రూ.2,965.11 కోట్లు, మూడో ప్యాకేజీకి రూ.1,786.91 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.. భూసేకరణ, రహదారి నిర్మాణం, జీఎస్టీ తదితర అన్ని వ్యయాలను కలిపితే ఒక్కో కిలోమీటరుకు సగటున రూ.38 కోట్ల వరకు ఖర్చు కానుంది. తెలంగాణలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ఈ రహదారి సాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో పనులు కొనసాగనున్నాయి. తెలంగాణ పరిధిలోని రెండు ప్యాకేజీలకు సంబంధించి భూసేకరణ కోసం రూ.1,453.88 కోట్ల వరకు అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ రెండు ప్యాకేజీలకు కలిపి 1,387.628 హెక్టార్ల భూమి అవసరం కాగా.. ఇప్పటికే 1,174.295 హెక్టార్ల భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా 213.33 హెక్టార్ల భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. ఇక విజయవాడ-మచిలీపట్నం విభాగంలో 351.185 హెక్టార్ల భూమి అవసరం కాగా.. 344.685 హెక్టార్లు అందుబాటులో ఉంది. దీంతో అదనంగా సుమారు 6.50 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం మొత్తం మార్గాన్ని హైస్పీడ్ కారిడార్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక క్యారేజ్‌వేల ఏర్పాటుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలు దూరం చేసేందుకు ప్రయత్నాలు హైదరాబాద్ సిటీ: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక క్యారేజ్‌వేల ఏర్పాటుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వల్ల వాహనాలు సులభంగా వెళ్లడానికి వీలవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, ట్రాఫిక్ డీసీపీ సంక్రాంతి రవికుమార్, అదపు డీసీపీ జి.హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ కె.చంద్రశేఖర్ రెడ్డి పలు ప్రాంతాల్లో మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడం, యూటర్న్లు, జంక్షన్ల ఆప్టిమైజేషన్ ద్వారా ట్రాఫిక్ ఆలస్యాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. కేపీహెచ్‌బీ, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలోని జేఎన్టీయూ నుంచి సింక్రోనీ (రాయదుర్గం) మెట్రోస్టేషన్ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ప్రత్యేక క్యారేజ్‌వే ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. చర్లపల్లి-తిరుచానూరు మధ్య 2 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ రాయదుర్గంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోరమైన హిట్ అండ్ రన్ ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా కారు కాలినడకన వెళ్తున్న నందులాల్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రమైన ఘటనలో నందులాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రమాదాన్ని చూసి సహాయం చేయడానికి పరుగెత్తుకు వచ్చిన జైద్ షా కాద్రి అనే విద్యార్థి కూడా అదే వాహనం తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి కారును నిలపకుండా అక్కడి నుండి వేగంగా పరారయ్యాడు. ఈ హిట్ అండ్ రన్ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు వెంటనే దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా వాహనాన్ని నడిపినది ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌గా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో పోలీసులు వేగంగా స్పందించి సందీప్‌ను అరెస్ట్ చేసి, ప్రమాదానికి వాడిన కారును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆనంద్ సాయి తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందడమే కాకుండా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ ట్రస్ట్ బోర్డులో జనసేన నామినీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రమాద సమయంలో వాహనం ఏ వేగంతో వెళ్తోంది, డ్రైవర్ మద్యం సేవించి ఉన్నారా లేదా అనే అంశాలపై పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, గాయపడిన విద్యార్థి జైద్ షా కాద్రిని స్థానికులు తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. మరోవైపు ప్రాణాలు కోల్పోయిన నందులాల్ కుటుంబ నేపథ్యం, ఇతర వివరాలను సేకరించే పనిలో పోలీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల ఏర్పాటుకు కేంద్రం తోడ్పాటును అందిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు ఉన్న జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా విస్తరించే ప్రతిపాదనకు కేంద్రం కీలక ఆమోదం లభించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సమర్పించిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ పీపీపీఏసీ ఆమోదం తెలిపింది.ప్రైవేటుకు భూగర్భ బొగ్గు గనులు.. కేంద్రం సూచన .. సింగరేణి యోచన!జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా విస్తరణకు భూసేకరణ, నిర్మాణం కోసం భారీ వ్యయంప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సీసీఈఏ తుది అనుమతి ఇచ్చిన వెంటనే టెండర్లు, భూసేకరణ పనులు వేగంగా మొదలుకానున్నాయి. మొత్తం 284 కిలోమీటర్ల మేర ఈ విస్తరణకు భూసేకరణ, నిర్మాణం కోసం భారీ వ్యయం కానుంది. ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా అమలు చేయనున్నారు. మల్కాపూర్ నుంచి విజయవాడ గొల్లపూడి బైపాస్ వరకు 284 కి.మీ మార్గాన్ని నాలుగులేన్ల నుంచి ఆరు లేన్లుగా మారుస్తారు.ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా నిర్మాణందీనిని బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ బీఓటీ విధానంలో రెండు ప్యాకేజీలుగా హైదరాబాద్-నందిగామ ఒక ప్యాకేజీ, నందిగామ-గొల్లపూడి మరో ప్యాకేజీగా చేపడతారు. ప్రస్తుత నాలుగు లేన్లను ఉంచి ఇరువైపులా కొత్త సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ క్రాసింగ్ నుంచి మచిలీపట్నం వరకు 44 కి.మీ మార్గాన్ని హైబ్రిడ్ అన్యుటీ మోడల్ హ్యామ్ కింద ఒకే ప్యాకేజీగా ఆరు లేన్లుగా విస్తరిస్తారు.పోర్న్ కంటెంట్ తో బిగ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్: ఈ యాప్‌లు తక్షణమే డిజేబుల్ చేయండి- కేంద్రంగొల్లపూడి వరకు ప్రతిపాదనకు ఓకే.. ఆ ప్రతిపాదనలకు నో పర్మిషన్ప్రారంభంలో కంచికచర్ల వరకే ఉన్న ప్రతిపాదనను గొల్లపూడి వరకు పొడిగించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయడంతో విస్తరణ పెంచారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అడిగిన గొల్లపూడి నుంచి భవానీపురం కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు

రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడుచుకుంటూ వెళ్తున్న నందులాలను ఇన్నోవా కార్ బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని విద్యార్థి జైద్‌షా కద్రీ ఆస్పత్రికి తీసుకెళ్తుండా మరో ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న విద్యార్థిని మహేంద్ర కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నందులాల అక్కడికక్కడే మృతిచెందగా.. విద్యార్థి జైద్‌షా కద్రీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు యాజమాని వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు.. విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. మహేంద్ర కార్ యాజమానిని గుర్తించారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్.. కారు నడిపి ఒకరి మృతికి కారణమైనట్లు విచారణలో తేలింది. దీంతో కారును సీజ్ చేసిన పోలీసులు.. సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల మూడు పోలవరాలు కట్టేంత మొత్తాన్ని పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను వెంటనే రద్దు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్, కాంగ్రెస్ నేత తుంబూరు దయాకర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై అక్రమ ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుంబూరు దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ... దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం గళమెత్తుతున్న రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని విమర్శించారు. ప్రజా సమస్యలను నిలదీసే ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, చట్టాలను దుర్వినియోగం చేస్తూ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన నియంతృత్వ వైఖరిని మార్చుకుని ఎఫ్ఐఆర్ను రద్దు చేయకపోతే ప్రజల తరఫున మరింత పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట వీరభద్రం, ఏదులాపురం టౌన్ అధ్యక్షుడు కిశోర్ నాయక్, మున్సిపాలిటీ చైర్పర్సన్ కోకపర్తి అనిత, వైస్ చైర్మన్ నవీన్, వివిధ విభాగాల ప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు

Narendra Modi: భారతదేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ భారత్ మంచి వృద్ధిని సాధించిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేయడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వృద్ధి దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ప్రపంచంలో యుద్ధాలు, అంతర్జాతీయ సమస్యలు, సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా విదేశీ పర్యటనల గురించి కూడా ప్రధాని మాట్లాడారు. కేవలం వినోదం కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించారు. అలాగే విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం కూడా తగ్గించాలని అన్నారు. అవసరం లేని సమయంలో బంగారం కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరారు. దేశంలో తయారయ్యే వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించడం వల్ల దేశంలోని వ్యాపారాలు, పరిశ్రమలు, ఉద్యోగాలకు కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని మోదీ కోరారు. దేశ ప్రజలంతా కలిసి పనిచేస్తే భారత్ మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని అన్నారు. ముఖ్యంగా యువత కలలను నెరవేర్చే బాధ్యత నేటి తరంపై ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశంలో నిరాశ వాతావరణం సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా ప్రధాని విమర్శలు చేశారు. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తూ 7.8 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సమావేశానికి పలు దేశాల నాయకులు హాజరయ్యారు. భారత్ అభివృద్ధి, స్వయం

ఓ రోడ్డు ప్రమాదం కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బైక్‌పై ప్రియురాలు వెనుక కూర్చుంటే, నడిపే ప్రియుడికి ఉత్సాహం రావడం సహజమేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, ప్రమాదంలో మరణించిన యువకుడికి పాక్షిక బాధ్యత ఉందని నిర్ధారించింది.2018 మే 10న తేని జిల్లాకు చెందిన 19 ఏళ్ల గోపాల్, తన ప్రియురాలు రాజేశ్వరితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. వీరపాండి-వాయల్‌పట్టి మార్గంలో అర్ధరాత్రి సమయంలో వారి బైక్‌ను ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందగా, రాజేశ్వరి గాయపడ్డారు. దీంతో గోపాల్ తల్లిదండ్రులు పరిహారం కోసం తేని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రైబ్యునల్, 2021లో మృతుడి కుటుంబానికి రూ. 25.5 లక్షలు చెల్లించాలని వ్యాన్ బీమా సంస్థను ఆదేశించింది.ఈ తీర్పుపై బీమా సంస్థ హైకోర్టులో అప్పీల్ చేసింది. జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ ఎం.డి. సుమతిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడికి 25 శాతం పాక్షిక నిర్లక్ష్యం ఉందని కోర్టు తేల్చింది. "మృతుడు 19 ఏళ్ల యువకుడు. అతడి ప్రియురాలు వెనుక కూర్చుని ఉన్నారు. ప్రియురాలు వెనుక కూర్చున్నప్పుడు ఏ రైడర్‌కైనా ఉత్సాహం రావడం సహజం" అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. దీనికి తోడు, మృతుడు రోడ్డుకు కుడివైపున బైక్ నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించకపోవడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ట్రైబ్యునల్ విధించిన

Kakinada: తునిలో ఘోర రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు! ఈ వార్తకు సంబంధించిన

తెలంగాణలో సీఆర్ఐఎఫ్ రోడ్లు, సేతుబంధన్, రైలు ఓవర్ బ్రిడ్జ్ పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్రంలో సీఆర్ఐఎఫ్ (CRIF) రోడ్లు, సేతుబంధన్, రైలు ఓవర్ బ్రిడ్జ్ (ROB) పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా పనుల పురోగతి మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 3,918 కి.మీ రోడ్లకు రూ.5,159 కోట్లతో 316 పనులు మంజూరు అయ్యాయని వివరించారు. 2025-26లో రూ.868 కోట్లతో 422.36 కి.మీ రోడ్ల పనులు చేపట్టామని తెలిపారు. హై లెవెల్ బ్రిడ్జిలు, ROB పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మిర్యాలగూడ, నంది పహాడ్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. నార్కట్‌పల్లి బ్రిడ్జి పనుల పురోగతిపై ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో మరింత కష్టపడి పని చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 2026, డిసెంబర్ నాటికి సచివాలయంలో సోలార్ కార్ పార్కింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో సోలార్ కార్ పార్కింగ్ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. సోలార్ పార్కింగ్తో సచివాలయానికి 90 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వివరించారు. దీంతో నెల వారీ విద్యుత్ బిల్లులో 16 శాతం ఆదా అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల దూసుకొచ్చిన కొండచిలువ.. పర్యాటకులకు షాక్.. వీడియో వైరల్

రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది. న్యూఢిల్లీ, ఆగస్టు 22: రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బస్సు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి బెట్టియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. చిన్న పాప జన్మదినం సందర్భంగా ఈ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని ఆ కుటుంబం నిర్వహించిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఆ పాప తండ్రి కూడా మరణించారని పోలీసులు చెప్పారు. మృతులందరిని గుర్తించామని పేర్కొన్నారు. అతి వేగంతో వెళ్తున్న బస్సు.. ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించే క్రమంలో ఆర్కేస్ట్రా వైపు బస్సు దూసుకెళ్లిందని వివరించారు. ఈ కార్యక్రమం వద్ద ప్రజలు గుంపుగా ఉన్నారని పోలీసులు చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల జాబ్ క్యాలెండర్‌తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి

భూపాలపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీతో బాధపడుతున్న మహిళను అడవిలో వదిలేశారు. అక్కడ ఒంటరిగా ఉన్న సదరు మహిళను స్థానికులు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. భూపాలపల్లి, ఆగస్టు 22: మానవత్వాన్ని మంటగలుపుతూ కన్నవారే కసాయివారిలా మారారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులే అడవిలో వదిలేశారు. ఈ అమానుష ఘటన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన లలిత (35) హెచ్ఐవీతో బాధపడుతున్నారు. కరీంనగర్ ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్తామని చెప్పి కుటుంబ సభ్యులు ఆమెను మేడారం-కాటారం రహదారిలోని పెద్దవాగు సమీప అడవిలో వదిలేశారు. ఒంటరిగా ఉన్న లలితను అటుగా వెళ్తున్న స్థానికులు గమనించారు. ఆ వెంటనే 108కి సమాచారం అందించడంతో సిబ్బంది మహదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై స్థానిక గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆదుకోవాల్సిన కుటుంబమే అలా ఒంటరిగా వదిలేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన బాధితురాలి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ యువతిని కారు ఢీకొట్టడంతో అమె ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికి తెలిసిందే. ప్రమాద సమయంలో ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ ఆ కారు నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ప్రమాదంపై తాజాగా రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ స్పందించారు. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందడం తీవ్ర విషాదకరమని పేర్కొంటూ, మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తన కుమారుడు సంజుష్ మానవతా దృక్పథంతో వ్యవహరించి, తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించాడని ఎంపీ తెలిపారు. అనంతరం పోలీసులకు స్వయంగా ప్రమాదం గురించి సమాచారం అందించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వారికి వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సంజుష్‌కు మూడు వేర్వేరు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆ పరీక్షలన్నింటిలోనూ ఫలితాలు నెగెటివ్‌గా వచ్చినట్లు ఎంపీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు అధికారులకు తన కుమారుడు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాడని తెలిపారు. ఈ కేసులో తాము ఎలాంటి విషయాన్ని దాచడం లేదని, చట్టపరమైన ప్రక్రియల నుంచి తప్పించుకునే ఉద్దేశం గానీ ప్రయత్నం గానీ తమకు లేదని ఎంపీ లింగమనేని రమేష్ స్పష్టం చేశారు. పోలీసుల నిష్పక్షపాత దర్యాప్తు ద్వారా వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 16 మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన 26 ఏళ్ల భారతి ముఖి ఇనార్బిట్ మాల్లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. అయితే భారతి తన ఫ్రెండ్‌తో కలిసి లంచ్ తెచ్చుకుని రోడ్డు దాటే క్రమంలో అటుగా వేగంగా వచ్చిన ఓ లగ్జరీ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా

బల్వంతపూర్‌కు చెందిన రాజు(35), భాగ్య(22) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం అర్ధరాత్రి కారులో ప్రయాణిస్తూ ప్రమాదావశాత్తు బావిలో పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయంపై మృతుడు రాజు అన్న రవి బాధపడిన తీరు అక్కడి స్థానికులను కలిచివేసింది. ఈ హృదయ విధారక ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వద్దు తమ్మి.. పొద్దున్నే పోదువు ‘సిద్దిపేటలో మా బావ దీశెట్టి మల్లేశం మృతి చెందాడు. 19న దశదిన కర్మ కావడంతో తమ్ముడు రాజు తన భార్య పిల్లలతో సిద్దిపేటకు వచ్చారు. అందరం కలిసి సంతోషంగా భోజనం చేశా’మని మృతుడు రాజు అన్న రవి తెలిపారు. సాయంత్రం కావడంతో ‘అన్నా.. ఇంటికి వెళ్తాం’ అని రాజు చెప్పడంతో.. ‘చీకటి అవుతుంది. వద్దు తమ్మి.. పొద్దున పోదువు’ అని చెప్పా. ‘అన్నా నీకాళ్లు మొక్కుతా’ అంటూ.. వినకుండా తన భార్య పిల్లలతో కారులో బయల్దేరారు. అంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుందంటూ రోదిస్తూ రవి వెల్లడించారు. ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) హైదరాబాద్ : హైటెక్స్‌లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు) స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్! ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..? ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ

Eng Vs Pak: ఇంగ్లాండ్, పాకిస్థాన్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే వాతావరణం వేడెక్కింది. ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై తీవ్రమైన విమర్శలు చేశాడు. “పాకిస్థాన్ పరమచెత్త జట్టు. వారిలో ఏమాత్రం టాలెంట్ లేదు. ఇంగ్లాండ్ ఈ సిరీస్‌ను 3-0 తేడాతో చాలా తేలికగా గెలుచుకుంటుంది” అంటూ వ్యాఖ్యానించాడు. లీడ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ కేవలం 171 పరుగులకే ఆలౌట్ కావడంతో బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా పై సల్మాన్ భట్ ప్రశ్నాస్త్రాలు స్టువర్ట్ బ్రాడ్ చేసిన విమర్శలపై సల్మాన్ భట్ ఘాటుగా స్పందించాడు. తమ జట్టు ప్రస్తుతం మంచి క్రికెట్ ఆడటం లేదనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నానని, అలా అని చెత్త జట్టు అని సంబోధించడం సరైంది కాదని మండిపడ్డాడు. ఇంగ్లాండ్ జట్టు గొప్పలు చెప్పుకోవడం ఆపి తమ సొంత రికార్డులను చూసుకోవాలని సూచించాడు. “మీరు ఆస్ట్రేలియా వెళ్లిన ప్రతిసారీ 0-5 తేడాతో ఘోరంగా ఓడిపోయి వస్తారు. గత 16 ఏళ్లుగా ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేకపోయింది. కేవలం ఒక్కటంటే ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే గెలిచింది” అంటూ ఇంగ్లాండ్ వైఫల్యాలను ఎండగట్టాడు. ఇది కూడా చదవండి: Test Record: సచిన్ 200 మ్యాచ్‌ల ప్రపంచ రికార్డ్ అవుట్.. 167వ టెస్టులోనే సంచలనం సృష్టించిన ఇంగ్లాండ్ బ్యాటర్ ఒకప్పుడు పాకిస్థాన్ బౌలింగ్ విభాగం అత్యంత బలంగా ఉండేదని సల్మాన్ భట్ గుర్తు చేశాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ జట్టులో 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సాధారణ బౌలర్లు ఉన్నారని, అప్పట్లో ఎవరూ ఇంగ్లాండ్‌ను చెత్త జట్టు అని అనలేదని పేర్కొన్నాడు. తమ జట్టు బలహీనంగా ఉన్న మాట వాస్తవమేనని, ఒకవేళ ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్

ముమ్మిడివరం : తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం కొమరగిరి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కొమరగిరి - గట్టువారిపేట మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతులు ఐ.పోలవరం మండలం కొమరగిరి గ్రామానికి చెందిన ఈతకోట సూర్యకుమార్(39), జి.వేమవరం గ్రామానికి చెందిన ఆకుల సాయి(30)గా గుర్తించారు. మూడో వ్యక్తి నిచ్చినకొళ్ల రంగ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) జాతీయ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల కోసం ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎ్సజడ్) పరిధిలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు గతంలో... సుప్రీంకోర్టు నిర్ణయం.. తదుపరి విచారణ 24కు వాయిదా న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) జాతీయ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల కోసం ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎ్సజడ్) పరిధిలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన స్టేను పొడిగించింది. కేబీఆర్ పార్కు ఈఎ్‌సజడ్‌లో చెట్ల నరికివేతపై స్టే విధించాలని కోరుతూ కాజల్ మహేశ్వరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేబీఆర్ పార్కు పరిసరాల్లో ఎలాంటి నియంత్రణ లేని నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పర్యావరణానికి శాశ్వత నష్టం జరగకుండా చూడడానికి తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే, హైకోర్టు తక్షణ స్టే ఇవ్వడానికి బదులుగా.. ఈఎ్‌సజడ్‌లో ఏయే పనులకు అనుమతి ఉంది? వేటిని నియంత్రించాలి? లేదా నిషేధించాలి? అనే అంశాలపై పరిశోధన చేసి, వివరాలు సమర్పించాలని పిటిషనర్లనే ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కాజల్ మహేశ్వరి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్కు చుట్టూ 25 నుంచి 35 మీటర్ల బఫర్ జోన్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను నరకరాదంటూ మే 18న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పిటిషన్ గురువారం జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు, వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున, కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Lingamaneni Sanjush Accident Case: ఐటీ కారిడార్‌లో భోజనం చేసి రోడ్డు దాటుతూ వెళ్తున్న యువతిని అత్యంత వేగంగా కారుతో దూసుకొచ్చి ఢీకొట్టడంతో ఆమె ఎగిరి కిందపడి దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం చేసిందెవరో కాదు ఏపీలోని జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూశ్. ప్రమాదం జరిగి నాలుగు రోజుల తర్వాత పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇంకా అరెస్ట్ చేయకపోవడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇన్ఆర్బిట్ మాల్లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పనిచేసే ఇద్దరు మహిళా ఉద్యోగులు భారతి ముఖి (26), పూజా అశోక్ ఆగస్టు 16న భోజనం కోసం రోడ్డు అవతల ఉన్న హోటల్‌కు వెళ్లారు. భోజనం చేసి వారిద్దరూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరిగి విధుల్లో చేరేందుకు వస్తూ రోడ్డు దాటుతున్నారు. ఆ సమయంలో స్పోర్ట్స్ కారు (టీజీ09జీ0666) కారు అత్యంత వేగంగా దూసుకువచ్చి భారతి ముఖిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు భారతి ముఖి ఎగిరి కిందపడగా.. పూజా అశోక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కారును ఏపీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూశ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ప్రమాదం అనంతరం వెంటనే తీవ్ర గాయాలపాలైన భారతి ముఖికి హుటాహుటిన అదే కారులో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాద సమయంలో భారతి ముఖితో ఉన్న పూజా అశోక్ వెంటనే ఈ విషయాన్ని లైఫ్‌స్టైల్ స్టోర్ మేనేజర్ అశ్విన్ కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విషయం

హైదరాబాద్ నగరంలోని ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ స్పందించాడు. ఈ ఘటన తన నిర్లక్ష్యం వల్ల జరగలేదని, ఇది కేవలం దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదమని పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా వ్యవహరించి, గాయపడిన యువతి భారతిని తానే స్వయంగా ఆసుపత్రికి తరలించానని తెలిపాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రమాద వివరాలను పోలీసులకు తెలియజేశానని వివరించాడు.ఆగస్టు 16న మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న భారతి (26) అనే యువతిని సంజూష్ నడుపుతున్న ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. భారతి ఇనార్బిట్ మాల్లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. సంజూష్ కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు సంజూష్‌పై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) కింద నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమైనందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ నేరం బెయిలబుల్ కావడంతో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.పోలీసుల దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని సంజూష్ స్పష్టం చేశాడు. ప్రమాదం తర్వాత పోలీసులు

LB Nagar: ఎల్బీనగర్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు! LB Nagar: నవ భారత నిర్మాత, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఎల్బీనగర్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ మల్రెడ్డి రాంరెడ్డి గారు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్రెడ్డి రాంరెడ్డి గారు మాట్లాడుతూ, దేశ అభివృద్ధి, ఆధునికీకరణ, యువత భవిష్యత్తు కోసం దూరదృష్టితో పనిచేసిన మహానేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. భారతదేశాన్ని 21వ శతాబ్దం వైపు నడిపించేందుకు ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు దేశ ప్రగతికి బలమైన పునాది వేశాయని అన్నారు. రాజీవ్ గాంధీ గారి సమర్థవంతమైన నాయకత్వం ఆధునిక భారత నిర్మాణానికి దిశానిర్దేశం చేసిందని తెలిపారు. ముఖ్యంగా కంప్యూటరీకరణ, టెలికమ్యూనికేషన్స్, సాంకేతిక రంగాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత భారతదేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసిందన్నారు. భవిష్యత్ అవసరాలను ముందుగానే గుర్తించి దేశంలో సాంకేతికతను విస్తరించేందుకు కృషి చేసిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలోనూ రాజీవ్ గాంధీ గారి ఆలోచనలు ఎంతో కీలకమైనవని మల్రెడ్డి రాంరెడ్డి గారు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, స్థానిక సంస్థలకు అధికారాలు, బాధ్యతలు కల్పించడం ద్వారా గ్రామీణాభివృద్ధికి ఆయన బలమైన పునాది వేశారని తెలిపారు. ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించడం ద్వారా యువతకు తమకు నచ్చిన రాజకీయ నాయకులను ఎన్నుకునే అవకాశం కల్పించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా యువత రాజకీయాల్లో రాణించేలా, 25 ఏళ్ల వయస్సు కాకుండా 21 ఏళ్లకే చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కల్పించాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తున్నారు. 1980వ దశకంలోనే ప్రపంచంలో చోటుచేసుకుంటున్న సాంకేతిక మార్పులను గుర్తించి, భారతదేశం కూడా సాంకేతికంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని రాజీవ్ గాంధీ

హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్- వే ట్రాఫిక్ విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ వన్ వే ట్రాఫిక్‌పై సర్ప్రైజ్ చెక్ నిర్వహించారు. హైదరాబాద్, ఆగస్టు 20: హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్- వే ట్రాఫిక్ విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ వన్ వే ట్రాఫిక్‌పై సర్ప్రైజ్ చెక్ నిర్వహించారు. సామాన్యుడిలా బైక్‌పై ప్రయాణిస్తూ ట్రాఫిక్‌ను పర్యవేక్షించారు. రోడ్ నంబర్ 45 నుంచి ఫిల్మ్‌నగర్ వరకు బైక్‌పై రెండు సార్లు తిరుగుతూ ట్రాఫిక్‌ను పరిశీలించారు. జంక్షన్లలో విధుల్లో ఉన్న పోలీసులతో ట్రాఫిక్‌పై సీపీ ఆరా తీశారు. మధ్యాహ్నం కూడా మరోసారి ట్రాఫిక్ సరళిపై పర్యవేక్షించారు. వన్‌వే కారణంగా తొలి రోజు వాహనదారులు కొంత అయోమయానికి గురైనప్పటికీ.. రెండో రోజు నుంచి రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని సజ్జనార్ తెలిపారు. అన్ని జంక్షన్లలో స్పష్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తగినంత మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ, నిర్మాణ సంస్థ సమన్వయంతో H-CITY పనులు జరుగుతున్నాయన్నారు. పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు సహకారించాలని కోరారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని ప్రజలకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఎస్సీబీఏ సీనియర్ ఎగ్జక్యూటివ్ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పడం సిగ్గుచేటు: ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఫీవర్ ఆసుపత్రి సమీపంలో ఓ టిప్పర్ అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నారు. డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని స్థానికులు ఆరోపించగా, ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక నాయకులు జోక్యం చేసుకుని డ్రైవర్‌ను పంపించేశారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చర్యలు ప్రారంభించారు

Kukatpally: కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతి Kukatpally: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్ బస్‌స్టాప్ వద్ద రోడ్డు ప్రమాదంలో యూసఫ్ (40) అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రశాంత్‌నగర్ బస్‌స్టాప్ వద్ద యూసఫ్‌ను టిప్పర్ లారీ ఢీకొట్టింది. అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొనడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన యూసఫ్, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ వాహనంతో సహా అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఘటనపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పంచముఖి హనుమాన్ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు వైపు నుంచి వస్తున్న ఓ బొలెరో వాహనం.. బెల్లంపల్లి వెళ్తేందుకు యూటర్న్ తీసుకుంటున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శాంతిఖని గనిలో పనిచేస్తున్న సురేష్(37) అనే సింగరేణి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చిరంజీవి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కరీంనగర్‌కు తరలించారు. తిరుమల హిల్స్‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సురేష్ మృతితో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ హృదయవిదారక ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.దుబ్బాక మండలం బలవంతాపూర్ గ్రామానికి చెందిన రాజు, తన భార్య భాగ్య, కుమారుడు నియాన్ష్, కుమార్తె శాన్వికతో కలిసి సిద్దిపేటలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరయ్యారు. వేడుక ముగిసిన అనంతరం రాత్రి కారులో తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. అయితే, ఎంతసేపటికీ వారు ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.రంగంలోకి దిగిన పోలీసులు రాజు మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. అప్పనపల్లి గ్రామ శివారులో సిగ్నల్ నిలిచిపోవడంతో అక్కడ పరిశీలించగా, రోడ్డు పక్కన ఉన్న బావిలో కారు పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి కారును, మృతదేహాలను వెలికితీశారు.ఈ ప్రమాదంలో రాజు, భాగ్య, నియాన్ష్, శాన్విక అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు. చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు. గోల్కొండ క్రాస్‌రోడ్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, తాళ్లబస్తీ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, పోస్టాఫీస్ పరిధిలో మధ్యా హ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఏడీఈలు కోరారు. కేపీహెచ్‌బీ కాలనీ: టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో జలమండలి పనుల నేపథ్యంలో గురువారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కేపీహెచ్‌బీ లోధా అపార్ట్మెంట్స్, ఇందూ అపార్ట్మెంట్స్, బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్, ఫిష్ మార్కెట్, ఎన్ఎస్ఎల్ మాల్, డీమార్ట్ ఏరియా, ఐదోఫేజ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు
సిద్దిపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బావిలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. మృతులంతా ఓకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలంలోని బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగల రాజు, భాగ్య దంపతులకు కుమారుడు నిహాన్ష్, కుమార్తె శాన్విక సంతానం. వీరు పని మీద సిద్దిపేట వెళ్లగా.. బుధవారం అర్ధరాత్రి తర్వాత కారులో స్వగ్రామానికి బయల్దేరారు.అయితే అప్పనపల్లి శివారుకు రాగానే.. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. అటుగా వెళ్తున్న వారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు అగ్ని మాపక సిబ్బంది సహాయంతో వారిని వెలికితీసే ప్రయత్నం చేశారు. జేసీబీతో బావిలో నుంచి కారును బయటకు తీయగా.. అప్పటికే నలుగురు మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటంతో వారి కుటుంబంలో, బల్వంతాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.బాలికలను వ్యభిచార కూపంలోకి దించిన కేసులో సంచలన తీర్పుబాలికలను ఉద్యోగాల పేరుతో మోసగించి వ్యభిచార కూపంలోకి దించిన కేసులో సైఫాబాద్ పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 33 మంది నిందితులను దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం ఐదుగురికి జీవిత ఖైదు విదించింది. మరో ముగ్గురికి 14 ఏళ్లు, 14 మందికి పదేళ్లు, 11 మందికి మూడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష ఖరారు చేసింది. బాధితులైన తొమ్మిది మంది బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. సీఐడీ దర్యాప్తులో 38 మంది బాధితులకు విముక్తి లభించింది. ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పు బాలికల అక్రమ రవాణా, లైంగిక దోపిడీకి పాల్పడే నేరస్థులకు కఠిన హెచ్చరికగా నిలుస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) మరో కొత్త ఏసీ ఎలక్ట్రిక్ బస్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రగతినగర్ కమాన్ నుంచి వేవ్‌రాక్ వరకు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఈ సర్వీస్ నడవనుంది. ముఖ్యంగా నగరంలోని నార్త్ ఈస్ట్ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌లోని వేవ్‌రాక్ వైపు ప్రతిరోజూ రాకపోకలు సాగించే ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులకు ఈ సర్వీస్ ఉపయోగపడనుంది.ఈ కొత్త సర్వీసులో 100 శాతం ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వినియోగిస్తున్నారు. దీంతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు పర్యావరణహితమైన ప్రజా రవాణా అందుబాటులోకి రానుంది. ప్రగతినగర్ కమాన్ నుంచి బయలుదేరిన బస్సులు బాచుపల్లి క్రాస్ రోడ్డు, మల్లంపేట, ఓఆర్ఆర్ ఎగ్జిట్-4ఏ, ఎగ్జిట్-1 మీదుగా ప్రయాణిస్తాయి. అనంతరం సైయంట్ సిగ్నల్, ఐసీఐసీఐ సిగ్నల్ మీదుగా వేవ్‌రాక్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం ఉదయం నాలుగు ట్రిప్పులను ఏర్పాటు చేశారు. ప్రగతినగర్ కమాన్ నుంచి ఉదయం 7.45 గంటలకు, 8.15 గంటలకు, 9.15 గంటలకు, 10.15 గంటలకు బస్సులు బయలుదేరనున్నాయి. ఉదయం వేళ ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఈ సర్వీసులు అందుబాటులో ఉండేలా సమయాలను రూపొందించారు.వేవ్‌రాక్ నుంచి తిరుగు ప్రయాణానికి సాయంత్రం మూడు ట్రిప్పులను నడపనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు, 5.15 గంటలకు, 6.45 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. దీంతో ఆఫీస్ అవర్స్ పూర్తయిన తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యం లభించనుంది. ప్రగతినగర్, బాచుపల్లి, మల్లంపేట తదితర ప్రాంతాల్లో నివసిస్తూ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నవారికి ఈ సర్వీస్ ప్రత్యేకంగా ఉపయోగపడనుంది. సాధారణంగా ఈ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు వెళ్లే ప్రయాణికులు వ్యక్తిగత వాహనాలు, క్యాబ్‌లు లేదా పలు మార్గాల్లో మారాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓఆర్ఆర్ మీదుగా నేరుగా సర్వీస్ అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం, మార్గమధ్యంలో వాహనాల మార్పు వంటి ఇబ్బందులు కొంతవరకు

తెలంగాణ పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా శాఖలో మార్పులు చేస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్: మారుతున్న సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ విభాగాలకు చెందిన 513 మంది సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేసినట్లు వెల్లడించారు. బదిలీ అయిన 513 మందిలో 5 మంది సీఐలు, 22 మంది ఎస్ఐలు, 14 మంది ఏఎస్ఐలు ఉన్నారు. వీరితో పాటు 84 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 388 మంది కానిస్టేబుళ్లకు కొత్త బాధ్యతలు అప్పగించినట్లు డీజీపీ తెలిపారు. ఈ బదిలీల్లో భాగంగా అత్యధికంగా 224 మందిని ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు భద్రత విభాగానికి కేటాయించారు. కొత్త బాధ్యతలు చేపట్టే ముందు సిబ్బందిని రెండు నెలల పాటు వివిధ విభాగాల్లో అటాచ్మెంట్ ద్వారా పనిచేయించనున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. సిబ్బంది విద్యార్హతలు, అనుభవం, సామర్థ్యం ఆధారంగా తుది బాధ్యతలను నిర్ణయించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్ నైట్రాజెపామ్ అక్రమ విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో రైలు, రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేలా మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో రైలు, రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేలా మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో నాలుగు రైల్వే బహుళ మార్గాల ప్రాజెక్టులు కాగా, మరొకటి బిహార్‌లో రహదారి ప్రాజెక్టు (Union Cabinet Decisions). కేంద్ర కేబినెట్ ఆమోదించిన నాలుగు రైల్వే ప్రాజెక్టుల మొత్తం వ్యయం సుమారు రూ.9,450 కోట్లు. ఇవి నాలుగు రాష్ట్రాల్లో రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రద్దీని తగ్గించేందుకు ఉద్దేశించినవి. ముఖ్యంగా గూడూరు-గుమ్మిడిపుండి 3, 4వ లైన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.2,229 కోట్లతో గూడూరు-గుమ్మిడిపుండి 3, 4వ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఖరగ్‌పూర్-భద్రక్ 4వ లైన్‌కు రూ.3,352 కోట్లు, భద్రక్-హరిదాస్పూర్ 4వ లైన్‌కు రూ.1,583 కోట్లు, కటక్-పారాదీప్ 3, 4వ లైన్లకు రూ.2,286 కోట్లు కేటాయించారు (Rs.13,041 Crore Projects). ఈ రైల్వే ప్రాజెక్టులు పూర్తయితే సరుకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరగనుంది (NH-22 Bihar Cabinet Approval). మొత్తం మీద సుమారు 1.3 కోట్ల టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల రైళ్ల రాకపోకలు కూడా మరింత సులభతరం కానున్నాయి. అలాగే బిహార్‌లోని ముజఫర్‌పూర్-సీతామర్హి-సోన్బర్సా హైవే నిర్మాణానికి కూడా కాబినెట్ నుంచి ఆమోదం లభించింది. నాలుగు లైన్లతో నిర్మించే ఈ హైవేకు రూ.3,591 కోట్లు కేటాయించారు. ఈ రహదారి బిహార్ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానాన్ని కల్పించడంతో పాటు నేపాల్ సరిహద్దు వైపు రవాణా సౌకర్యాలను బలోపేతం చేయనుంది
తిరుపతి ఘాట్ రోడ్డులో చిరుత పులి తిరుపతి జిల్లా చిట్వేలు - రాపూర్ ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. చిట్వేలు నుంచి పెంచలకోన వైపు వెళ్తున్న ప్రయాణికులు రాత్రి వేళ మూడో మలుపు వద్ద చిరుత సంచరిస్తుండటాన్ని గమనించారు. ప్రస్తుతం పెంచలకోనలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బైక్‌లపై వెళ్లే భక్తులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘాట్ రోడ్డులో వెళ్లేవారు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ప్రయాణించాలని అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారులు హెచ్చరించారు. ఈ వార్తకు సంబంధించిన

ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రసారాల రూపురేఖలను మార్చేసిన ఈఎస్పీఎన్ (ESPN) సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ (93) కన్నుమూశారు. కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, నిన్న తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల ఈఎస్పీఎన్ ప్రస్తుత, మాజీ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన దార్శనికతను స్మరించుకున్నారు.1970వ దశకం చివర్లో తన కుమారుడు స్కాట్‌తో కలిసి 24 గంటల పాటు కేవలం క్రీడల కోసమే ఒక కేబుల్ నెట్వర్క్ ఉండాలనే ఆలోచనకు బిల్ రాస్ముసెన్ బీజం వేశారు. ఈ ఆలోచన ఫలితంగా 1979 సెప్టెంబర్ 7న ఈఎస్పీఎన్ ప్రారంభమైంది. మొదట్లో ఈ కాన్సెప్ట్‌పై ఎన్నో సందేహాలు వ్యక్తమైనా, అనతికాలంలోనే ఇది మీడియాలో ఒక సంచలనంగా మారింది. రాస్ముసెన్ ఈఎస్పీఎన్ మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు.ఈఎస్పీఎన్ ఛైర్మన్ జిమ్మీ పిటారో నివాళులర్పిస్తూ.. "రాస్ముసెన్ ఒక అసాధారణ వ్యక్తి, గొప్ప దార్శనికుడు, ఆవిష్కర్త. క్రీడలకే అంకితమైన నెట్వర్క్ ఆలోచన ఆయనదే" అని కొనియాడారు. 1970లలో ఆయన చూపిన స్ఫూర్తి, అభిరుచి ఇప్పటికీ తమ సంస్థ సంస్కృతిలో భాగమేనని తెలిపారు. ప్రముఖ యాంకర్ క్రిస్ బెర్మన్ స్పందిస్తూ.. "ఆయన మా జార్జ్ వాషింగ్టన్, ఒక మంచి స్నేహితుడు" అని అభివర్ణించారు.క్రీడా ప్రసార రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ 2025లో స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, ఏడుగురు మనవళ్లు, ఇద్దరు మునిమనవళ్లు ఉన్నారు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. TGSRTC Changes Bus Routes: కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ ఫ్లైఓవర్ అండర్‌పాస్‌లను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ నియంత్రించడానికి ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఈ మార్గాల్లో కాకుండా ఇతర మార్గాల్లో మళ్లింపులు చేపట్టారు. కీలకమైన ప్రాంతాల్లో సైన్ బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు మైక్ ద్వారా కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నిన్న ఈ వన్-వే విధానం గురించి తెలియక చాలా మంది వాహనదారులు తమ ఆఫీసులకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడ్డారు. అందుకే ఈరోజు నుంచి వాహనదారులు ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మళ్లింపులు చేపట్టడమే కాకుండా బస్సు రూట్లను కూడా మార్చారు. కాబట్టి జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 45 వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తమ రూట్లను ముందుగానే గుర్తించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ బస్సు మార్గాల్లో కీలక మార్పులు చేస్తూ, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ పరిసరాల్లోని బస్టాపులను కూడా మార్చింది. బస్ నంబర్ 47L రూట్.. సికింద్రాబాద్ లేదా జూబ్లీ బస్ స్టాండ్ నుండి మణికొండకు వెళ్లే ఈ 47L బస్సు.. సికింద్రాబాద్ నుంచి బేగంపేట్, నాగార్జున సర్కిల్, ఎల్వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా, అపోలో హాస్పిటల్, ఫిల్మ్ నగర్, దర్గా, మణికొండకు చేరుతుంది. తిరిగి వచ్చే సమయంలో మణికొండ నుంచి పంచవటి కాలనీ, దర్గా, ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్

చుంచుపల్లి, ఆగస్టు 18 : చుంచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 108 అత్యవసర వైద్యం సేవల సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు. చుంచుపల్లి నివాసి అజ్మీర మోహన్ (38) సోమవారం రాత్రి ఇంటికి వెళ్తుండగా పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించగా, ఈఎంటీ స్రవంతి, పైలట్ సాంబశివరావు వేగంగా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. రక్తస్రావాన్ని అదుపు చేసి మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమయానికి స్పందించి బాధితుడి ప్రాణాపాయం తప్పించిన 108 సిబ్బంది సేవలను స్థానికులు, కుటుంబ సభ్యులు ప్రశంసించారు

విశాఖపట్నంలోని షీలా నగర్లో రెండు మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్-సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనుల్లో భాగంగా రెండు గుర్తుతెలియని డెడ్‌బాడీస్ లభించాయి. విశాఖపట్నం, ఆగస్టు 18: నగరంలోని షీలా నగర్లో రెండు మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్-సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనుల్లో భాగంగా రెండు గుర్తుతెలియని డెడ్‌బాడీస్ లభించాయి. ఈరోజు(మంగళవారం) డంపర్ లారీలు మట్టి వేస్తుండగా కుప్పలో 2 శవాలు కనిపించాయి. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడకు చేరుకుని ఘటనా స్థలిని పరిశీలించారు. ఒకటి మహిళ మృతదేహం కాగా మరొకటి పురుషుడి మృతదేహంగా గుర్తించారు. రెండు మృతదేహాలూ పూర్తిగా డికంపోజ్ అయినట్లు తెలిపారు. అంతేకాకుండా.. మట్టిలో పాత తలగడలు, బొంతలు, పూలమాలలు, చెక్కలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు పనుల్లో భాగంగా ఉపయోగించిన మట్టి.. శ్మశానం నుంచి తీసుకొచ్చినట్లుగా అనుమానిస్తున్నామని ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చెడిపోయిన ప్రతి మొక్కకు వెయ్యి సాయం.. కొత్త మొక్కలు పెట్టిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

Road Accident : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భింద్ జిల్లాలో కూలీలతో వెళ్తున్న ట్రాలీ వాహనం, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందగా.. మరో 32 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ గోహద్‌లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం గ్వాలియర్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్భేరీకి చెందిన కూలీలు గ్వాలియర్‌లో వరినాట్లు పూర్తి చేసుకొని సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత తమ గ్రామానికి ట్రాలీ వాహనంలో బయలుదేరి వెళ్తున్నారు. భింద్-గ్వాలియర్ జాతీయ రహదారిపై ఛిమ్కా గ్రామం సమీపంలో రహదారిపైకి వచ్చిన పశువులను తప్పించబోయి డ్రైవర్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మరో ముగ్గురు మరణించారు

కేబీఆర్ పార్క్ చుట్టూ నేటినుంచి అమల్లోకి సర్వం సిద్ధం చేసిన ట్రాఫిక్ పోలీసులు 13 చోట్ల ఎగ్జిట్ పాయింట్లు అదనంగా 35 సీసీ కెమెరాల ఏర్పాటు పాదచారుల కోసం ‘సిటిజన్ పెవిలియన్లు’.. ప్రత్యేక జీబ్రా క్రాసింగ్స్ నాలుగు షిఫ్టుల్లో సిబ్బంది పహారా.. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ హైదరాబాద్: అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ నేటినుంచి ‘వన్ వే’ అమలు కానుంది. ఈ మేరకు పోలీస్ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ట్రాఫిక్ కష్టాలకు చరమగీతం పాడేలా అమలు చేయనున్న వన్‌వే ప్రయాణతీరుపై వాహన చోదకులకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే రోడ్డులో ఎగ్జిట్ పాయింట్స్, లైన్ చేంజింగ్ పై అవగాహన ఉంటే సాఫీగా ప్రయాణం చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. గతంలో నిర్వహించిన ట్రయల్ రన్‌ను పరిగణలోకి తీసుకొని సమస్యలను అధిగమించేలా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. లేన్ 1.. 2 రోడ్ల వర్గీకరణ హెచ్-సిటీ ప్రణాళికలో భాగంగా వాహనాలు ఎక్కడా నిలవకుండా సాఫీగా సాగేందుకు రహదారులను రెండు ప్రధాన విభాగాలుగా విభజించారు. లేన్-1 : దూరం వెళ్లే వాహనాలు, నాన్-స్టా్పగా ప్రయాణించే వారి కోసం ప్రత్యేకించారు. లేన్- 2: కాలనీలు, ఉప రహదారుల్లోకి వెళ్లే వారి కోసం నిర్దేశించారు. పది ప్రాంతాల్లో లేన్ చేంజింగ్‌కు అవకాశం కల్పించారు. 13చోట్ల ఎగ్జిట్ పాయింట్లు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు త్వరగా వెళ్లేందుకు వీలుగా కేబీఆర్ చుట్టూ 13చోట్ల ఎగ్జిట్ పాయింట్లను శాస్త్రీయంగా తీర్చిదిద్దారు. కేబీఆర్ పార్కుకు నిత్యం వేలాది మంది వాకర్లు, పర్యాటకులు వస్తుంటారు. వీరికి ఇబ్బందులు రాకుండా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రోడ్డు దాటాలనుకునే పాదచారులు సురక్షితంగా వేచి ఉండేందుకు పలు కీలక కూడళ్లలో అత్యాధునిక ‘సిటిజన్ పెవిలియన్స్’ నిర్మించారు. అవకాశమున్న చోట్ల స్పష్టమైన జీబ్రాక్రాసింగ్స్, ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు బ్లింకర్లు, రేడియం సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అదనంగా 35 సీసీ కెమెరాలు కేబీఆర్
.webp)
జగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలోని కొండగట్టు ఘాట్ రోడ్డు సమీపంలో ఒక దిగ్భ్రాంతికర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న లారీ ఒకదానినొకటి అతి వేగంతో ఢీకొనడంతో ఈ భయానక ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 20 మంది ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు. కరీంనగర్ డిపోకు చెందిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు ప్రయాణికులతో నిజామాబాద్ వైపు వెళ్తుండగా కొండగట్టు ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఊహించని విధంగా లారీ అతివేగంగా వచ్చి బస్సును ముఖాముఖీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. ఘటన జరిగిన వెంటనే బస్సులోని ప్రయాణికులు భయాందోళనతో ఆర్తనాదాలు చేశారు. ఈ ప్రమాద తీవ్రత కారణంగా పలువురు ప్రయాణికులకు కాళ్లు, చేతులు విరగడంతో పాటు శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్లో పలువురు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాద తీవ్రతకు లారీ ముందు భాగం తీవ్రంగా నుజ్జునుజ్జయ్యి, డ్రైవర్ క్యాబిన్ లోపల ఇరుక్కుపోయాడు. స్థానికులు, ఇతర వాహనదారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎంతో శ్రమించి అతడిని బయటకు తీసుకువచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రవాణా చేశాయి. కొండగట్టు సమీపంలో ఈ ఘోర ఘటన జరగడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో కొద్దిసేపు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాకపోకలను పునరుద్ధరించారు. కొండగట్టు మార్గంలో ఇదివరకు కూడా అనేకసార్లు ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో, ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో తరచూ మలుపులు, వేగ పరిమితి దాటడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బాధితులకు

ఒక్క క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. విధుల్లో భాగంగా వర్క్‌షాప్‌లో ఉన్న MSRTC ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్.. బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి.. ఇంటర్నెట్ డెస్క్: చిన్న క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ బస్‌స్టాండ్ సమీపంలోని మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) వర్క్‌షాప్‌లో బస్సు చక్రం కింద పడి ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్ మృతి చెందారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆరోగ్య సమస్యల కారణంగా చవాన్‌కు వర్క్‌షాప్ విధులు కేటాయించినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. చవాన్ ర్యాంప్ సమీపంలో తన పని ముగించుకుని తిరిగి వస్తుండగా, మరో డ్రైవర్ సికందర్ మనేర్ మరమ్మతుల కోసం బస్సును ముందుకు నడిపించాడు. బస్సు ర్యాంప్‌పై వెళ్తున్న సమయంలో చవాన్ దాని ముందు చక్రం కింద పడిపోయారు. బస్సు చక్రం ఆయనపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. తోటి ఉద్యోగులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును ఆపాడు. సమాచారం అందుకున్న షాహుపురి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ప్రమాదం మొత్తం రికార్డయింది. పోలీసులు ఫుటేజీని స్వాధీనం చేసుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. బస్సును చూసుకోకుండా సడన్‌గా కదిలించారని చవాన్ సహోద్యోగులు ఆరోపించారు. నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేల తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్ ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు తన కుటుంబం సహా గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతు కాగా, ఒక బాలుడిని స్థానికులు రక్షించారు.వివరాల్లోకి వెళితే.. పిఠాపురంలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34), మనవడు కలిసి నిన్న అర్ధరాత్రి రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకారు. ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించి, నీటిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడారు. అయితే, నూకరాజు, మీనా, సౌజన్య నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న నూకరాజు, కుటుంబంతో కలిసి ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు గోదావరిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు

హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్. నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలను అమల్లోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ ఫ్లైఓవర్, బహుళ అంతస్తుల నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సులభంగా ట్రాఫిక్ కొనసాగడం, పనులు వేగవంతంగా పూర్తి కావడం కోసం అధ్యయనాలు, ట్రయల్స్ కోసం ఈ ఆంక్షలను అమలు చేయనున్నట్లు చెప్పారు. వాహనదారాలు, ప్రజలు దీనిని గమనించి సహకరించాలని కోరారు. అయితే ఇంతకముందే కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే విధానంపై ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రాఫిక్ సరళిని పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలు, వాకర్స్, నివాసి సంక్షేమ సంఘాలతో సంప్రదింపులు జరిపారు. అనంతరం సమగ్రంగా అధ్యయనం చేయడం, రెండు విడతలుగా ట్రయల్ రన్, జీహెచ్ఎంసీ సమన్వయం తర్వాత ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండటంతో పాటు పనులు వేగవంతంగా పూర్తయ్యేలా వీలు కల్పించేందుకు ఈ తాత్కాలిక ఆంక్షలను విధించినట్లు చెప్పారు. బహుళ అంతస్తుల నిర్మాణాలు పూర్తయిన తర్వాత కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం, రోడ్ నెం 45, ఫిల్మ్ నగర్, మహారాజా అగర్సేన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సిగ్నల్స్ వద్ద రద్దీని తగ్గించి సిగ్నల్ ఫ్రీ జర్నీని ప్రవేశపెడతారు. దీని వల్ల జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ట్రాఫిక్ భారీగా తగ్గుతుంది. కొత్త ఫ్లైఓవర్ల రాకతో ఐటీ కారిడార్‌కు ప్రయాణ సమయం తగ్గనుండగా.. వాహనదారులు సిగ్నల్స్ వద్ద వేచి ఉండే పని ఉండదు. దీని వల్ల కేబీఆర్ పార్క్ వద్ద పొల్యూషన్ కూడా తగ్గే అవకాశముంటుందని చెబుతున్నారు. నిర్మాణ పనుల వల్ల మొదట్లో వాహనదారులకు కాస్త ఇబ్బంది కలిగినప్పటీ.. పూర్తైన తర్వాత ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా హెచ్ఎండీఏ చర్యలు

Parkal: పరకాలలో రూ. వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు! పరకాల: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొత్తగా చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 🔹రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 🔹రూ. 82 కోట్లతో పరకాల మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు 🔹రూ. 65 కోట్లతో పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం 🔹రూ. 45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణం 🔹రూ. 32.17 కోట్ల అంచనా వ్యయంతో దామెర మండలం ల్యాదేళ్లలో పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ నిర్మాణం 🔹రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో అక్కంపేట గ్రామంలో అభివృద్ధి ప్రణాళిక పనులు 🔹రూ. 5 కోట్లతో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులు 🔹ఆత్మకూర్‌లో టౌన్షిప్ అండర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌కు శంకుస్థాపన 🔹రూ. 3 కోట్లతో పరకాల పట్టణంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన 🔹రూ. 1.10 కోట్లతో విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ నిర్మాణం 🔹పరకాలలో రూ. 35 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభం. 🔹ఆత్మకూర్‌లో రూ. 1 కోటితో నిర్మించిన అధునాతన SPM సెంటర్ ప్రారంభం. 🔹పరకాలలో రూ. 5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం ప్రారంభం

బెంగళూరు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఐటీ ప్రాజెక్టులు, ట్రాఫిక్ సమస్యలు, అంతకుమించి ప్రాణాలను పిండేసే గుంతల రోడ్లు. రోజూ ప్రయాణంలో వాహనాలు దెబ్బతిని, గుంతల్లో పడి నడుములు విరగ్గొట్టుకునే పరిస్థితులపై మనలో చాలామంది శాపనార్థాలు పెట్టి ఊరుకుంటారు. కానీ, బెంగళూరుకు చెందిన ఒక యువ ఇంజనీర్ మాత్రం ఆ కోపానికే కొత్త రూపాన్ని ఇచ్చాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తూ.. రోడ్డుపై ఉన్న గుంతలను గుర్తించి, సంబంధిత కాంట్రాక్టర్‌పై నేరుగా ఫిర్యాదు నమోదు చేసే అత్యంత శక్తివంతమైన యాప్‌ను రూపొందించి సంచలనం సృష్టించాడు.తన కారు గుంతల్లో పడి తరచూ పాడైపోతుండటంతో విసిగిపోయిన ఈ ఇంజనీర్, అత్యాధునిక కోడెక్స్ ప్రాసెస్ సాయంతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశాడు. దీనికోసం తన కారుకు జీపీఎస్ , యాక్సిలెరోమీటర్ సౌకర్యం ఉన్న ఒక డ్యాష్ క్యామ్‌ను అమర్చాడు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కారు కదిలే తీరు, రోడ్డుపై ఉండే దృశ్యాలను ఈ కెమెరా నిరంతరం రికార్డ్ చేస్తుంది. ఇందులో అమర్చిన విజన్ మోడల్ సాంకేతికత రోడ్డుపై ఉండే ప్రతి గుంతను విశ్లేషించి.. అది చిన్నదా, మధ్యస్థమైనదా లేక ప్రాణాంతకమైన పెద్ద గుంతనా అనే విషయాన్ని క్షణాల్లో వర్గీకరిస్తుంది. గుంతలు పూడ్చడానికే డబ్బులు లేవుగా- మెడికల్ కాలేజీ అంటే నమ్మాలా?- అయ్యన్నక్యాచింగ్ పాయింట్.. 2,900 ప్రభుత్వ కాంట్రాక్టుల డేటా రీడింగ్!ఈ యాప్‌లో అసలైన మాస్టర్ ప్లాన్ ఇక్కడే ఉంది! భారతదేశంలో చాలా వరకు ప్రధాన రహదారులకు కాంట్రాక్టర్ల ఫ్రీ మెయింటైనెన్స్ గ్యారంటీ ఉంటుంది. నిబంధనల ప్రకారం రోడ్డు పాడైతే ఆ కాంట్రాక్టరే ఉచితంగా బాగు చేయాలి. దీనికోసం సదరు ఇంజనీర్ రూపొందించిన యాప్, దాదాపు 2,900 ప్రభుత్వ టెండర్ కాంట్రాక్ట్ పత్రాలను క్షుణ్ణంగా శోధిస్తుంది. గుంతలున్న నిర్దిష్ట రహదారి టెండర్ నంబర్ ఏమిటి? ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ఎవరు? బాధ్యత వహించాల్సిన ప్రభుత్వ అధికారి ఎవరు? అనే వివరాలను చిటికెలో లాగేస్తుంది.కర్నాటక సర్కార్ కు బెంగళూరు వాసుల హెచ్చరిక..!

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఏటీఎంను లూటీ చేయడానికి దుండగులు విఫల యత్నం చేశారు. మియాపూర్ ఎక్స్ రోడ్డులోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంను టార్గెట్ చేసిన ముగ్గురు వ్యక్తుల ముఠా, రాడ్లు మరియు రాళ్లతో యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు యత్నించింది. కానీ వారు ఎంత ప్రయత్నించినా క్యాష్ బాక్స్ ఓపెన్ కాలేదు. వారి ప్రయత్నం బెడిసికొట్టడంతో చేసేది లేక దొంగలు అక్కడ ఉన్న బ్యాకప్ బ్యాటరీలను ఎత్తుకొని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున ఏటీఎం వద్దకు చేరుకున్న నిందితులు పక్కా ప్లాన్‌తో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఒకరు బయట కాపలాగా ఉండగా, మరో ఇద్దరు లోపలికి వెళ్లి ఇనుప రాడ్లతో ఏటీఎంను పగులగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు, సీసీటీవీ పుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు సంజీవ్ జాదవ్, రాపాక సూర్య ప్రకాశ్ రావులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు వాదిత్య కార్తిక్ పరారీలో ఉన్నాడు. సులభంగా డబ్బు కొట్టేయాలనే దుర్బుద్ధితోనే వీరు ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి ఒక ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఏటీఎంల భద్రత పట్ల బ్యాంకులు మరింత అప్రమత్తంగా ఉండాలని, తగిన వెలుతురుతో పాటు అలారం వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు! మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్! ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? అయితే ఈ డేంజర్ బెల్స్ మోగినట్టే! వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు.. ఈ