
Stuart Broad Vs Salman Butt Controversy Pakistan Vs England Test Series 1892992
Eng Vs Pak: ఇంగ్లాండ్, పాకిస్థాన్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే వాతావరణం వేడెక్కింది. ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై తీవ్రమైన విమర్శలు చేశాడు. “పాకిస్థాన్ పరమచెత్త జట్టు.
Eng Vs Pak: ఇంగ్లాండ్, పాకిస్థాన్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే వాతావరణం వేడెక్కింది. ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై తీవ్రమైన విమర్శలు చేశాడు. “పాకిస్థాన్ పరమచెత్త జట్టు. వారిలో ఏమాత్రం టాలెంట్ లేదు. ఇంగ్లాండ్ ఈ సిరీస్‌ను 3-0 తేడాతో చాలా తేలికగా గెలుచుకుంటుంది” అంటూ వ్యాఖ్యానించాడు. లీడ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ కేవలం 171 పరుగులకే ఆలౌట్ కావడంతో బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియా పై సల్మాన్ భట్ ప్రశ్నాస్త్రాలు
స్టువర్ట్ బ్రాడ్ చేసిన విమర్శలపై సల్మాన్ భట్ ఘాటుగా స్పందించాడు. తమ జట్టు ప్రస్తుతం మంచి క్రికెట్ ఆడటం లేదనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నానని, అలా అని చెత్త జట్టు అని సంబోధించడం సరైంది కాదని మండిపడ్డాడు. ఇంగ్లాండ్ జట్టు గొప్పలు చెప్పుకోవడం ఆపి తమ సొంత రికార్డులను చూసుకోవాలని సూచించాడు. “మీరు ఆస్ట్రేలియా వెళ్లిన ప్రతిసారీ 0-5 తేడాతో ఘోరంగా ఓడిపోయి వస్తారు. గత 16 ఏళ్లుగా ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేకపోయింది. కేవలం ఒక్కటంటే ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే గెలిచింది” అంటూ ఇంగ్లాండ్ వైఫల్యాలను ఎండగట్టాడు.
ఇది కూడా చదవండి: Test Record: సచిన్ 200 మ్యాచ్‌ల ప్రపంచ రికార్డ్ అవుట్.. 167వ టెస్టులోనే సంచలనం సృష్టించిన ఇంగ్లాండ్ బ్యాటర్
ఒకప్పుడు పాకిస్థాన్ బౌలింగ్ విభాగం అత్యంత బలంగా ఉండేదని సల్మాన్ భట్ గుర్తు చేశాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ జట్టులో 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సాధారణ బౌలర్లు ఉన్నారని, అప్పట్లో ఎవరూ ఇంగ్లాండ్‌ను చెత్త జట్టు అని అనలేదని పేర్కొన్నాడు. తమ జట్టు బలహీనంగా ఉన్న మాట వాస్తవమేనని, ఒకవేళ ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్ గెలవకపోతే అది వారి కొంపముంచే పెద్ద పరాభవంగా మారుతుందని వ్యాఖ్యానించాడు. సల్మాన్ భట్ అన్నట్లుగానే గత నాలుగు ఆస్ట్రేలియా పర్యటనల్లో ఇంగ్లాండ్ దారుణమైన ప్రదర్శనతో వైఫల్యం చెందింది.
ఇది కూడా చదవండి: Cricket Records: 39 మ్యాచులు, 12 సెంచరీలు, 2541 పరుగులు.. 25 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు
ఇరు దేశాల మాజీ ఆటగాళ్ల మధ్య జరుగుతున్న ఈ మాటల పోరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. లీడ్స్ టెస్టులో ఇంగ్లాండ్ పైచేయి సాధించినప్పటికీ, సల్మాన్ భట్ ఇచ్చిన ఘాటు రీకౌంటర్ ఇంగ్లాండ్ అభిమానులకు మింగుడుపడటం లేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..






