
Komatireddy Venkat Reddy Directs Officials To Speed Up Crif Roads Setu Bandhan In Telangana Vvnp 1551836
తెలంగాణలో సీఆర్ఐఎఫ్ రోడ్లు, సేతుబంధన్, రైలు ఓవర్ బ్రిడ్జ్ పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు.
తెలంగాణలో సీఆర్ఐఎఫ్ రోడ్లు, సేతుబంధన్, రైలు ఓవర్ బ్రిడ్జ్ పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్రంలో సీఆర్ఐఎఫ్ (CRIF) రోడ్లు, సేతుబంధన్, రైలు ఓవర్ బ్రిడ్జ్ (ROB) పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా పనుల పురోగతి మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 3,918 కి.మీ రోడ్లకు రూ.5,159 కోట్లతో 316 పనులు మంజూరు అయ్యాయని వివరించారు.
2025-26లో రూ.868 కోట్లతో 422.36 కి.మీ రోడ్ల పనులు చేపట్టామని తెలిపారు. హై లెవెల్ బ్రిడ్జిలు, ROB పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మిర్యాలగూడ, నంది పహాడ్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. నార్కట్పల్లి బ్రిడ్జి పనుల పురోగతిపై ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో మరింత కష్టపడి పని చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
2026, డిసెంబర్ నాటికి సచివాలయంలో సోలార్ కార్ పార్కింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో సోలార్ కార్ పార్కింగ్ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. సోలార్ పార్కింగ్తో సచివాలయానికి 90 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వివరించారు. దీంతో నెల వారీ విద్యుత్ బిల్లులో 16 శాతం ఆదా అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల
దూసుకొచ్చిన కొండచిలువ.. పర్యాటకులకు షాక్.. వీడియో వైరల్
Read More Latest Telangana News And Telugu News
