
Aug 21 2026 11:48 AM | Updated on Aug 21 2026 11:53 AM
బల్వంతపూర్‌కు చెందిన రాజు(35), భాగ్య(22) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం అర్ధరాత్రి కారులో ప్రయాణిస్తూ ప్రమాదావశాత్తు బావిలో పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయంపై మృతుడు రాజు అన్న రవి బాధపడిన తీరు అక్కడి స్థానికులను కలిచివేసింది. ఈ హృదయ విధారక ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.
వద్దు తమ్మి.. పొద్దున్నే పోదువు ‘సిద్దిపేటలో మా బావ దీశెట్టి మల్లేశం మృతి చెందాడు. 19న దశదిన కర్మ కావడంతో తమ్ముడు రాజు తన భార్య పిల్లలతో సిద్దిపేటకు వచ్చారు. అందరం కలిసి సంతోషంగా భోజనం చేశా’మని మృతుడు రాజు అన్న రవి తెలిపారు. సాయంత్రం కావడంతో ‘అన్నా.. ఇంటికి వెళ్తాం’ అని రాజు చెప్పడంతో.. ‘చీకటి అవుతుంది. వద్దు తమ్మి.. పొద్దున పోదువు’ అని చెప్పా. ‘అన్నా నీకాళ్లు మొక్కుతా’ అంటూ.. వినకుండా తన భార్య పిల్లలతో కారులో బయల్దేరారు. అంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుందంటూ రోదిస్తూ రవి వెల్లడించారు.
‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?
నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
హైదరాబాద్ : హైటెక్స్‌లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు)
స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)
భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్!
ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..?
ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ



