
Maharashtra Kolhapur Msrtc Employee Passed Away After Being Run Over By Bus At Workshop Cctv Footage Erk 1550532
ఒక్క క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. విధుల్లో భాగంగా వర్క్‌షాప్‌లో ఉన్న MSRTC ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్.. బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు.
ఒక్క క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. విధుల్లో భాగంగా వర్క్‌షాప్‌లో ఉన్న MSRTC ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్.. బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి..
ఇంటర్నెట్ డెస్క్: చిన్న క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ బస్‌స్టాండ్ సమీపంలోని మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) వర్క్‌షాప్‌లో బస్సు చక్రం కింద పడి ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్ మృతి చెందారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆరోగ్య సమస్యల కారణంగా చవాన్‌కు వర్క్‌షాప్ విధులు కేటాయించినట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం.. చవాన్ ర్యాంప్ సమీపంలో తన పని ముగించుకుని తిరిగి వస్తుండగా, మరో డ్రైవర్ సికందర్ మనేర్ మరమ్మతుల కోసం బస్సును ముందుకు నడిపించాడు. బస్సు ర్యాంప్‌పై వెళ్తున్న సమయంలో చవాన్ దాని ముందు చక్రం కింద పడిపోయారు. బస్సు చక్రం ఆయనపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. తోటి ఉద్యోగులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును ఆపాడు. సమాచారం అందుకున్న షాహుపురి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ప్రమాదం మొత్తం రికార్డయింది. పోలీసులు ఫుటేజీని స్వాధీనం చేసుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. బస్సును చూసుకోకుండా సడన్‌గా కదిలించారని చవాన్ సహోద్యోగులు ఆరోపించారు. నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
నేల తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్
ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..





