
భూసేకరణప్రక్రియను వేగవంతం చేయాలి - జేసీ సేధు మాధవన్
Vizianagaram: భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి - జేసీ సేధు మాధవన్ ఈ వార్తకు సంబంధించిన

Vizianagaram: భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి - జేసీ సేధు మాధవన్ ఈ వార్తకు సంబంధించిన

'ఇరుముడి' హిట్ కొట్టిన రవితేజ మంచి జోష్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఇతడి ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నాడు. రవితేజ తమ్ముడు రఘ కొడుకు మాధవ్ ప్రధాన పాత్ర చేసిన 'మారెమ్మ' విడుదలకు సిద్ధమైంది. వచ్చే శుక్రవారం(సెప్టెంబరు 10) ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు. ఇది ఆకట్టుకునేలా ఉంది. (ఇదీ చదవండి: 'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని: అల్లు అర్జున్) గతంలో 'లవ్ యూ ఇడియట్' అనే మూవీలో మాధవ్ హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఇదొచ్చిందా లేదా అనే సంగతి జనాలకు పెద్దగా తెలీదు. తర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే 'మారెమ్మ' ఒప్పుకొన్నాడు. ఏడాది క్రితం దీని గురించి ప్రకటన వచ్చింది. కొన్నిరోజుల క్రితం మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేశారు. మారెమ్మ అనే గ్రామ దేవత, ఈ దేవి కోసం పెంచే ఓ దున్నపోతు. దాన్ని కాపాలా కాసే ఓ కాపరి. ఊరిలో జరిగే కొన్ని అరిష్టాలు. ఇలా ట్రైలర్ సాగింది. తెలంగాణలోని ఓ పల్లె నేపథ్యంగా మూవీ ఉండనుంది. ఇందులో మాధవ్ సరసన దీపా బాలు హీరోయిన్గా చేసింది. మంచాల నాగరాజు దర్శకుడు. ఈ సినిమాతోనైనా మాధవ్ హీరోగా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి? (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు) యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు) ‘ఐ యామ్ గేమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా నాగ్ అశ్విన్ (ఫొటోలు) పోలీసులు ఆపుదాం అని చూసారు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి వాళ్లకు నీళ్లు.. మాకు కన్నీళ్లా..? బాబుకు శిల్ప చక్రపాణి వార్నింగ్ బాబు సభ కోసం బెదిరింపులు.. బయటపడ్డ ఆడియో లీక్ 'రోడ్డు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఈ సమావేశానికి ముందు వందేమాతరం గీతంలోని ఆరు చరణాలనూ నేతలంతా ఆలపించారు. అనంతరం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై చర్చ ప్రారంభమైంది. ప్రజా జీవితంలో ప్రధాని మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ కార్యాచరణపైనా చర్చ జరగనుంది. అక్టోబర్ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం వరకు సాగిన ప్రయాణాన్ని ప్రజలకు వివరించడంపై చర్చించనున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. మరోవైపు, నితిన్ నబీన్ కొత్త టీమ్‌లో అనుభవం, యువ నాయకత్వం, ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా ప్రాతినిధ్యం కల్పించారు. దీంతో స్మృతి ఇరానీ, రామ్ మాధవ్, బిప్లబ్ దేవ్, సునీల్ బన్సల్ తదితరులకు కీలక బాధ్యతలు దక్కాయి. నా భర్త ఏడుస్తున్నారు.. ఆయనను విడిపించండి..: కెప్టెన్ అజయ్ పంత్ భార్య ఆవేదన.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు రూ.5 కోట్లు తిరిగి ఇచ్చేయండి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

బిగ్ బాస్ షోకి ముందు జరిగే బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లో 8వ ఎపిసోడ్ రణరంగాన్ని తలపించింది. 15 మంది కంటెస్టెంట్స్ మధ్య అసలైన పోటీ షురూ అయింది. కంటెస్టెంట్స్ మధ్య ఫిట్టింగ్ పెట్టడానికి బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్, విన్నర్ ఎంట్రీ ఇచ్చారు. నవదీప్ రాగానే ఒక బ్రీఫ్ కేస్ తో ఎంట్రీ ఇచ్చారు. ఆ బ్రీఫ్ కేస్ లో ఫైర్ కార్డులు ఉంటాయి. అవి గెలుచుకున్న వారికి అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయి అని నవదీప్ ఆఫర్ ఇచ్చారు. ఈ గేమ్ అందించడానికి ముందుగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ ప్రియా ఎంట్రీ ఇచ్చింది. ఆమె రాగానే కంటెస్టెంట్స్ కి ఫిట్టింగ్ పెట్టింది. ఇక్కడ ఉండడానికి అర్హత లేని కంటెస్టెంట్ ఎవరు అంటూ రాజా కుమారిని అడిగింది. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా అపూర్వ అని సమాధానం ఇచ్చింది. ఆమె వెనుకబడ్డ ప్రతి సారీ రీజన్స్ వెతుక్కుంటూ ఉంటుంది అని అందుకే ఆమె డిజర్వ్ కాదు అని పేర్కొంది. మొదటి పవర్ కార్డు పోటీదారులుగా రాజా కుమారి, చరణ్, అపూర్వ లని ఎంచుకున్నారు. ముగురుకి మూడు బోర్డులు మీద నంబర్స్ ఉంటాయి. కింద రెండు బెలూన్స్ కి గాలి నింపడానికి పంప్ సెట్ చేసి ఉంటారు. పోటీదారులు ఒక నంబర్ ని ఎంచుకుని అన్నిసార్లు బెలూన్ కి గాలి పంప్ చేయాలి. నంబర్ 10 ఎంచుకుంటే 10 సార్లు చేయాలి. అలా బోర్డు మీద నంబర్స్ అన్నీ అయిపోయే వరకు చేస్తూ ఉండాలి. ఎవరు గాలి పంప్ చేస్తున్నప్పుడు బెలూన్ పగిలిపోతుందో వాళ్ళు అవుట్ అవుతారు. ఈ గేమ్ లో ముందుగా అపూర్వ అవుట్ అయింది. ఆ తర్వాత చరణ్ కూడా అవుట్ కావడంతో చివరికి రాజా కుమారి విజేతగా నిలిచారు. మొదటి ఫైర్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో ఏడవ ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది. చివరి ఎపిసోడ్ లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయని ఇద్దరు కంటెండర్స్ ని జ్యూరీ సభ్యులు స్టేజీపైకి పిలిచారు. వాళ్లిద్దరూ ఎవరో కాదు ఉటా అండ్ అపూర్వ. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరూ ఒక్కో కార్డుని ఎంచుకోవాలి. ఎవరి కార్డులో ఎగ్జిట్ అని ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఆ దురదృష్టం ఉటాకే తగిలింది. ఉటా ఎంచుకున్న కార్డులో ఎగ్జిట్ అని ఉంది. అపూర్వ ఎంచుకున్న కార్డులో స్టే అని ఉంది. దీనితో అపూర్వ సేవ్ అయింది. ఉటా మాత్రం ఎలిమినేట్ అయ్యారు. ఎక్కడో జపాన్ నుంచి వచ్చి తెలుగు నేర్చుకుని ఇంత కష్టపడిన ఉటాని జ్యూరీ సభ్యులు అభిజీత్, బిందు మాధవి, నవదీప్ అభినందించి వీడ్కోలు పలికారు. ఆ తర్వాత డేర్ ఆర్ డై లో భాగంగా వరుసగా టాస్కులు మొదలయ్యాయి. ముందుగా అత్యంత ఘాటైన ఘోస్ట్ పెప్పర్ చిల్లీతో టాస్క్ మొదలైంది. ఆ చిల్లీ భరించలేని కారంతో ఉంటుంది. ఈ టాస్క్ లో దీపక్, అమన్, సుమ, లయ పాల్గొన్నారు. వీళ్ళు ముందుగా ఘోస్ట్ పెప్పర్ చిల్లీ తిని ఆ తర్వాత బెలూన్స్ ఊది పగలగొట్టాలి. కారాన్ని భరిస్తూ ఇది చేయాలి. ఈ టాస్క్ లో దీపక్ విజయం సాధించారు. అమన్ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టాడు. నెక్స్ట్ టాస్క్ లో అబ్బాయిలు పియర్సింగ్ చేయించుకోవాలి. చెవి, ముక్కు, ఐబ్రోస్ లలో రెండు భాగాలు ఎంచుకుని పియర్సింగ్ చేయించుకోవాలి. ఈ టాస్క్ లో రోహిత్, హేమంత్ పాల్గొన్నారు. వీళ్ళిద్దరూ ముక్కు కుట్టించుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఎవరైతే ముక్కుకి ఓకె అని అంటారో వాళ్ళని విన్ చేద్దాం అని అనుకున్నా అంటూ బిందు మాధవి పేర్కొంది. దీనితో హేమంత్ వెంటనే నాకు ఓకె అని చెప్పాడు. రోహిత్ మాత్రం అంగీకరించలేదు. రోహిత్ ఆసక్తి చూపించకపోవడం అభిజీత్ కి
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్‌లోని ఆరో ఎపిసోడ్లో డేర్ ఆర్ డై అని టాస్కుల్ని పెట్టారు. ఈ టాస్కుల్లో గెలిచిన వారిని టాప్ 15లోకి పంపించారు. అలా నేటి ఎపిసోడ్ ద్వారా నలుగురు కంటెస్టెంట్లు తమ బెర్తుల్ని కన్పామ్ చేసుకున్నారు. అలా నేటి ఎపిసోడ్ ముగిసే సరికి టాప్ 15లోకి ఏడు మంది కంటెస్టెంట్లు ఉన్నారు. హోల్డ్‌లో ఉన్న 14 మంది నుంచి ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక రేపటి ఎపిసోడ్లో 13 మంది నుంచి టాప్ 15కి ఇంకో 8 మంది కంటస్టెంట్లను సెలెక్ట్ చేస్తారన్న మాట. మరి నేటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.షాలిని, అమన్ ఇద్దరూ కూడా మొదటి టాస్క్‌లో పోటీ పడ్డారు. కుళ్లిన కూరగాయలు అంటూ పెట్టిన ఈ టాస్కులో షాలిని చాలా స్పీడుగా దూసుకుపోయింది. ఈ చివరకు ఈ టాస్కులో షాలిని గెలిచి టాప్ 15లో స్థానం సంపాదించుకుంది. రెండో టాస్కు ప్రారంభం కంటే ముందు బ్రేకప్ స్టోరీలను చెప్పమని అన్నారు. అలా దీపక్, రోహిత్, గాయత్రి ఇలా కొంత మంది తమ తమ బ్రేకప్ స్టోరీలను చెప్పారు. రెండో టాస్కుగా ఎక్స్‌కి ఫోన్ చేసి మళ్లీ జీవితంలో కలవాలి.. ఐ లవ్యూ చెప్పాలి.. సారీ అని అడగాలి అనే టాస్క్ ఇచ్చారు.ఈ రెండో టాస్క్ కోసం చాలా మంది ముందుకు వచ్చారు. గంటను ముందు పట్టుకున్న వారే టాస్క్ ఆడాల్సి ఉంటుందని ఓ ట్విస్ట్ పెట్టారు. కానీ దీపక్, రోహిత్, గాయత్రి ఇలా అందరూ గంటను పట్టుకుని గెలుస్తారు. కానీ వారి ఫోన్లను అవతలి వ్యక్తులు లిఫ్ట్ చేయరు. దీంతో చివరకు శ్రష్టికి ఈ ఛాన్స్ వస్తుంది. తన మాజీ లవర్‌కి ఫోన్ చేసి తప్పైందని, సారీ అని, ఐ లవ్యూ అని, నువ్వు లేకపోతే నేను లేను అని మాట్లాడుతుంది. అవతలి వ్యక్తి సరే అని సైలెంట్‌గా ఉండిపోతాడు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక ప్రక్రియను బహిష్కరిస్తూ అధికార కూటమి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.మండలి ఛైర్మన్ మోషేనురాజు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియను చేపట్టగానే, టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సభలో వైసీపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే మిగిలారు. వైసీపీ తరఫున మాధవరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఛైర్మన్ ప్రకటించారు.అనంతరం పలువురు సభ్యులు 'జై జగన్' అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మంత్రి అచ్చెన్నాయుడిపై అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం వివాదాస్పదమైంది. అయితే, ఆ తర్వాత ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఛైర్మన్‌ను కోరారు.కూటమి సభ్యుల వాకౌట్‌పై బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమని, రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. రాజకీయాల్లో కక్షలు ఉండకూడదని, సభా గౌరవాన్ని కాపాడాలని హితవు పలికారు. ఎన్నిక ముగిసిన అనంతరం, నూతన డిప్యూటీ ఛైర్మన్ మాధవరావు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు

ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక మరోసారి అధికార కూటమికీ, విపక్ష వైఎస్సార్సీపీకి మధ్య వైరానికి కేంద్రంగా నిలిచింది. ఈ మధ్యే ఖాళీ అయిన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి వైసీపీ తమ అభ్యర్ధిగా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును (Tumati Madhava Rao) ఎంపిక చేసింది. అయితే ఆయనపై పోటీగా కూటమి అభ్యర్ధిని నిలబెడుతుందని భావించినా, అలా జరగలేదు. దీంతో తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా మండలి డిప్యూటీ ఛైర్మన్ అయిపోయారు.ఏపీ మండలి ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం? ఒకే ఒక్క నామినేషన్ ..!ఇవాళ శాసనమండలిలో డిప్యూటీ ఛైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవ ఎన్నికను ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధికారికంగా ప్రకటించారు. దీంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు అంతా పోడియం వద్దకు చేరుకుని తూమాటి మాధవరావును సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం ఆయన ఏకగ్రీవ ఎన్నికపై అభినందనలు తెలిపారు. దీంతో పోడియం అంతా వైసీపీ ఎమ్మెల్సీల సందడి కనిపించింది. అదే సమయంలో కూటమి ఎమ్మెల్సీలు మాత్రం సభలో లేకుండా బయటికి వెళ్లిపోయారు. తూమాటిపై అభ్యర్ధిపై నిలబెట్టకపోవడం, ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం వంటి పరిణామాల మధ్య కూటమి ఎమ్మెల్సీల చర్య ప్రాధాన్యం సంతరించుకుంది.మండలిలో వైసీపీకి హ్యాట్రిక్..! కూటమి మళ్లీ చేతులెత్తేసిందా ?ఇలా మండలి డిప్యూటీ ఛైర్మన్ ఏకగ్రీవ ఎన్నికైన వేళ ఆయన్ను అభినందించకుండా, కూటమి ఎమ్మెల్సీలు సభను వదిలి బయటికి వెళ్లిపోవడం దుస్సాంప్రదాయమంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. దేశంలో, ప్రజాస్వామ్యంలో చట్ట సభలు ఏర్పాటైన తర్వాత, ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని బొత్స గుర్తుచేశారు. ఐదు నిమిషాల క్రితం మంత్రి నాదెండ్ల నిబంధనల గురించి మాట్లాడారని, ఇప్పుడు కూటమి సభ్యులు వెళ్లిపోవడం ఏంటని నిలదీశారు. సభ మీద, సభా కార్యకలాపాల మీద కూటమి ఎమ్మెల్సీలకు ఉన్న గౌరవాన్ని ఇది బయటపెడుతోందన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, వారికి వీళ్లు ఏం సందేశం ఇస్తారని బొత్స

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అమరావతి, ఆగస్టు 19: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు అన్ని పార్టీల సభ్యులు కలిసి రావాలని మండలి చైర్మన్ కోరారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి పూర్తి వివరాలను పై వీడియోలో వీక్షించండి
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్‌లోని ఐదో ఎపిసోడ్లో హోల్డ్‌లో ఉన్న కొంత మంది కంటెస్టెంట్లకు అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. 70 మంది ఆడిషన్స్ పూర్తయింది. ఇందులో ముగ్గురు కంటెస్టెంట్లు మాత్రమే టాప్ 15 బెర్త్‌ని కన్ఫామ్ చేసుకున్నారు. ఆపై 26 మందిని హోల్డ్‌లో పెట్టారు. అయితే ఇందులో రెండు గ్రీన్స్, ఒక గ్రీన్ వచ్చిన వారు కూడా ఉన్నారు. హోల్డ్‌లో ఉన్న వారి సంఖ్య ఎక్కువ అయింది అగ్ని పరీక్ష టీం తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. జడ్జ్‌లు, హోస్ట్‌లు కలిసి కొంత మంది కంటెస్టెంట్లను హోల్డ్ నుంచి డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసేశారు. అసలు నేటి ఎపిసోడ్ ఎలా సాగిందో చూద్దాం.జ్యోష్న రెడ్డి అంటూ కర్నూలుకి చెందిన అమ్మాయి జోష్‌గా ఎంట్రీ ఇచ్చింది. సరదా సరదాగా మాట్లాడుతూనే నాన్న లేడన్న విషయాన్ని చెప్పింది. దీంతో అందరూ ఎమోషనల్ అయ్యారు. బైక్స్ అంటే ఇష్టం, ఫ్రీగా తిరగడం అంటే ఇష్టమని చెబుతుంది. అలా ఫ్రీగా తిరిగే దానికి బిగ్ బాస్ ఇంటికి ఎందుకు అని అడుగుతారు. మా నాన్నకి బిగ్ బాస్ అంటే ఎక్కువ ఇష్టం.. ఈ రోజు ఇలా ఈ స్టేజ్ మీద ఉంటే.. ఆయన పైనుంచి సంతోషిస్తుంటాడు.. నేను బిగ్ బాస్ వెళ్లినట్టు.. మా నాన్న నేను ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండే వాళ్లం.. నాకు మా నాన్నతో బాండింగ్ ఎక్కువగా.. ఇంట్లో ఎవ్వరూ లేకపోతే.. తాగుతావా అని అడిగి మరీ బీర్ తీసుకు వచ్చి ఇచ్చాడు అంటూ ఇలా తన గురించి చెబుతుంటుంది జోష్న.బైక్ అమ్మే టాస్క్‌ని జోష్నకి ఇస్తారు. అలా కాసేపు నవ్వించే ప్రయత్నం చేస్తుంది.. ఏదో సరదాగా ఉంది.. మ్యాటర్ అయితే అర్థం కాలేదు.. నేను గ్రీన్ ఇస్తా అని నవదీప్.. జోష్ న.. జోష్ ఉంది.. కానీ అదేంటో చూడాలి.. కానీ ఇంకా కాన్ఫిడెంట్ కావాలి.. అని గ్రీన్ ఇస్తాడు అభిజిత్.. మా నాన్న వాయిస్ మర్చిపోతోన్నా

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు అన్ని పార్టీల సభ్యులు కలిసి రావాలని మండలి చైర్మన్ కోరారు. అయితే కూటమి పార్టీలకు చెందిన సభ్యులు చైర్మన్ సీటు వద్దకు రాలేదు. దీంతో వారి తీరుపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, అన్ని పార్టీల సభ్యులు కలిసి కొత్తగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం సభా సంప్రదాయంలో భాగమని చైర్మన్ మోషేన్ రాజు పేర్కొన్నారు. అయితే కూటమి సభ్యులు ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటంపై మండలిలో చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాధవరావు డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బొత్స సత్యనారాయణతో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండలిలో డిప్యూటీ చైర్మన్‌గా మాధవరావు ఎన్నిక కావడం పట్ల వైఎస్సార్సీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మాధవరావు ఎన్నికతో మండలి డిప్యూటీ చైర్మన్ పదవి వైఎస్సార్సీపీకి దక్కింది. అనంతరం సభలో బొత్స మాట్లాడుతూ..‘అన్ని పక్షాలను సమదృష్టితో చూడాలని కోరుకుంటున్నా. డిప్యూటీ చైర్మన్‌ను చైర్‌పై కూర్చోబెట్టడానికి అధికార పార్టీ రాకపోవడం దురదృష్టం. మంత్రులు సభ రూల్స్ గురించి చెప్తున్నారు.. డిప్యూటీ చైర్మన్‌కి గౌరవం ఇవ్వరా?. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదు. ప్రజలు చూస్తున్నారు.. చైర్ పట్ల అగౌరవంగా వ్యవహరిస్తే మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి సహజం. సభా సాంప్రదాయాలు, గౌరవాలు శాశ్వతం. వెన్నుపోటు పార్టీ తీరు మరోసారి రుజువైంది. రాబోయే రోజుల్లో ఇలాంటి అగౌరవ ఘటనలు జరగకూడదు. మంత్రులు రూల్స్ బుక్స్ పట్టుకుని నీతులు చెప్పడం కాదు. విలువలు, సాంప్రదాయాలు

ఏపీ రాజకీయాల్లో 2024 ఎన్నికలు పెను మార్పును తెచ్చాయి. అప్పటివరకూ 150కి పైగా ఎమ్మెల్యేలతో దుర్బేద్యంగా కనిపించిన వైసీపీ (YSrCP) కాస్తా ఎన్నికల ఫలితాల తర్వాత 11 సీట్లకు పడిపోయింది. అదే సమయంలో శాసనమండలిలో (AP Legislative Council) మాత్రం 50 ఎమ్మెల్సీలు ఉండటంతో పటిష్టంగా కనిపించింది. అయినా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో.. మండలిపై వైసీపీ పట్టు కొనసాగించడం అంత సులువు కాదని అంతా భావించారు. కానీ రెండున్నరేళ్ల పాలన తర్వాత కూడా కూటమి మండలిపై పట్టు సాధించడంలో విఫలం కాగా.. వైసీపీ మాత్రం అదే పట్టు కొనసాగిస్తుండటం విశేషం.ఆ జిల్లాకు చంద్రబాబు పేరు..? సర్కార్ కు టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ ..!ఈ నేపథ్యంలో తాజాగా మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక వచ్చింది. గతంలో వైసీపీ మండలి ఛైర్మన్ గా గెలిపించుకున్న జకియా ఖానం.. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరిపోయారు. అయినా ఛైర్మన్ రూపంలో కొయ్యే మోషేన్ రాజు ఉండటంతో కూటమి ఫిరాయింపులు రాజకీయాలు పనిచేయలేదు. వైసీపీ నుంచి కూటమిలోకి ఆరుగురు ఎమ్మెల్సీలు ఫిరాయించినా వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మోషన్ రాజు సైలెంట్ గా ఉండిపోవడంతో చంద్రబాబు కూడా చేసేదేమీ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్ధితుల్లో జకియా ఖానం పదవీకాలం ముగిసిపోయి మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక రావడంతో కూటమి కచ్చితంగా అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకుంటుందని అంతా భావింంచారు. కానీ ఇక్కడా సీన్ రివర్స్ అయింది. ఏపీ మండలి ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం? ఒకే ఒక్క నామినేషన్ ..!వైసీపీ మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి నిలబెట్టిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుకు పోటీగా కూటమి నుంచి అభ్యర్దిని నిలబెట్టలేదు. దీంతో ఆయన ఏకగ్రీవంగా మండలి డిప్యూటీ ఛైర్మన్ కాబోతున్నారు. దీంతో మండలిలో ఛైర్మన్ గా కొయ్యే మోషేన్ రాజు, విపక్ష నేతగా బొత్స సత్యనారాయణ తర్వాత మూడో కీలక పదవిలోనూ మరో వైసీపీ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో సామాన్యులను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించే ప్రయత్నంలో భాగంగా.. 'అగ్నిపరీక్ష సీజన్ 2' రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి వచ్చిన వారిలో ఇప్పటికే కొంతమంది సెకండ్ రౌండ్ వరకు వెళ్లగా, ముగ్గురు జడ్జిల నుంచి గ్రీన్ కార్డ్ సాధించి ఫైనల్స్‌కు చేరిన వారు ముగ్గురు ఉన్నారు. ఇక ఆ ముగ్గురితో పోటీ పడటానికి ఇప్పటి వరకు హోల్డ్‌లో ఉన్న 26 మంది నుంచి మరో 8 మందిని ఏకాభిప్రాయంతో ఎలిమినేట్ చేశారు. దాంతో హోల్డ్‌లో ఉన్న టీమ్ సంఖ్య 18కి చేరింది. తాజా ఎపిసోడ్లో జ్యోత్స్నా రెడ్డి, ఫుతా (జపాన్), అభిజ్ఞ, హేమంత్, ప్రియాంక ఐదుగురు తమ టాలెంట్‌ను చూపించుకునే ప్రయత్నం చేశారు. ఇందులో చాలా ఆసక్తికరంగా అనిపించింది జపాన్ నుంచి వచ్చిన ఫుతా మాత్రమే. ఫుతా జపాన్ దేశానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆయనకు తెలుగు అంటే చాలా అభిమానం. చాలా కాలంగా తెలుగు నేర్చుకుంటూ.. జపాన్, తెలుగు మిక్సింగ్ వీడియోలు కూడా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యాడు. తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తూ, తెలుగు సినిమా డైలాగ్స్ కూడా చెప్తుంటాడు. తనను తాను ఒక మ్యూజిషియన్‌గా పరిచయం చేసుకున్నాడు ఫుతా. అయితే తెలుగు సరిగ్గా రాని కారణంగా హౌస్‌లో సర్వైవ్ అవ్వలేడని మిగతా జడ్జెస్ రిజెక్ట్ చేయగా, అభిజిత్ మాత్రమే అతనికి గ్రీన్ కార్డ్ ఇచ్చి ఫైనల్ రౌండ్‌కు పంపించాడు. ఈ ఎపిసోడ్లో ఇద్దరు కంటెస్టెంట్లు ఫాదర్ సెంటిమెంట్‌తో కంటతడి పెట్టించారు. ముందుగా జ్యోత్స్నా రెడ్డి చాలా జోష్‌తో వచ్చి, మధ్యలో తండ్రి జ్ఞాపకాలతో ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి తనను ఎంత ప్రేమిస్తారో, ఆయనకు బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టమో చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. సడెన్‌గా తన తండ్రి మరణం గురించి చెబుతూ, ఆయన వాయిస్ ఎక్కడ మర్చిపోతానో అని ఆమె

తాడేపల్లి : ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు.. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. వైఎస్సార్సీపీ తరుఫున శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందు వైఎస్ జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు తుమాటి మాధవరావు. రేపు రాజమండ్రి రూరల్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం రేపు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, సంస్థాగత అంశాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై వీరితో వైఎస్ జగన్ చర్చించనున్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన కేసీ కెనాల్ రైతులు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేయకపోవటంపై ఆందోళన వ్యక్తం చేసిన కేసీ కెనాల్ రైతులు.. వైఎస్ జగన్‌ను కలిశారు. రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడంపై వైఎస్ జగన్ వద్ద వారు ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయరులో 878 అడుగుల నీరు ఉన్నా సాగునీరు విడుదల చేయటం లేదంటూ ఫిర్యాదు చేశారు. మీ హయాంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నా నీటిని విడుదల చేశారంటూ వైఎస్ జగన్‌కు గుర్తు చేశారు రైతులు. భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు) జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు) న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు) క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత 'ఇది సిగ్గులేని ప్రదర్శన' విజయ్-త్రిషపై DMK తీవ్ర విమర్శలు కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భాగస్వాములతో కలిసే బరిలోకి దిగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల కీలక సమావేశంలో మాట్లాడిన ఆయన, స్థానిక ఎన్నికల సమన్వయ బాధ్యతలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే వార్డు స్థాయి నుంచి ప్రతి గ్రామంలోనూ కమలం జెండా ఎగిరేలా, స్థానిక పదవులను దక్కించుకునేలా ప్రణాళికలతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి ఫలాలను, మన్ కీ బాత్ వేదికగా వ్యక్తమయ్యే సందేశాలను ప్రతి ఇంటా ప్రచారం చేయాలని సూచించారు. అలాగే విశాఖ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ... దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాధనతో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకున్నామని, ప్రస్తుతం అది లాభాల దిశగా ప్రయాణిస్తోందని పేర్కొన్నారు. పోలవరం నీటిని విశాఖ ప్రాంతానికి అందించే పనులు కూడా వేగవంతమయ్యాయని వివరించారు
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్‌లోని నాలుగో ఎపిసోడ్లో మొదటి కంటెస్టెంట్‌గా లక్ష్మీ దీపక్ సేనాపతి వచ్చాడు. తన జర్నీ గురించి చెప్పాడు. 2021కి ముందు, ఆ తర్వాత తన జీవితం అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. క్రికెట్ ఎక్కువగా ఇష్టమని, అయితే తనకు ఆరోగ్య సమస్యలు రావడంతో ఆ ఆటను వదిలేసి యాక్టింగ్, మోడలింగ్ సైడ్ వచ్చానని అన్నాడు. ఇలా తన జర్నీ చెబుతూ ఉంటే.. నవదీప్ వెళ్లి అతని చేతిలో ట్రిమ్మర్ పెడతాడు. ఇది ఎందుకు ఇచ్చి ఉంటారు? అని శ్రీముఖి అడుగుతుంది. హెయిర్ షేవ్ చేసుకోమని అంటారేమో అని అతగాడు గెస్ చేస్తాడు. హెయిర్ మాత్రం తీయను.. మీసం, గడ్డం తీస్తాను అని అతను అంటాడు.ఈ ఫాంలో మీసం తీసుకోను అని రాశావ్.. ఇప్పుడేమో తీసుకుంటా అంటున్నావ్.. ఇలా మాటలెందుకు మార్చుతున్నావ్ అని పాయింట్‌ను పట్టుకుంటారు. దీంతో బిందు మాధవి వెంటనే రెడ్ ఇస్తుంది. అలా రాస్తే అదే చేయిస్తాం.. నీ జుట్టు జోలికి రాము అని నువ్వు అనుకున్నావ్.. మమ్మల్ని మానుప్యులేట్ చేద్దామని అనుకున్నావ్ అంతేనా? అని నవదీప్.. ఇన్ని కెమెరాలు ఉండగా.. మోసం చేయాలని చూస్తావా? అని శ్రీముఖి అంటాడు. చివరకు తన తప్పు ఒప్పుకుంటాడు. కావాలనే అలా చేశాను అని అంటాడు. స్టేజ్ మీదే గడ్డం, మీసం తీసేస్తాడు. కానీ అభిజిత్ కూడా రెడ్ ఇస్తాడు. అతి తెలివి చూపించాడు.. ఇది కూడా కావలి.. నెక్ట్స్ ఏం చేస్తాడో ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని అంటాడు నవదీప్. అలా అతడ్ని హోల్డ్‌లో పెట్టేశారు.ఆ తర్వాత అపూర్వ అనే అమ్మాయి వస్తుంది.. ఆమె యాంకరింగ్ చేస్తూ, హోస్ట్‌లో, న్యూస్ ప్రజెంటర్లా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె గురించి పూర్తిగా ఏమీ చెప్పకుండానే ఆమె మాటలకు తెగ నవ్వుతూ గ్రీన్ ఇచ్చేస్తాడు నవదీప్. ఇక అసలు ఆమె కథ చెప్పడం ప్రారంభించే సరికి ఓ పాయింట్లో దొరికిపోతుంది. పురుషాధిక్యత లేని ప్లేస్

సామాన్యుడిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించడానికి అగ్నిపరీక్ష2 స్టార్ట్ అయ్యింది. కొంచెం ఫన్, కొంచెం కాంట్రవర్సీతో ఎంతో మంది టాలెంటెడ్ కంటెస్టెంట్స్ తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో అగ్నిపరీక్ష సీజన్ 2 చాలా ఘాటుగా నడుస్తోంది. గతంలో కంటే ఈసారి కాస్త డోస్ పెంచారు. జడ్జిలు కూడా పరిస్థితిని చాలా టైట్ చేస్తున్నారు. తాజా ఎపిసోడ్లో కంటెస్టెంట్స్‌కు జడ్జిలు షాక్ ఇవ్వడంతో పాటు.. ఓ కంటెస్టెంట్ అభిజిత్‌కు కోలుకోలేని పంచ్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు అపూర్వ. అగ్నిపరీక్ష2లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే తన ఎనర్జీ లెవల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది అపూర్వ. ఖమ్మంకు చెందిన ఆమె గతంలో యాంకర్‌గా, మిస్ తెలంగాణగా గెలిచింది. ఖమ్మం కళాకారుల గుమ్మం అంటూ.. తన మాటల దాడితో ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా నవదీప్ మీద ఫోకస్ చేస్తూ.. ఆయన్ను ఇంప్రెస్ చేయాలని చూసింది. బిందు మాధవిని కూడా బుట్టలో వేయాలని చూసిన అపూర్వ.. అభిజిత్‌పై మాత్రం షాకింగ్ కామెంట్స్ చేసింది. అతను తనకు నచ్చడని.. ఆయన సేఫ్ గేమ్ ఆడాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫిజికల్ టాస్క్‌లు ఆడే టైమ్‌లో ఎడ్యుకేషన్ గురించి చెబుతూ.. తప్పించుకున్నాడని, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయకుండానే మైండ్ గేమ్‌తో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాడంటూ మైండ్ బ్లాక్ అయ్యే కామెంట్స్ చేసింది. దాంతో అభిజిత్ కూడా డిఫెన్స్ చేసుకోవడానికి గట్టిగా ట్రై చేశాడు. ఫైనల్‌గా అపూర్వ ఎంత టాలెంట్ చూపించినా కూడా చివరకు అభిజిత్, బిందు నుంచి రెడ్ కార్డ్ రాగా.. నవదీప్ మాత్రం "ముందు ముందు ఎలా ఉంటావో చూడాలి నువ్వు" అంటూ.. గ్రీన్ కార్డ్ ఇచ్చి హోల్డ్ చేశాడు. అగ్నిపరీక్ష2లో చాలామంది తమ ఒరిజినల్ పర్సనాలిటీని దాచిపెట్టి.. ఏదో చూపించాలి అన్నట్టుగా స్టేజ్ మీదకు వస్తున్నట్టు కనిపిస్తోంది. తాజా ఎపిసోడ్లో ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ లక్ష్మీదీపక్ సేనాపతి కూడా అలానే చేశాడు. తన డిటైల్స్‌ను చాలా ఎమోషనల్‌గా చెప్పి

చిరంజీవి కెరీర్ ని ఖైదీకి ముందు ఖైదీకి తర్వాత గా చూడాలి. ఖైదీకి ముందు కెరీర్ ని ఒక్కో మెట్టు పేర్చుకుంటూ వచ్చిన చిరు.. ఖైదీ చిత్రంతో విశ్వరూపం ప్రదర్శించారు. టాలీవుడ్ లో నయా స్టార్ గా అవతరించారు. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో ప్రతి అంశం ఒక అద్భుతం అనే చెప్పాలి. ఖైదీ చిత్రంలోని రగులుతోంది మొగలి పొద అనే సాంగ్ ఐకానిక్. అలాంటి సాంగ్ అప్పటి వరకు టాలీవుడ్ లో అస్సలు లేదు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ.. డ్యాన్స్ కొరియోగ్రఫీ, దర్శకత్వంకి కొత్త అర్థం చెప్పిన పాట అది. సలీం మాస్టర్ పర్యవేక్షణలో శివశంకర్ మాస్టర్ ఆ సాంగ్ ని కంపోజ్ చేశారు. చిరంజీవి, మాధవిలకు అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ ఇచ్చారు. చిరు, మాధవి ఇద్దరూ మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేసిన విధానం చాలా కష్టంతో కూడుకున్న ప్రాసెస్. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో శివ శంకర్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సలీం మాస్టర్ అంటే నాకు చాలా గౌరవం, భయం. ఆయన పర్యవేక్షణలో ఎలాంటి తప్పు జరగకూడదు అని మనసులో అనుకుంటూ రగులుతోంది మొగలి పొద సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాను. రిహార్సల్స్ చేసి చిరంజీవికి డ్యాన్స్ మూమెంట్స్ చూపించాను. చిరంజీవి మాధవి ఇద్దరూ రిహార్సల్స్ పర్ఫెక్ట్ సింక్ లో చేశారు. ఆ సాంగ్ కొరియోగ్రఫీ తర్వాత నాకు బాడీ పెయిన్స్, వెన్ను నొప్పు వచ్చాయి. మూడు నెలల పాటు సరిగ్గా నడవలేకపోయాను. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కోలుకున్నాను. నేను డ్యాన్స్ మాస్టర్ ని.. ఆ సాంగ్ వల్ల నేనే అంత ఇబ్బంది పడితే ఇక చిరంజీవి పరిస్థితి ఊహించుకోండి. మాధవి పరిస్థితి ఊహించుకోండి. ఎంత కష్టం అయినా చిరంజీవి వెనకడుగు వేయకుండా ఆ సాంగ్ చేశారు. మాధవి కష్టం కూడా మరిచిపోలేం. ఇండియాలో డ్యాన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే

‘అగ్నిపరీక్ష’ వేదికపై రాజకుమారి చెప్పిన కన్నీటి కథ అందరినీ కదిలించింది. ముగ్గురు పిల్లల కోసం ఆమె చేసిన పోరాటం వైరల్‌గా మారింది. బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. కష్టాల కడలిని దాటి.. కన్నీళ్లను దిగమింగి.. ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం ఒంటరిగా పోరాడిన ఓ మహిళ కథ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకుమారి (Rajakumari) జీవిత ప్రయాణం వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఎన్నో అవమానాలు, అన్యాయాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ఆత్మవిశ్వాసంతో నిలబడిన ఆమె.. ‘అగ్నిపరీక్ష’ వేదికపై తన మాటలతో అందరినీ కదిలించింది. త్వరలో ప్రారంభం కానున్న ‘బిగ్‌బాస్ 10’ (Bigg Boss 10 Telugu) కోసం సామాన్యుల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమంలో నవదీప్, అభిజిత్, బిందు మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్లకు ఆసక్తికరమైన టాస్క్‌లు ఇస్తూ.. వారి ప్రతిభతో పాటు జీవిత కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజకుమారి చెప్పిన తన జీవిత కథ ఇప్పుడు ప్రత్యేకంగా నిలిచింది. చిన్న వయసులోనే రాజకుమారికి ఇష్టం లేని పెళ్లి జరిగింది. ఆమె నల్లగా ఉందనే కారణంతో మొదటి భర్త మరో వివాహం చేసుకుని ఆమెకు తీవ్ర అన్యాయం చేశాడు. ఆ బాధ నుంచి కోలుకునేలోపే కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేశారు. అయితే రెండో వివాహం కూడా ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేదు. భర్త బాధ్యతలను వదిలేసి వెళ్లిపోవడంతో ముగ్గురు చిన్నారులతో కలిసి ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. చేతిలో డబ్బు లేదు.. ఉండేందుకు సరైన చోటు లేదు.. పిల్లలను చూసుకునే తోడు లేదు. అయినా రాజకుమారి కుంగిపోలేదు. పిల్లల ఆకలి కేకలు తనను మరింత బలంగా మార్చాయి. ఆత్మహత్య ఆలోచనలను పక్కన పెట్టి.. తన పిల్లల భవిష్యత్తు కోసం జీవితంతో పోరాడాలని నిర్ణయించుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ తన పిల్లలను పెంచేందుకు ఆమె సాగించిన

ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి జాయింట్ కో-ఆర్డినేటర్ బాధ్యత..! ఆంధ్రప్రదేశ్ బీజేపీ యువ నేత, పార్టీ వక్త ఎస్. విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆయనను ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న ఆయనకు జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యత అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సెల్స్, విభాగాల మధ్య సమన్వయం చేయడం విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన బాధ్యతగా ఉండనుంది. ఆయా విభాగాల కార్యకలాపాలను పార్టీ జాతీయ నాయకత్వంతో అనుసంధానం చేయడంతో పాటు, పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. దీంతో ఇప్పటివరకు ఏపీ రాజకీయాలకే పరిమితమైన ఆయన రాజకీయ బాధ్యతలు జాతీయ స్థాయికి విస్తరించనున్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే బీజేపీ వక్తగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గుర్తింపు పొందారు. పార్టీ విధానాలను మీడియా వేదికలపై బలంగా వినిపించడం, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం ఇవ్వడం, సమకాలీన అంశాలపై బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన వాగ్దాటి, రాజకీయ అంశాలపై అవగాహనకు తోడు సంస్థాగత అనుభవం కూడా ఉండటంతో తాజాగా జాతీయ స్థాయిలో సమన్వయ బాధ్యత అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలకు ప్రాధాన్యత లభించింది. దగ్గుబాటి పురందేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా, రాంమాధవ్‌కు జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు దక్కగా, విష్ణువర్ధన్ రెడ్డికి కీలకమైన సమన్వయ బాధ్యత లభించింది. ఒకే జాతీయ కార్యవర్గంలో ఏపీకి చెందిన నేతలకు కీలక బాధ్యతలు దక్కడంతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. సీనియర్ నేతలతో పాటు యువ నాయకత్వానికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడంలో భాగంగానే విష్ణువర్ధన్ రెడ్డి నియామకాన్ని రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. యువతతో అనుసంధానం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం వంటి అంశాల్లో ఆయనకు

బీజేపీ అధిష్ఠానం పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా.. న్యూఢిల్లీ: బీజేపీ అధిష్ఠానం పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీని ప్రకటించారు. పార్టీ జాయింట్ కోఆర్డినేటర్‌గా విష్ణువర్ధన్‌రెడ్డిని నియమించారు. కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌గా తరుణ్ చుగ్, OBC మోర్చా నూతన ఉపాధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్య పేర్లను ప్రకటించింది పార్టీ అధిష్ఠానం. అలాగే, సంస్థాగత జనరల్ సెక్రటరీగా B.L.సంతోష్, సంస్థాగత జాయింట్ జనరల్ సెక్రటరీగా శివప్రకాష్ పేర్లను ఖరారు చేసింది బీజేపీ అధినాయకత్వం. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కలేదు. పైగా ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణను తప్పించారు

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించగా.. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన చిత్రం ‘అమీర్ లోగ్’ (Ameer Log Movie). ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించగా.. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్రంలోని ప్రధాన పాత్రధారులైన MC హరి, మనోజ్, శశిధర్ చిత్ర విశేషాల్ని మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఎంతో నేచురల్‌గా ఉంటుంది. సినిమాని చూసినట్టుగా ఉండదు. హైదరాబాద్ బస్తీలోకి వెళ్లినట్టుగా, ఆ బస్తీల్లో జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మా డైరెక్టర్ అత్తగారి ఇల్లు, ఆ బస్తీలోనే షూటింగ్ చేశాం. అక్కడి వాళ్లంతా మా అందరినీ ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారు. సింక్ సౌండ్‌లో ఈ మూవీ ఉంటుంది. అందుకే ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా షూటింగ్ ఆపేవాళ్లం. పైనా విమానం వెళ్లినా, ఏసీ సౌండ్ వచ్చినా కూడా ఆపేసేవాళ్లం. రోడ్ల మీద తీసిన సీన్లకు మాత్రమే డబ్బింగ్ చెప్పాం. అది కూడా దాదాపు ఐదు శాతం మాత్రమే ఉంటుంది. మేం బస్తీల్లోనే పెరిగాం. తెలంగాణ యాస, బస్తీ లైఫ్ కథ అవ్వడంతో మాకు చాలా సులభంగా అనిపించింది. మా పాత్రలు రియల్ లైఫ్ కారెక్టర్స్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. రమణ అన్న ఎంతో నేచురల్‌గా, ఎంతో సింపుల్‌గా సినిమాని తీశారు. ఇందులో బిర్యానీ

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంపై వైసీపీపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారని అన్నారు. వైసీపీ కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతుందని ఆగ్రహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కి రాకపోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాలని ఆహ్వానించారు. ప్రజా సమస్యలపై జగన్ అండ్ కో అసెంబ్లీలో మాట్లాడాలని.... పారిపోకూడదని అన్నారు

రానా దగ్గుబాటి ప్రెజెంట్స్, విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి, శశాంక్ శ్రీవాస్తవయ, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ & స్పిరిట్ మీడియా డార్క్ చాక్లెట్ నుంచి కల్లో కల్లోలం సాంగ్ లాంచ్ రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి 'డార్క్ చాక్లెట్' చిత్రాన్ని ను సగర్వంగా అందిస్తున్నారు. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ కల్లో కల్లోలం సాంగ్ లాంచ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ.. ‘కల్లో కల్లోలం’ పాట ఈ సినిమాలో చాలా ముఖ్యమైన సందర్భంలో వస్తుంది. ఈ సాంగ్ సినిమాకు చాలా ఇంపార్టెంట్. వివేక్ సాగర్ చాలా అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. ఇందులో లిరిక్స్ కూడా చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. మా డైరెక్టర్ కూడా సాంగ్స్ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. అనురాగ్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. తప్పకుండా ఈ పాట ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది. ఇది చాలా కొత్త తరహా సినిమా. ఈ సినిమా గురించి ఆడియన్స్ కచ్చితంగా చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. దర్శకుడు రాసింది రాసినట్టుగా తెరకెక్కించారు. వివేక్ సాగర్ ఈ కథను చాలా అద్భుతంగా అర్థం చేసుకుని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇప్పటివరకు సినిమా చూసిన అందరూ చాలా అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. మరోసారి చూడటానికి కూడా ఎదురుచూస్తున్నారు. రానా గారి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమా గురించి ఆయన కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా ఒక పెద్ద బ్యాంగర్ అవుతుంది. . బిందు మాధవి గారు చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. కచ్చితంగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు. త్వరలోనే థియేటర్స్‌లో కలుద్దాం. డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ.. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ‘కల్లో కల్లోలం’ పాటలో

కులమత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ పండుగ జరుపుకుంటున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ, ఆగస్టు 15: కులమత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ పండుగ జరుపుకుంటున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పీవీఎన్ మాధవ్ పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్రం వచ్చినా వందేమాతర గీతం ఆలపించడం ఆగిపోయిందని.. ఇవాళ ప్రధాని మోదీ వందేమాతర గీతం పూర్తిగా ఆలపించారని తెలిపారు. కొందరు సంకుచిత మతతత్వ ఆలోచనతో ఏ మాతకీ వందనం చెప్పకుండా భీష్మించుకుని కూర్చున్నారని మండిపడ్డారు. అధికారికంగా దేశం మొత్తం వందేమాతర గీతం పూర్తిగా ఆలపించారని మాధవ్ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏక్ భారత్ నినాదం తీసుకొచ్చారని అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో టెర్రరిస్టు, మావోయిస్టు కార్యకలాపాలు లేకుండా చేశారని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

టాలీవుడ్లో సంక్రాంతి సీజన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించే పండగ కావడంతో పెద్ద హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతీ ఒక్కరూ తమ సినిమాలను సంక్రాంతికే తీసుకురావాలని తహతహలాడుతుంటారు. అయితే ఈసారి పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాని సినిమాలు సైతం ముందే సంక్రాంతి స్లాట్‌పై కర్చీఫ్ వేసేస్తున్నాయి. ఈ ఏడాది ‘నారీ నారీ నడుమ మురారి’తో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీనువైట్లతో కలిసి జార్జ్ క్రిష్ చిత్రాన్ని ఈ రోజు ప్రారంభించారు. సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారు. మరోవైపు రవితేజ – శ్రీవిష్ణు కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించనున్న ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా సెట్స్ పైకి వెళ్లనప్పటికీ సంక్రాంతి రేసులోనే నిలపాలని దిల్ రాజు పట్టుదలతో ఉన్నారు. ఇక సీనియర్ స్టార్ హీరోలు కూడా పండగ బరిలో గట్టిగానే పోటీపడుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం సంక్రాంతికి సిద్ధమవుతోంది. అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ కూడా ఇదే బరిలో ఉంది. దీనికి తోడు కోలీవుడ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఈ పోటీని మరింత హీటెక్కిస్తున్నాయి. కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ సినిమాతో పాటు, ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న కొత్త సినిమా కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. మొత్తానికి సినిమా షూటింగ్‌లు పూర్తి కాకుండానే విడుదల తేదీల ప్రకటనలతో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పోరు అప్పుడే వేడెక్కింది

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభానికి ముందు అదిరిపోయే షో వస్తోంది. అదే `అగ్నిపరీక్ష`. బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపేందుకు కామనర్స్ ని ఎంపిక చేసేందుకు పెట్టిన మిని టెస్ట్ షో ఇది. ఇందులో కామనర్స్ నుంచి కొందరిని ఎంపిక చేసి టెస్ట్ చేస్తారు. వాళ్లు బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లేందుకు అర్హులా కాదా అనేది ముగ్గురు జడ్జ్ లు నిర్ణయిస్తారు. అభిజీత్, బిందు మాధవి, నవదీప్ జడ్జ్ లుగా ఈ అగ్నిపరీక్ష మిని షోస్ రన్ అవుతుంది. ఇది ఈ నెల 15 నుంచి స్టార్ మాలో, అలాగే జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అగ్నిపరీక్ష కోసం కామనర్స్ నుంచి సుమారు 70 మందిని ఎంపిక చేశారట. అందులో 45 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్టు సమాచారం. వీరి నుంచి 15 మందిని రెండో దశలో ఫిల్టర్ చేసినట్టు సమాచారం. వీరి నుంచే హౌజ్‌లోకి పంపే కంటెస్టెంట్లని ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నెల 15 నుంచి స్టార్ట్ కానున్న షోలో ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి వారిని టెస్ట్ చేస్తారు జడ్జ్ లు. వారు ఇంప్రెస్ అయితే ఎంపిక జరుగుతుంటుంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమోలు విడుదల చేస్తున్నారు. కొందరు కంటెస్టెంట్లు జడ్జ్ లకే ఝలక్ ఇస్తుంటే, జడ్జ్ లు కంటెస్టెంట్లకి ఝలక్ ఇస్తున్నారు. అందులో భాగంగా ఒక అమ్మాయికి అభిజీత్ షాక్ ఇచ్చాడు. దెబ్బకి ఆమెకి ఉన్న తలపొగరు మొత్తం దిగిపోయింది. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంది. అదేంటనేది చూస్తే, లెటస్ట్ ప్రోమోలో.. కరీంనగర్ నుంచి షాలిని దామెర అనే అమ్మాయి అగ్నిపరీక్ష స్టేజ్‌మీదకు వచ్చింది. ఆమె ఇటీవలే జిమ్ కూడా స్టార్ట్ చేసినా అని, కొంచెం కండ వచ్చిందని చెప్పింది. చూపించమని శ్రీముఖి అడగ్గా, తన చిన్న కండని చూపించింది. దీనికి నవదీప్ కౌంటర్ వేయడం నవ్వులు పూయించింది. అనంతరం బిందు మాధవి.. షూస్ క్లీన్

ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ తన బాల్యం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో, చిన్నప్పుడు తనను, తన సోదరిని చూసి చాలామంది జీవితంలో పైకిరారని అన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇటీవల ఎం9 న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాధవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.జంషెడ్‌పూర్‌లో తన బాల్యం గడిచిందని మాధవన్ తెలిపారు. ఆయన తండ్రి రంగనాథన్ ఒక ప్రైవేట్ సంస్థలో, తల్లి సరోజ బ్యాంకులో పనిచేసేవారని చెప్పారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లడంతో, పిల్లల బాగోగులు, హోంవర్క్ చూసేవారు ఎవరూ లేరని ఇరుగుపొరుగు వారు అనేవారని ఆయన పేర్కొన్నారు. "పిల్లల భవిష్యత్తు కంటే మీకు ఉద్యోగాలే ముఖ్యమా?" అంటూ చుట్టుపక్కల వారు తరచూ తమ తల్లిదండ్రులను నిందిస్తూ, వారిని బాధపెట్టే ప్రయత్నం చేసేవారని మాధవన్ వివరించారు.అయితే, తన తల్లిదండ్రులు ఇలాంటి విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. "చాలామంది అనుకున్నట్టు నేను ఇంజనీర్‌ను కాదు. కేవలం బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివి, అతికష్టం మీద పాసయ్యాను. చదువులో నేనేమీ గొప్పవాడిని కాదు," అని మాధవన్ నిజాయితీగా అంగీకరించారు. తల్లిదండ్రులు ఇద్దరూ సంపాదించడం వల్లే తనకు ఎక్స్ఛేంజ్-స్టూడెంట్ ప్రోగ్రామ్స్, స్కాలర్షిప్స్ కింద విదేశాలకు వెళ్లే అవకాశాలు లభించాయని, అవే తన జీవితాన్ని మార్చేశాయని ఆయన తెలిపారు.తమ తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తనకు గర్వకారణమని, వారు తమకు ఒక మంచి ఉదాహరణగా నిలిచారని మాధవన్ అన్నారు. పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకపోయినా ప్రతిభ, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే ఎవరైనా విజయం సాధించవచ్చనే తన

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హంగామా ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ కి ముందు జరగబోయే బిగ్ బాస్ అగ్నిపరీక్షకి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. బిగ్ బాస్ పరీక్ష ప్రోమోను స్టార్ మా సంస్థ రిలీజ్ చేసింది. గత సీజన్ లో బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జీలు పాల్గొన్న హీరో అభిజీత్, నవదీప్, బిందు మాధవి ఈ సీజన్ కి కూడా జడ్జీలుగా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో బిగ్ బాస్ అగ్ని పరీక్షపై అంచనాలు పెంచేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో కాస్తో కూస్తో పాపులారిటీ ఉన్న వారికి బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ప్రాధాన్యం ఇచ్చారు. కొందరు కామనర్స్ కూడా ఉన్నారు. ఓ కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వగానే షర్ట్ విప్పి తన కండలు ప్రదర్శించారు. హోస్ట్ గా ఉన్న శ్రీముఖి వంక నవదీప్ చూస్తూ.. నువ్వు హ్యాపీ కదా శ్రీముఖి అని సెటైర్లు వేశారు. శ్రీముఖి నవ్వేసింది. ఫోక్ సింగర్ ఝాన్సీ కూడా బిగ్ బాస్ అగ్నిపరీక్షలో అవకాశం అందుకున్నారు. ప్రాణం ఉన్నంత వరకు వ్యవసాయాన్ని, పాటని వదలను అని ఝాన్సీ చెబుతోంది. నీలాంటి వాళ్ళ కథ అందరికీ తెలియాలి.. ఇదిగో గ్రీన్ అంటూ నవదీప్ ఆమెకి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. అంటే ఆమెకి నవదీప్ సపోర్ట్ లభించినట్లే. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో అన్నీ టాస్కులు కంప్లీట్ చేస్తే సింగర్ ఝాన్సీ బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్ గా అవకాశం అందుకోవచ్చు. మరో కంటెస్టెంట్ రాగానే తెలుగుని లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి రాస్తూ తన ట్యాలెంట్ చూపించింది. నవదీప్ ఫిదా అయ్యారు. దీనితో ఆమె మాట్లాడుతూ చందమామ సినిమాలో నా చందమామ నవదీప్ గారు. ఐ లవ్ యు సార్ అని చెప్పింది. నవదీప్ కూడా ఐ లవ్ యువర్ స్టోరీ అని చెప్పారు. సార్
.webp)
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..! ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల నిర్వహణ వేళ రాష్ట్ర రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజా అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ శాసనసభాపక్ష (వైసీపీఎల్పీ) సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. చట్టసభల్లో ప్రతిపక్షంగా తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తితోనే శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినప్పటికీ, శాసనమండలి (లెజిస్లేటివ్ కౌన్సిల్) సమావేశాలకు మాత్రం విధిగా హాజరుకావాలని వైఎస్సార్సీపీ తీర్మానించింది. మండలి వేదికగానే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, ప్రజా సమస్యలపై నిలదీయాలని నేతలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అదేవిధంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా వైఎస్సార్సీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావును ఎంపిక చేసినట్లు పార్టీ కీలక వర్గాలు స్పష్టం చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా విషయంలో కూటమి ప్రభుత్వానికి, వైఎస్సార్సీపీకి నడుమ తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. చట్టప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడేందుకు తగిన సమయం కేటాయిస్తేనే అసెంబ్లీకి వస్తామని వైఎస్సార్సీపీ నాయకులు మొదటి నుంచీ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, శాసనసభలో సంఖ్యాబలం ప్రకారం వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని అధికార పక్షం తేల్చిచెబుతోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీని బహిష్కరించి, తమకు మెజారిటీ ప్రాతినిధ్యం ఉన్న శాసనమండలి వేదికగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. వైఎస్సార్సీపీ వైఖరిపై అధికార కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా సభను బహిష్కరించడం

అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది. అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది. వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావును ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీలో వైసీపీకి తగిన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆ పార్టీ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. అసెంబ్లీలో ప్రస్తుతం రెండు పక్షాలే ఉన్నాయని, మూడో పక్షం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టార్చ్‌లైట్లతో బెదిరించబోతే జనంపైకి దూసుకొచ్చిన ఏనుగు.. వీడియో వైరల్ తెలంగాణలో ఈ జలపాతం అందాలు చూస్తే మైమరచిపోవాల్సిందే.!

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Bigg Boss Agnipariksha Season 2: బిగ్‌బాస్ పదో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుండగా.. ఈ హౌస్‌లోకి సాధారణ వ్యక్తులకు అవకాశం కల్పిస్తోంది. గత సీజన్లో కామనర్ ట్రోఫీ ఎత్తుకెళ్లడంతో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో మరోసారి సాధారణ ప్రజలకు అవకాశం కల్పించడంలో భాగంగా అగ్నిపరీక్ష రెండో సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే కామనర్ల కేటగిరిలో కొందరిని ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న అగ్నిపరీక్షకు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. అగ్నిపరీక్షకు సంబంధించిన వీడియో విడుదల అవడంతో ప్రేక్షకులు ఆసక్తిగా గమనించారు. మొత్తం 70 మంది అగ్నిపరీక్షకు ఎంపికయ్యారు. వారిలో నుంచి పది నుంచి 15 మంది వరకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వారి ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా విడుదల చేసిన ప్రొమోలో గత సీజన్ మాదిరి ప్రశ్నలతోపాటు టాస్క్‌లు ఇచ్చి అగ్నిపరీక్షలో కామనర్లను ఎంపిక చేయనున్నారు. విడుదల చేసిన ప్రొమో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అగ్ని పరీక్షకు లక్షల్లో దరఖాస్తులు రాగా.. వాటిలో నిర్వాహకులు వడపోసి ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేయడానికి తీవ్రంగా శ్రమించారు. చివరికి 70 మందిని ఎంపిక చేశారని సమాచారం. ఎంపికైన వారిలో చివరకు 15మందిని ఎంపిక చేయనున్నారు. గత సీజన్‌కు వచ్చిన స్పందనతో ఈసారి కామనర్లను హౌస్‌లోకి ఐదు లేదా ఆరుగురికి అవకాశం ఇచ్చేలా కనిపిస్తోంది. 2024 సీజన్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ గెలుచుకోగా.. ఈసారి కూడా రైతు బిడ్డ కేటగిరీలో ఓ అమ్మాయికి అవకాశం ఇచ్చేలా కనిపిస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి కంటెంట్ చేస్తూ

ఇంటి ముందున్న కారులో మంటలు చెలరేగి అక్కడికక్కడే కారు సగం కాలిపోయిన ఘటన హైదరాబాద్ హయత్‌నగర్‌లో పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెల్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న మాధవ రెడ్డి అనే వ్యక్తి ఎప్పటిలాగే తన ఇంటి ముందే కార్‌ను పార్క్ చేశాడు. అయితే ఆదివారం ఒక్కసారిగా ఉన్నట్టుండి ఇంటి ముందు పార్క్ చేసిన అతని కారు నుంచి మంటలు రావడం స్టార్ట్ అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బకెట్లతో నీరు పోసి మంటలను ఆర్పేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటనాస్థలానికి చేరుకున్న హయత్‌నగర్ పోలీసులు దగ్ధమైన కారును పరిశీలించారు.మంటలు ప్రమాదవశాత్తు చెలరేగాయా? లేక ఎవరైనా కావాలనే కారుకు నిప్పంటించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన కారును ఆకతాయిలు కావాలనే తగలబెట్టారని యజమాని మాధవ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఘటనకు ముందు, తర్వాత అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు అక్కడ సంచరించాయా అనే వివరాలను సీసీటీవీ ద్వారా ఆరా తీస్తున్నారు. కారు పూర్తిగా దగ్ధం కావడంతో శంకర్‌నగర్‌లో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సీసీ కెమెరాల ఫుటేజీ, ఘటనాస్థలంలో లభించిన ఆధారాలను పరిశీలించిన తర్వాతే మంటలకు అసలు కారణం ఏంటన్నది తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి