
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Bigg Boss Agnipariksha Season 2: బిగ్‌బాస్ పదో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుండగా.. ఈ హౌస్‌లోకి సాధారణ వ్యక్తులకు అవకాశం కల్పిస్తోంది. గత సీజన్లో కామనర్ ట్రోఫీ ఎత్తుకెళ్లడంతో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో మరోసారి సాధారణ ప్రజలకు అవకాశం కల్పించడంలో భాగంగా అగ్నిపరీక్ష రెండో సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే కామనర్ల కేటగిరిలో కొందరిని ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న అగ్నిపరీక్షకు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. అగ్నిపరీక్షకు సంబంధించిన వీడియో విడుదల అవడంతో ప్రేక్షకులు ఆసక్తిగా గమనించారు. మొత్తం 70 మంది అగ్నిపరీక్షకు ఎంపికయ్యారు. వారిలో నుంచి పది నుంచి 15 మంది వరకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వారి ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా విడుదల చేసిన ప్రొమోలో గత సీజన్ మాదిరి ప్రశ్నలతోపాటు టాస్క్‌లు ఇచ్చి అగ్నిపరీక్షలో కామనర్లను ఎంపిక చేయనున్నారు. విడుదల చేసిన ప్రొమో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అగ్ని పరీక్షకు లక్షల్లో దరఖాస్తులు రాగా.. వాటిలో నిర్వాహకులు వడపోసి ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేయడానికి తీవ్రంగా శ్రమించారు. చివరికి 70 మందిని ఎంపిక చేశారని సమాచారం. ఎంపికైన వారిలో చివరకు 15మందిని ఎంపిక చేయనున్నారు. గత సీజన్‌కు వచ్చిన స్పందనతో ఈసారి కామనర్లను హౌస్‌లోకి ఐదు లేదా ఆరుగురికి అవకాశం ఇచ్చేలా కనిపిస్తోంది. 2024 సీజన్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ గెలుచుకోగా.. ఈసారి కూడా రైతు బిడ్డ కేటగిరీలో ఓ అమ్మాయికి అవకాశం ఇచ్చేలా కనిపిస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి కంటెంట్ చేస్తూ