అంటూ ఉంటే అది ఒక్క బిగ్ బాస్ షోలోనే.. అక్కడ అందరూ సమానమే అని అంటుంది అపూర్వ. దీంతో ఆ పాయింట్‌ని పట్టుకుని నవదీప్, బిందు మాధవి రెడ్ ఇస్తారు. పైగా అభిజిత్ ఆట నచ్చలేదు.. చదువు గురించి మాట్లాడాడు.. అది కూడా నాకు నచ్చలేదు అని అపర్ణ అంటుంది.అక్కడ జరిగిన సిట్యువేషన్ అది.. దానికి తగ్గట్టు అక్కడ చదువు గురించి మాట్లాడాల్సి వచ్చింది.. నా ఒపీనియన్ చెప్పడం తప్పా? అని అభిజిత్.. అది మీ ఇష్టం.. మీరు చెప్పింది నాకు నచ్చలేదు అని అంటున్నా అని అపర్ణ చెబుతుంది. మా ఇంట్లో మా అమ్మే హెడ్డు.. మీకు ఏదో జరిగిందని, అందరికీ అది వర్తించాలి.. అంతటా పురుషాధిక్యతే ఉందని అంటే ఎలా అని అభిజిత్ రెడ్ ఇస్తాడు. బిందు మాధవి కూడా రెడ్ ఇస్తుంది. వచ్చినప్పుడు ఎలా ఎంటర్టైన్ అయ్యానో.. ఇప్పుడు కూడా అదే ఫీలింగ్‌తో ఉన్నా.. నేను గ్రీన్ ఇస్తున్నా అని నవదీప్ అంటాడు. అలా ఆమెని హోల్డ్‌లో పెట్టేశారు.ఆ తర్వాత రోహిత్ నాయుడు అనే పర్సన్ వస్తాడు. షోని ఎంజాయ్ చేద్దామని వచ్చా అని అతను అంటే.. నువ్వు ఎంజాయ్ చేయడం కాదు.. షోని చూసి ఆడియెన్స్ ఎంజాయ్ చేయాలి.. అలా చేయించాలి.. అందుకే ఇక్కడ మాకు ఈ బాధ్యతను పెట్టారు అని అభిజిత్ అంటాడు. నువ్వు స్వీట్‌గా ఉన్నావ్.. నీకు స్వీట్ పెడతాను రా అని పిలుస్తుంది బిందు. స్వీట్స్.. పెట్టి.. మొహాన నీళ్లు కొడుతుంది. రెండు, మూడు సార్లు కొడుతుంది. అయినా రోహిత్ సైలెంట్‌గానే ఉంటాడు. ఎందుకు అలా సైలెంట్‌గా ఉంటున్నావ్.. ప్రశ్నించు, నిలదీయ్ అని శ్రీముఖి అంటుంది.ఆమెకంటూ ఏదో కారణం ఉండే ఉంటుంది కదా.. నన్ను రెచ్చగొట్టాలని చూస్తుందేమో అని రోహిత్ అంటాడు. నువ్వు కూడా ఆమె మొహాన నీళ్లు కొట్టు.. నీకు డేర్ ఇస్తున్నాం అని అంటుంది శ్రీముఖి. నీళ్లు కొట్టడానికి బిందు దగ్గరకు వెళ్తాడు రోహిత్. ఆ పని మాత్రం చేయకు.. మమ్మల్ని ఏమార్చాలని చూస్తున్నావా? అని అభిజిత్ అంటాడు. నేను ఈ పని ఎప్పటికీ చేయను అని రోహిత్ అంటాడు. నువ్వు నిజంగానే సాఫ్ట్‌గా, మంచోడివా? మా ముందు నటిస్తున్నావా? అని అడుగుతాడు అభిజిత్. స్టాండ్ తీసుకోవడం లేదు, నిజం కోసం నిలబడితేనే పర్సనాలిటీ తెలుస్తుంది.. మొహం మీద నీళ్లు కొడితే కూడా ఏం చేయలేదు.. అని బిందు, నవదీప్ రెడ్ ఇస్తారు. నీ కోసం నేను నిలబడతా.. ప్రతీ దానికి రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు.. కాం అండ్ కంపోజ్డ్గా ఉండటం మంచిదే.. కానీ మున్ముందు నీ వేరియేషన్స్ చూపించాలన్నట్టు గ్రీన్ ఇచ్చి హోల్డ్‌లో పెడతాడు అభిజిత్.గౌతం రాజు, రమ్య, ఐశ్వర్య, శ్రీరాం, సిక్కోలు సీమన్, సాక్షిత అంతా హోల్డ్‌లోకి వెళ్లిపోతారు. ఆ తర్వాత గౌరి త్రినేత్ర అనే అమ్మాయి వస్తుంది. ఇంత వరకు ఈ సీక్రెట్ ఎవ్వరికీ తెలీదు.. ఇంటర్ వరకు నేను అబ్బాయిని, ఆ తర్వాత అమ్మాయిని.. ట్రాన్స్ అంటే ఎన్నో అవమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆమె చెబుతూ ఉంటుంది. మధ్యలో నవదీప్ ఎంట్రీ ఇచ్చి.. ఇది ఇంత వరకు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని సీక్రెట్ అన్నావ్.. మళ్లీ అందరికీ తెలుసు అంటున్నావ్.. ఇదంతా కట్టు కథనా? ట్రాన్స్ అయిన ఒక్క కారణానికే లోపలకు పంపించాలా? అని నవదీప్, బిందు మాధవి, అభిజిత్ అడుగుతారు. కానీ అభిజిత్ మాత్రం గ్రీన్ ఇచ్చి హోల్డ్‌లో పెడతాడు.భాగి తుల్లూరు అని నెల్లూరు నుంచి ఓ మహిళ వచ్చింది. ఆమె మాట, యాస అన్నీ కూడా అమాయకంగా కనిపించాయి. తన జర్నీ, ప్రేమ, పెళ్లి కథ, భర్త గురించి చెప్పిన తీరుకి జడ్జ్‌లు అంతా నవ్వేశారు. అందరూ ఆమె జెన్యూన్‌గానే ఉందని నమ్మేశారు. నవదీప్ భర్తలా నటిస్తే ఆమె ఓ స్కిట్ కూడా చేసింది. ఇక ఆమె అమాయకపు మాటలు, నిజాయితీ ఇవన్నీ చూసి అభిజిత్, బిందు గ్రీన్ ఇస్తారు. కానీ ఇలానే నేరుగా పంపించలేం.. మిగతా వారితో తలపడు.. నీ సత్తాను చాటుకో.. అందుకే నేను రెడ్ ఇస్తా.. హోల్డ్‌లో పెడతాం అని నవదీప్ అంటాడు. అలా నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది.