.. అదే భయంగా ఉంది.. అని జోష్న చెప్పడంతో శ్రీముఖి ఎమోషనల్ అవుతుంది. అయినా నువ్వు ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్నావ్ అని శ్రీముఖి అంటుంది. అంతా నచ్చింది.. కానీ నీలోని టఫ్ సైడ్ కావాలి.. అందుకే రెడ్.. ఇస్తున్నా అని బిందు మాధవి అంటుంది.ఫుటా అనే జపాన్ వ్యక్తి వస్తాడు. మ్యూజిషీయన్ అని చెప్తాడు. తెలుగు నేర్చుకుంటున్నా అని అంటాడు.. నవదీప్ ఏమో గ్రీన్ ఇస్తాడు. లాంగ్వేజ్ ప్రాబ్లం అని బిందు మాధవి రెడ్ ఇస్తుంది. ఇంకా నేర్చుకుని నెక్ట్స్ ఇయర్ రండి అని నవదీప్.. రెడ్ ఇచ్చి హోల్డ్‌లో పెడతాడు. అభిజ్ఞ అనే ఓ టెకీ అమ్మాయి వస్తుంది. ఆమె ఉన్నంత సేపు సందడి సందడిగా ఉంటుంది. ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది. ఆమె రెండు చేతుల్లో కుండలు పెట్టి.. శ్రీముఖి నీళ్లు పోస్తుంటే నేనేం స్ట్రాంగ్ కాదు.. అని అంటుంది.మరి ఇక్కడే ఇలా అంటే.. లోపల ఏం చేస్తావ్ అని శ్రీముఖి అడుగుతుంది. ఓడిపోవడానికి వెళ్తున్నావా? అని శ్రీముఖి అంటే.. ఆడినా గెలిచినట్టే కదా అని ఆమె అంటుంది. కాలేజ్, కార్పోరేట్ ఈవెంట్లలో యాంకరింగ్ చేస్తా, డ్యాన్స్ చేస్తా అని అంటే.. ఆ కుండలతోనే డ్యాన్స్ చేయమంటారు. బబ్లీగా ఉన్నావ్.. నవ్విస్తున్నావ్.. సెన్సాఫ్ హ్యూమర్ ఉంది.. అనుకున్నది అనుకున్నట్టు చెప్పేస్తున్నావ్.. స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా ఉన్నావ్.. అని అభిజిత్ గ్రీన్ ఇస్తాడు.. యాటిట్యూడ్ నచ్చింది.. పార్టిసిపెంట్ ఇంపార్టెంట్.. గెలుస్తామా? లేదా? అన్నది తర్వాత అన్నావ్ కదా.. అది నచ్చింది అని బిందు మాధవి గ్రీన్ ఇస్తుంది.. నీ పాత్ర నచ్చింది.. చదువుకున్న తింగరిదానిలా ఉన్నావ్.. డైరెక్ట్‌గా టాప్ 15లోకి పెట్టలేం.. నీ స్పిరిట్ నాకు నచ్చింది.. అని నవదీప్ రెడ్ ఇచ్చి హోల్డ్‌లో పెడతాడు.సాయి శౌర్య, ధనలక్ష్మీ, రుచిత, హరి ప్రసన్న, సోని, నవీన్ అని కొంత మంది వస్తే.. వాళ్లకి నిమిషం కూడా స్క్రీన్ టైం ఇవ్వకుండా అటు నుంచే అటే పంపించేస్తారు. హేమంత్ అని హైదరాబాద్ కుర్రాడు వస్తాడు. మొదట్లో కాస్త తేడగా ప్రవర్తించినా.. ఆ తర్వాత తన కుటుంబం, తండ్రితో ఉన్న దూరం గురించి చెప్పి కాస్త ఎమోషనల్‌గా చేశాడు. అయితే అతను చెప్పిన కథకు, స్టేజ్ మీద ఫోన్లో నాన్నతో మాట్లాడిన మాటలకు మాత్రం సంబంధం లేనట్టుగా అనిపిస్తుంది. అందుకే నవదీప్, అభిజిత్ రెడ్ ఇచ్చి.. ఒక్క బిందు మాధవి మాత్రం గ్రీన్ ఇచ్చి హోల్డ్ చేస్తుంది.శ్రుతి, లవ్లీ చిన్నా, నమిత, రామకృష్ణ, మేరీ రోజి, వెంకటకృష్ణ వంటి వారిని అలా పిలిచి ఇలా పంపించేస్తుంటారు. చివరగా మంచిర్యాల నుంచి ప్రియాంక అనే అమ్మాయి వస్తుంది. యాంకర్, రిపోర్టర్‌గా పని చేస్తున్నాను అని చెప్పింది. ఆమె కథ నార్మల్‌గానే ఉన్నా.. స్టేజ్ మీద ఉన్నంత వరకు ఓ మోస్తరుగానే ఎంటర్టైన్ చేసింది. దీంతో ఆమెకి నవదీప్, అభిజిత్ గ్రీన్ ఇస్తారు. డైరెక్ట్‌గా పంపలేం.. ఇంకా చూడాలి అని రెడ్ ఇచ్చి హోల్డ్‌లో పెడుతుంది బిందు మాధవి. ఇక 70 మంది కంటెస్టెంట్ల ఆడిషన్స్ పూర్తయ్యాయ్ అని శ్రీముఖి చెబుతుంది.ఇప్పటి వరకు టాప్ 15లోకి కేవలం ముగ్గురే వెళ్లారని, 26 మందిని హోల్డ్‌లో పెట్టాం అని అంటుంది. అందులోంచి శ్రీనివాస్, గౌరి, రమ్య, గౌతమ్, ఐశ్వర్య, అభిజ్ఞ, శ్రీరామ్, సాక్షిత మీ జర్నీ ఎండ్.. అని.. మేం బెస్ట్లోంచి బెస్ట్ ఇవ్వాలని.. మళ్లీ అందరి ఆడిషన్స్ చూసి.. ఈ నిర్ణయం తీసుకున్నాం అని అంటారు. అసలు హోల్డ్ వరకు తీసుక వచ్చి.. ఇలా ఎలా చేస్తారో అయితే అర్థం కాలేదు. కనీసం హోల్డ్‌లో ఉన్న వారికి ఓ టాస్క్ పెట్టి.. అందులో పర్ఫామ్ చేయని వారిని తీసేస్తే ఓ పద్దతి గానీ ఇలా నేరుగా ఎలిమినేట్ చేయడం ఏంటో అర్థం కావడం లేదు. డైరెక్ట్‌గా తీసేసిన వారిలో రెండు గ్రీన్స్ వచ్చిన వారు ఉండటం విశేషం. మరి మున్ముందు ఇంకెన్ని విచిత్రాలు జరుగుతాయో చూడాలి.