

- అమెరికా ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ల మొగ్గు ఎటు?
- రిపబ్లికన్లకు 18 శాతమే.. డెమోక్రాట్ల వైపు 66శాతం
- ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ? డెమోక్రాట్లకు భారీ మద్దతు
- సర్వేలో ఆసక్తికర ఫలితాలు
US Midterm Elections 2026 : అమెరికా మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ-అమెరికన్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనేదానిపై ఆసక్తికరమైన సర్వే వెలుగులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ కన్నా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులకే ఇండియన్ అమెరికన్ ఓటర్లు ఎక్కువగా మద్దతు ఇస్తున్నట్లు తాజా జాతీయస్థాయి సర్వే వెల్లడించింది.
ఏషియన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ ఓట్ (APIAVote) నిర్వహించిన ఈ సర్వేలో ఇండియన్ అమెరికన్ ఓటర్లలో 66 శాతం మంది కాంగ్రెషనల్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులకు ఓటు వేయాలని భావిస్తున్నట్లు తేలింది.
18శాతం మాత్రమే రిపబ్లికన్లకు సపోర్టు :
అదే సమయంలో కేవలం 18 శాతం మంది మాత్రమే రిపబ్లికన్ అభ్యర్థులకు సపోర్టు ఇవ్వాలని భావిస్తున్నట్లు పేర్కొంది. సెనెట్ ఎన్నికల విషయానికి వస్తే.. డెమోక్రటిక్ అభ్యర్థులకు మద్దతు మరింత ఎక్కువగా ఉన్నట్లు సర్వే ఫలితాలు సూచించాయి. రిపబ్లికన్ సెనెట్ అభ్యర్థులకు 22 శాతం మంది ఇండియన్ అమెరికన్ ఓటర్లు అనుకూలంగా ఉన్నారు.నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు :
అమెరికాలో వచ్చే నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్థానాలు, 35 సెనెట్ సీట్లతో పాటు పలు స్థానిక పదవులకు సైతం ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా రాజకీయాల్లో ఈ మధ్యంతర ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి.
- రిపబ్లికన్లకు 18 శాతమే.. డెమోక్రాట్ల వైపు 66శాతం




