
© 2026 nimisham.in


Jogi Meghana: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో తలెత్తిన వరకట్న వేధింపుల వివాదం మళ్ళీ తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యవహారంలో జోగి రమేష్ కోడలు జోగి మేఘన(Jogi Meghana) స్వయంగా విజయవాడ రాజ్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ను కలిశారు. తన భర్త జోగి రాజీవ్, అత్తమామల నుండి తనకు ఎదురవుతున్న తీవ్రమైన గృహహింస, అదనపు కట్నం వేధింపులపై నమోదైన పోలీసు కేసుల పురోగతి గురించి గవర్నర్కు వివరించి, వినతిపత్రాన్ని సమర్పించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.






