
రైల్వే అధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థల మధ్య నెలకొన్న సమన్వయ లోపం ఔత్సాహికులకు శాపంగా మారింది. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మొదలైన కుట్టు, బ్యూటీషియన్, కంప్యూటర్ శిక్షణ కేంద్రం మూతపడింది
© 2026 nimisham.in

రైల్వే అధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థల మధ్య నెలకొన్న సమన్వయ లోపం ఔత్సాహికులకు శాపంగా మారింది. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మొదలైన కుట్టు, బ్యూటీషియన్, కంప్యూటర్ శిక్షణ కేంద్రం మూతపడింది
రైల్వేలో మూతపడ్డ శిక్షణ కేంద్రం దుమ్ము కొట్టుకుపోతున్న కుట్టు యంత్రాలు గుంతకల్లు, న్యూస్‌టుడే: రైల్వే అధికారులు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థల మధ్య నెలకొన్న సమన్వయ లోపం ఔత్సాహికులకు శాపంగా మారింది. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మొదలైన కుట్టు, బ్యూటీషియన్, కంప్యూటర్‌ శిక్షణ కేంద్రం మూతపడింది. ఫలితంగా రైల్వే డివిజన్‌ పరిధి, గుంతకల్లు పట్టణంలోని యువతులు శిక్షణ ద్వారా స్వయం ఉపాధి పొందే అవకాశం లేకుండా పోయింది. గతంలో డీఆర్‌ఎంగా పని చేసిన వి.పి.సింగ్‌ చొరవతో.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2017లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి శ్రీకారం చుట్టింది. నిరుపయోగంగా ఉన్న రైల్వే తెలుగు మాధ్యమ ఉన్నత పాఠశాల భవనాల్లో ప్రారంభించింది. రెండేళ్ల పాటు చక్కగా పని చేసిన ఈ కేంద్రం నిర్వహణను.. అనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. 2020 సంవత్సరంలో పడకేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు విద్యుత్తు మోటార్ల సాయంతో పనిచేసే 15 కుట్టు యంత్రాలతో పాటు కంప్యూటర్‌ కోర్సు నేర్పించేందుకు 30 ల్యాప్‌టాప్‌లను అందజేసింది. బ్యూటీషియన్‌ కోర్సు నేర్చుకునేందుకు రోజుకు 90 మంది వరకు మహిళలు, యువతులు వచ్చేవారు. ఉదయం, సాయంత్రం తరగతులు జరిగేవి. రెండేళ్లలో 500 మందికిపైగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం తరగతులను నిలిపివేయగా.. రైల్వే అధికారులు పట్టించుకోలేదు. కేంద్రానికి కేటాయించిన ల్యాప్‌టాప్‌లను అధికారులను పట్టుకెళ్లిపోగా.. కుట్టు యంత్రాలు బూజుపట్టి పాడవుతున్నాయి. కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలంటే రైల్వే అధికారుల సహకారం అవసరం. వారు ముందుకొస్తే తెరిచేందుకు సిద్ధంగా ఉన్నాం. నిర్వహణ బాధ్యత రైల్వే అధికారులే తీసుకోవాలని ఏపీసీసీడీసీ గుంతకల్లు ఇన్‌ఛార్జి లోకేశ్‌ అంటుండగా- అవసరమైతే మరిన్ని వసతులు అందుబాటులోకి తెస్తామని.. ఏపీసీసీడీసీ అధికారులే నిర్వహణ బాధ్యత తీసుకోవాలని గుంతకల్లు అదనపు డివిజనల్‌ రైల్వే మేనేజరు శివప్రసాద్‌ అంటుండటం గమనార్హం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







