
రాయగడ పట్టణం : ప్రియురాలి ఇంట్లో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. ఒడిశా రాష్ట్రం దేవగడ్ జిల్లా బాబరకోట్ గ్రామానికి చెందిన సిలు రాయ్ అనే యువకుడు రియామల్ ప్రాంతంలో ఉన్న ప్రియురాలి ఇంటికి బుధవారం రాత్రి వెళ్లాడు. దీంతో కోపోద్రిక్తులైన యువతి కుటుంబ సభ్యులు యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో యువకుడు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





