
ప్రొటీన్‌ బ్రెడ్‌తో రూ.కోటి టర్నోవర్‌ యువకుడు సన్నీరాజా విజయప్రస్థానం ప్రొటీన్‌ బ్రెడ్‌ గురించి అవగాహన కల్పిస్తూ.. రామ్‌నగర్, న్యూస్‌టుడే: ప్రొటీన్‌ కావాలంటే చికెన్, గుడ్లు, ఇతర ఆహార పదార్థాలనే తినాలా? బ్రెడ్‌లోనే దాన్ని అందిస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే నగరానికి చెందిన యువకుడు దువ్వాడ సన్నీరాజా(23)ను కొత్త ప్రయోగం వైపు నడిపించింది. ప్రొటీన్‌ ఆధారిత బ్రెడ్‌ను తయారు చేసి..దాన్ని మార్కెటింగ్‌ చేయడం ప్రారంభించాడు. అనతికాలంలోనే పీఎంపాలెంలో కెడ్యూ అనే సంస్థను ప్రారంభించి ఆంత్రప్రెన్యూర్‌గా మారాడు. మరో 10మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాడు. సంస్థలో బ్రెడ్‌ తయారు చేస్తూ.. ‘ప్రస్తుతం మల్టీగ్రెయిన్, ప్లెయిన్‌ రకాలుగా ప్రొటీన్‌ బ్రెడ్‌ అందిస్తున్నాం. ఒక బ్రెడ్‌ ముక్కలో 8.5 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. మధుమేహ బాధితులు అన్నం తినడానికే భయపడి ఆహారాన్ని తగ్గించేసి నీరసించిపోతున్నారు. అలాంటి వారికోసం అధిక ప్రొటీన్‌ ఉండే బ్రెడ్‌ని తయారు చేశాం. ఇందులో అదనపు చక్కెర, మైదా, గుడ్డు కలపలేదు. భవిష్యత్తులో ఇతర ఆహార ఉత్పత్తుల్లోనూ ప్రొటీన్‌ అందించే ఆలోచనలో ఉన్నాం’ అని సన్నీరాజా చెబుతున్నాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.