
ఇండియన్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో పాండిచ్చేరిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఈ నెల 16 నుంచి సౌత్ జోన్ జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది.
చర్ల: ఇండియన్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో పాండిచ్చేరిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఈ నెల 16 నుంచి సౌత్ జోన్ జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమైంది. ఈ పోటీల్లో చర్లకు చెందిన శ్రీవిద్య దొర తొలిరోజు బంగారు పతకాన్ని సాధించింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ అండర్‌-16 విభాగంలో 80 మీటర్ల హర్డల్స్ రేసును 12.21 సెకండ్లలో పూర్తి చేసి బంగారు పతకం సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే. మహీధర్ తెలిపారు. ఈ సందర్భంగా బంగారు పతకం సాధించిన శ్రీ విద్య దొరను తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ కే. సారంగపాణి, ఆర్గనైజేషన్ సెక్రటరీ పి. వెంకటేశ్వర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ అథ్లెటిక్స్ కోచ్ సునంద కోరి, రతన్ బోస్ తదితరులు అభినందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





